Balagopal Bot Profile picture
Apr 25, 2022 13 tweets 2 min read Read on X
"ఆనాటి [దేశ విభజన] నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతికొద్ది ప్రాంతాలలో కశ్మీర్‌ ఒకటి. అయినా 'నాలుగు లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు కశ్మీర్‌ లోయ వదిలిపెట్టి పోలేదా?' అని [...] అడుగుతున్నారు." (1/13)

#BalagopalOnKashmir #BalagopalOnKashmiriPandits
Year - 2008
"నాలుగు లక్షల మంది పోలేదు గానీ రెండు లక్షలపైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువుల మీద దాడులు జరగడం అనుకుంటే పొరపాటు. 1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్థులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు." (2/13)
"అత్యధికం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ముస్లింలున్నారు. కశ్మీరీ ముస్లింలు గుంపులుగా పండిట్‌లపైన దాడి చేసిన ఒక్క ఘటనా జరగలేదు." (3/13)
"ఆనాటి నుంచి ఈనాటి దాకా కశ్మీర్‌లో సైన్యం చేతిలోనూ,మిలిటెంట్ల చేతిలోనూ, ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల చేతిలోనూ చనిపోయిన వారి సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 50 వేల నుంచి 80 వేల దాకా ఉంది. అందులో పండిట్‌ల సంఖ్య 300 మించి లేదు. మిగిలినవారంతా,ఎవరి చేతిలో చచ్చినా- కశ్మీరీ ముస్లింలే."(4/13)
"మిలిటెన్సీ కశ్మీరీ సంస్థల చేతినుంచి పాకిస్తాన్‌ కేంద్రంగా గల ఇస్లాంవాద సాయుధ సంస్థల చేతిలోకి పోయిన తరువాత మిలిటెంట్లు మూకుమ్మడిగా నిరాయుధులను చంపిన ఉదంతాలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ అంతకు ముందు అది కూడ లేదు." (5/13)
"అయినప్పటికీ పండిట్‌లు పెద్ద సంఖ్యలో వలస పోవడానికి తమ భవితవ్యాన్ని గురించి వారిలో ఏర్పడిన అభద్రతా భావమే కారణం. [అప్పుడు] లక్షల మంది వీధులలోకి వచ్చి ఇండియా వ్యతిరేక నినాదాలిస్తున్నారు. కొందరు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు ఇస్తున్నారు." (6/13)
"ప్రభుత్వ వ్యవస్థ కుప్ప కూలిపోయింది. పండిట్‌లు కళ్ళీర్‌ లోయ విడిచిపెట్టి పోవాలన్న పోస్టర్లు కొన్నిచోట్ల పడ్డాయి. దీనికి పండిట్‌లు భయపడటం సహజం." (7/13)
"పండిట్‌లను ప్రభుత్వం కాపాడజాలదనీ వారి భద్రత కోసం వారు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడం ఉత్తమమనీ రాష్ట్ర గవర్నర్‌ [జగ్‌మోహన్‌] స్వయంగా ప్రకటించడం పండిట్‌ల భయాన్ని మరింత పెంచి భారీ వలసకు దారితీసింది." (8/13)
"ఈ వలస కశ్మీరీలను కలవరపెట్టింది. హృదయనాథ్‌ జట్టో అనే కశ్మీరీ పండిట్‌, రిటైర్డ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఫ్తీ బహవుద్దీన్‌ ఫారూఖీలు కలిసి పండిట్‌లను వలస పోవద్దంటూ ఒక ప్రకటన జారీ చేశారు." (9/13)
"వారిద్దరి నేతృత్వంలో వలసలను అరికట్టే
లక్ష్యం గల ఒక కమిటీ ఏర్పడింది. కానీ దానిని గవర్నర్‌ జగ్‌మోహన్‌ సాగన్విలేదు.
జమ్మూకు చెందిన బలరాజ్‌ పురి అనే మానవ హక్కుల వాది గవర్నర్‌ చర్యకు ఆగ్రహించి ఆయనను కలిసి ఎందుకీ పని చేశావని అడగగా, జగ్‌మోహన్‌ చెప్పిన జవాబు ఏమిటంటే - (10/13)
'కశ్మీర్‌లో హిందువులూ ముస్లింలూ సఖ్యంగా బతికితే భారత సైన్యం మనోస్థయిర్యం దెబ్బ తింటుంది' అని" (11/13)
"వాస్తవాలు మనకు ఎంత అప్రియంగా ఉన్నా వాటిని గుర్తించడానికి నిరాకరించడం విజ్ఞత అనిపించుకోదు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఓపిక లేక మన విశ్వాసాలనే సత్యాలుగా ప్రచారం చేసుకోవడం నాగరిక వైఖరి అనిపించుకోదు." (12/13)
- K Balagopal, 'కశ్మీర్ లో మన కర్తవ్యం' , ఆంధ్రజ్యోతి దినపత్రిక, 27th August 2008. (13/13)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Balagopal Bot

Balagopal Bot Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Bot_Gopal

May 13, 2021
Why are so many Indians supporting Israel?
Here's what Balagopal wrote in 2001 about Indians supporting United States' war on terror:

"For many in India, there is an even less defensible reason for wanting to egg the US on: the
muslims should be taught a lesson."
"It is even being said by influential columnists that there is Islamic terrorism in the world because Islam is terror, and the faster the world realises this the better. One does not have to quote from the Quran to answer this."
"One does not have to argue abstractly that religion by itself does not make any body violent. It is a fact of history that organized violence to subserve their ends, noble as well as ignoble, has been perpetrated by armed groups of all communities."
Read 7 tweets
May 12, 2021
"క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం" from మత తత్వం పై బాలగోపాల్

"ముస్లింల వంతు అయింది. ఇప్పుడు (క్రైస్తవుల వంతు వచ్చింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలలో కైస్తవులపైన దాడులు ఒక పరంపరగా జరుగుతున్నాయి. కొన్ని దాడులు సాధారణ గూండాలు, రౌడీలు చేయగా కొన్ని
విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌
కార్యకర్తలు చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే 'సంఘ్‌ పరివార్‌' కార్యకర్తలు చేస్తున్న
'దాడులనే కాక రౌడీ మూకలు చేస్తున్న అకృత్యాలను కూడా 'హిందువుల న్యాయమైన
ఆగ్రహం' పేరిట సంఘ్‌ పరివార్‌ నాయకత్వం వెనకేసుకొస్తున్నది.
క్రైన్తవ మిషనరీలు సంఘసేవ పేరిట రకరకాల ప్రలోభాలు చూపించి హిందువులను క్రైస్తవులుగా.
మారుస్తున్నారనీ దానికి ఆగ్రహించిన హిందువులు ఈ దాడులకు పాల్పడుతున్నారనీ విశ్వహిందూ పరిషత్‌ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
Read 26 tweets
May 12, 2021
"This is about the 'trial' so-called.
Meanwhile, in prison, the political
prisoner again suffers a regime that is
palpably different-and much 'more
undemocratic-than that the non-political
undertrials suffer. Prisons are supposed
to be governed by manuals of rules; (1/4)
these rules usually differ slightly from state to state but all of them belong to a subterranean world that has not heard of things like justice and fundamental rights. The hallmark of the manuals is a total arbitrariness: rules of discipline, procedures for inquiry and (2/4)
award of punishment are all arbitrary. And thus, without any need to
define new prison rules for political
prisoners, they can be and are being
treated as a different category of prisoners
to whom even the minimum rights available to ordinary undertrials are not
available." (3/4)
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(