తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను
లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు.
ఆమె లేచి మాతో వచ్చి చేరుతుంది. అని గోదాదేవి గానం చేసింది.గోదాదేవి ఇతర గోపికల భగవన్నామస్మరణలు విని లేచి బయటకు వచ్చి వాళ్లతో కలిసింది

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

23 Dec
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు Image
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.
Read 6 tweets
22 Dec
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశనఱుం కుళల్ అయిచ్చ యర్మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి Image
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.
భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల
Read 5 tweets
9 Nov
#యాగంటి_బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది...
బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు.... ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది.. ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు
( ఇది ఒడ్డు, పొడుగు, ఎత్తు అన్ని వైపులా) ... ఈ విధంగా పెరిగే సరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది.. మొదట మండపం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట... ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి.. స్తంభాలలో సరిపోవటం లేదు... దీనిని పురావస్తు శాస్త్రజ్ఞులు
నిర్థారించారు...చిత్రంలో చూడండి.. ఇది నిజంగా ఎంత అద్భుతం ... ఈ క్షేత్రంలో ఇంకా చాలా మహిమలున్నాయి..
1. మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట... ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ...
Read 9 tweets
9 Nov
కార్తీకపురాణం - 5 వ అధ్యాయము

*వనబోజన మహిమ*
*కిరాత మూషికములు మోక్షము నొందుట*

ఓ జనక మహారాజా ! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును.
ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు
వెళ్ళుదురు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి
వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి , ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించ వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయును.
Read 17 tweets
8 Nov
*🚩#తిరుకడైవూర్🚩*
#నిజంగాజరిగినసంఘటన

తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధం గా ఉంటుంది..

అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...

#తిరుకడైవూర్ క్షేత్రం లొ అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు
అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు..

ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది

ఒక నాడు ఆలయం లొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు..
అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు..

పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ మధిరా పానం
Read 9 tweets
8 Nov
*కార్తీకపురాణం - 4 వ అధ్యాయము
*దీపారాధన మహిమ*
*శతృజిత్ కథ*

ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు *'మహితపస్విత ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది.
కార్తీక మాసము ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో , ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు'* అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.
జనకా ! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు , అనగా , సంధ్య
చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొందుదురు. కార్తీకమాస మందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్ప నూనెతో గాని , యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము
Read 21 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(