"పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకెళ్ళి మూరేసిందట!" #తెలుగుసామెత 🤗
ఈ మీటర్లు సెంటీమీటర్లు ఇవన్నీ
వాడుకలో లేని రోజుల్లో.. #బెత్త, #జేన, #మూర వీటితోనే
కొలతలు కొలిచేవారు.. ఇప్పటికీ ఇవి వాడేవారు ఉన్నారు. రెండు బెత్తలు ఐతే ఒక జేన, రెండు జేనలు
ఐతే ఒక మూర. మూరెయ్యటం అంటే
ఎన్ని మూరలో చూడటం.
మన జేజమ్మలు #పదహారుమూరల చీర కట్టుకునేవారు,
మన అమ్మమ్మల కాలానికి వచ్చేసరికి #పద్నాలుగుమూరల#చీర అయింది, మన అమ్మలకి వచ్చేసరికి అది #పన్నెండుమూరలు అయింది. ఇక ఈ కాలంలో అది
పెద్ద మ్యాటర్ కాదనుకోండి.
సరే ఇక సామెతకి వస్తే...
ఎవరో ఒక అమ్మాయి ఒక
పెద్దావిడ దగ్గరకి వెళ్ళి 'అమ్మా నాకు చీర కొనుక్కోవటానికి డబ్బులు లేవూ ఒక పాత చీర ఇవ్వమ్మా' అని అడిగింది. సరే అని దయతలచి ఒక
చీర కట్టుకోమని ఇచ్చింది ఆ పెద్దావిడ. అది తీసుకున్న ఈ టెక్కులాడి గోడ చాటుకు వెళ్ళి, ఆ చీర ఎన్ని
మూరలుందో కొలుచుకుంటోందట!
అసలు ఆ చీర ఎన్ని మూరలు ఉంటే ఏంటి? చీర పుణ్యానికేగా వచ్చింది..!!
అలా ఎవరికన్నా సహాయం చేసినప్పుడు, అవతలి
వాళ్ళు ఆ సహాయం యొక్క విలువని పరిక్షిస్తుంటే ఈ సామెత వాడతారు!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, 'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది, తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.🤞
ఆరుద్ర జూన్ 22- జూలై 5 కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే.
‘ఆరుద్ర వాన అదను వాన,
ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, #ఆరుద్రకార్తె విత్తనానికిఅన్నం పెట్టిన ఇంటికి చెరుపులేదు,ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి లాంటి #సామెతలు.
#వయ్యారిభామ ( #parthinium) మన చుట్టూ పరిసరాల్లో కనిపించే ప్రమాదకరమైన మొక్క ఇది..
దీని గురించి నిజాలు తెలిస్తే షాకవుతారు..! పొలాల గట్ల వెంబడి అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతుంటాయి.
ఇలా పెరిగే మొక్కలలో వయ్యారి భామ మొక్క ఒకటి. అందమైన పేరు కలిగి ఉన్నప్పటికీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక, ముక్కు పుల్లాకు గడ్డి మొక్క అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది.
పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్రజలపై, పశువులపై కూడా దుష్పభ్రావాలను చూపిస్తుంటుంది. పంటలకు వేసే ఎరువులను కూడా ఈ మొక్క లాగేస్తుంది.
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు.
రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
అధర్మముతో ఉన్న వాలితో
స్నేహము చేసి సీతమ్మని తెచ్చుకోవడముకన్నా
సుగ్రీవునితో స్నేహము చేసి వాలిని సంహరిచి కష్టపడి సేతువు కట్టి యుద్ధము చేసి రావణుని
సంహరించి సీతమ్మను పొందుతాను అన్నాడు.
పెళ్ళి కూతురుగా సీతమ్మతల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట.
ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే)
ఉన్నంత సేపు ఎర్రని..
పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పాయట
(#కుంద ప్రసూనాయితాః) ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన
శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట.✨💫
ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ
సమాః' - రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు
తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు.
అయోధ్యకాండ, #అరణ్యకాండ వచ్చేసాయి.
యత్ క్రౌంచ మిథునా దేకమ్' -
రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని
క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి
ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు.
పురాణ గాథ.✨ #ఋతూనాం#కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "#ఉగాది, "#శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి.
అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.
ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.