బ్రిటిషు వారు భారతీయుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడం గ్రహించి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) భారతీయులకి ఇస్తాము అని ప్రకటించటం మొదలుపెట్టారు.
అధినివేశ ప్రతిపత్తి అంటే రాష్ట్రస్థాయి పరిపాలన భారతీయుల చేతిలో ఉన్నా అంతిమ అధికారం బ్రిటిషువారి చేతులలోనే ఉంటుంది. అంటే భారతదేశంలో పూర్తి అధికారం భారతీయులకి ఉండదు.
ఇది గమనించిన మన సుభాష్ చంద్రబోస్, శ్రీ అరబిందో, బాల్ గంగాధర్ తిలక్, మన తెలుగు వారైనా బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ఇంకా ఎందరో స్వతంత్ర సమర యోధులు కలిసి...
అభినివేశ ప్రతిపత్తి కేవలం బ్రిటీషువారు తమ ఆధిపత్యం కొనసాగించటానికి వేస్తున్న ఇంకొక ఎత్తని దానిని తిరస్కరించి 'పూర్ణ స్వరాజ్జమే' కావాలని నినాదం మొదలు పెట్టారు.
ఈ పూర్ణ స్వరాజ్జం ఉద్యమంలో భాగంగా 26 జనవరి 1930 లో లాహోర్లో భారత దేశ జండాని ఎగురవేసి అన్ని రాష్ట్రాలవారిని అదే రోజున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోమన్నారు.
15 ఆగస్టు 1947న బ్రిటిషు వాళ్ళని భారతదేశం నుంచి తరిమేసాక స్వతంత్ర దినోత్సవంగా
మరియు
ఇదివరకు నిర్ణయించుకున్న 26 జనవరిని 1950లో మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చి గణతంత్ర దినోత్సవంగా నిర్ణయించారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మనము రోజూ వాడే ట్విట్టర్ ఇంకా సులభంగా వాడటానికి ఉపయోగ పడే ఎన్నో బాట్స్ ఉన్నాయి, అలానే మన ట్విట్టరు ఖాతా గురించి ఎంతో ఉపయోగపడే సమాచారం అందించే బాట్స్ కూడా చాలా ఉన్నాయి
వాటిలో కొన్ని ఉపయోగకరమైన ట్విట్టర్ బాట్స్ గురించి ఈ తీగలో చూద్దాం
ఏదైనా మీకు నచ్చిన ట్వీటుని మీరు తెరపట్టు ( స్క్రీన్ షాట్ ) తియ్యాలనుకుంటే ఈ బాట్ ఉపయోగ పడుతుంది. ఈ బాట్ ని అనుసరించటం అవసరమొచ్చినప్పు ఆ బాట్ ని టాగ్ చేసి 'స్క్రీంషాట్ థిస్' అని ఆంగ్లములో రాయాలి.
ట్విట్టర్లో ఎందరో అద్భుతమైన తీగలు రాస్తుంటారు చాలా సార్లు ఆ తీగల్ని దాచుకోవాలి అనుకుంటాము అలాంటప్పుడు ఈ బాట్ ఉపయోగపడుతుంది. ఏదైనా తీగని ఒక గొలుసు ద్వారా చూడాలి అనుకుంటే ఈ బాట్ ని అనుసరించండి...