ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా
చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం,
ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను
ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదేమీ శిక్ష అన్నాడు.
పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా
తృల్లి పడ్డారు,పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.
అద్భుతం
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని
వాటా గురుంచి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి ??.
నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి
అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .
ఓం అరుణాచల శివ..అరుణాచల శివ.
అరుణాచల శివ🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🙏మన్రో గంగాళాలు" అంటే ఏవో తెలుసా
🙏
కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.
తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.
ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..
1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు,
నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు.
అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో
పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.
1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO "
దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి
ఆనంద నిలయ విమానం మీద వాయవ్యమూలకు గూడులాంటి చిన్న మందిరం వెండి మకరతోరణంతో అలంకరింపబడింది.ఆ మందిరంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు,హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై
వేంచేసి ఉన్నందువల్ల ఆయన "విమాన వేంకటేశ్వరుడు"గా పిలువబడుచున్నాడు.
ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని "వేంకటాచలమాహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి
మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం.ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట.
పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా "విమాన వేంకటేశ్వరస్వామి"వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని
తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో
లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం.. ఒకానొక సంధర్భంలో స్వామి వారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామి వారు సాక్షాత్తు వైకుంఠ నాధుడని, వైకుంఠంనుండి భూలోకంలో అర్చ
వతార మూర్తిగా అవతరించారని, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటుచేసిపచ్చకర్పూరంతో
నామంపెట్టి వక్షస్థలంలో వ్యూహాలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.
వక్షః స్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామనుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి. అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)
ప్రాణాయామం
సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.
శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు।
సంపూర్ణ శ్రీ వరలక్ష్మీ వ్రత పూజా విధానం🙏
మనం ఎదురు చూసే వరలక్ష్మి అమ్మవారి వ్రతం🙏
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది
శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి🙏
పసుపు, కుంకుమ,
గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది
శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.
ప్రాణాయామము 🙏
ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.
సంకల్పం 🙏
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, శుక్రవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి
ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు
*********************************
శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే
వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు
కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి
ఒంపుకుంటారు
అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి
తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి
తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు
అలా చేయకండి
రెండు చేతులలోకి తుడుచుకోండి
స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని
పూలు అయితే పైటకొంగులోనే తీసుకోవాలి
అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు
పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా