తొలకరి వానలు ఆషాఢంలో #మృగశిరకార్తె సుమారు జూన్‌
8- 21లో ప్రవేశిస్తాయి.🤞

"మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి, మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి"

మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది,
మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి,
మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, 'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది, తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.🤞
ఆరుద్ర జూన్‌ 22- జూలై 5 కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే.
‘ఆరుద్ర వాన అదను వాన,
ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు,
#ఆరుద్రకార్తె విత్తనానికిఅన్నం పెట్టిన ఇంటికి చెరుపులేదు,ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి లాంటి #సామెతలు.
తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02).

#పునర్వసు, #పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’
అనే సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే..
#ఆశ్లేషకార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి.
అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే.
ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట
ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి'🤞
ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’
మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు.

#మఖ (ఆగష్టు 17- 30) #శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి,
మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’
లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి..ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు.
మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం,
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’
పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు సామెతలు దీన్ని సూచిస్తాయి. ‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే,
అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది.
ఉత్తర చూసి ఎత్తరగంప
ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే #ఈసామెతఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు #జానపదులు.
ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే..._
#ఉత్తరపదునుఉలవకేఅదును
అనే సామెత పుట్టింది.
ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, #విశాఖచూసివిడవరకొంప
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’
లాంటి సామెతలూ ఇలాంటివే._
ఉత్తర తరువాత వచ్చేది హస్త సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11
ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది.
#చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం.
‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే_
హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట.
హస్త, చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి, #చిత్తస్వాతులుకురవకపోతే #చిగురుటాకులుమాడిపోతాయి. లాంటి సామెతలు చాలా ఉన్నాయి.

యథా చిత్త తథా స్వాతి

చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి._
#స్వాతివాన చేనుకు హర్షం (మెట్ట ప్రాంతం), #చిత్తచిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’
లాంటి #సామెతలుతెలుగులో ఎన్నో ఉన్నాయి.

#విశాఖకార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు.
ఈ అనుభవంతో వచ్చిన సామెత.
#విశాఖకురిస్తేపంటకువిషమే.
అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే...._
#విశాఖవర్షంఆముదాలకుహర్షం!
ఇక '#భరణి' (ఏప్రిల్‌ 27- మే 10),_
'కృత్తిక' (మే 11- 24), 'రోహిణి '(మే 25- జూన్‌ 7)లపై..

భరణి కురిస్తే ధరణి పండును, #కృత్తికలోవిత్తితేకుత్తుకలునిండవు,
రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’*
లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు._
#ఊరిముందరిచేనుఊళ్లోవియ్యం అందిరావు

ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద... ఇంత కష్టం ఉంటుంది.

ఇక ఊళ్లో వియ్యం సంగతి... భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో,
ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది.

ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే._ #కర్ణునితోభారతంసరి
#కార్తీకంతోవానలుసరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’ ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి.
వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.🤞

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with కన్నేపల్లి~సరస ~Textrovert

కన్నేపల్లి~సరస ~Textrovert Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Ksravishankar2

Jun 10
"పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకెళ్ళి మూరేసిందట!"
#తెలుగుసామెత 🤗

ఈ మీటర్లు సెంటీమీటర్లు ఇవన్నీ
వాడుకలో లేని రోజుల్లో.. #బెత్త, #జేన, #మూర వీటితోనే
కొలతలు కొలిచేవారు.. ఇప్పటికీ ఇవి వాడేవారు ఉన్నారు. రెండు బెత్తలు ఐతే ఒక జేన, రెండు జేనలు
ఐతే ఒక మూర. మూరెయ్యటం అంటే
ఎన్ని మూరలో చూడటం.
మన జేజమ్మలు #పదహారుమూరల చీర కట్టుకునేవారు,
మన అమ్మమ్మల కాలానికి వచ్చేసరికి #పద్నాలుగుమూరల #చీర అయింది, మన అమ్మలకి వచ్చేసరికి అది #పన్నెండుమూరలు అయింది. ఇక ఈ కాలంలో అది
పెద్ద మ్యాటర్ కాదనుకోండి.
సరే ఇక సామెతకి వస్తే...
ఎవరో ఒక అమ్మాయి ఒక
పెద్దావిడ దగ్గరకి వెళ్ళి 'అమ్మా నాకు చీర కొనుక్కోవటానికి డబ్బులు లేవూ ఒక పాత చీర ఇవ్వమ్మా' అని అడిగింది. సరే అని దయతలచి ఒక
చీర కట్టుకోమని ఇచ్చింది ఆ పెద్దావిడ. అది తీసుకున్న ఈ టెక్కులాడి గోడ చాటుకు వెళ్ళి, ఆ చీర ఎన్ని
మూరలుందో కొలుచుకుంటోందట!
Read 4 tweets
Jun 9
#వయ్యారిభామ ( #parthinium) మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే ప్ర‌మాద‌క‌ర‌మైన మొక్క ఇది..
దీని గురించి నిజాలు తెలిస్తే షాక‌వుతారు..! పొలాల గ‌ట్ల వెంబ‌డి అనేక ర‌కాల క‌లుపు మొక్క‌లు పెరుగుతుంటాయి. ImageImage
ఇలా పెరిగే మొక్క‌ల‌లో వ‌య్యారి భామ మొక్క ఒక‌టి. అంద‌మైన పేరు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ.. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క‌లుపు మొక్క‌. దీనిని క్యారెట్ గ‌డ్డి, న‌క్ష‌త్ర గ‌డ్డి, ముక్కు పుడ‌క‌, ముక్కు పుల్లాకు గ‌డ్డి మొక్క అని వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు.
ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాల‌ను నాశ‌నం చేస్తుంది.
పంట దిగుబ‌డిని త‌గ్గిస్తుంది. అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్ర‌జ‌లపై, ప‌శువులపై కూడా దుష్ప‌భ్రావాల‌ను చూపిస్తుంటుంది. పంట‌ల‌కు వేసే ఎరువుల‌ను కూడా ఈ మొక్క లాగేస్తుంది.
Read 5 tweets
Apr 8
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు.
రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
అధర్మముతో ఉన్న వాలితో
స్నేహము చేసి సీతమ్మని తెచ్చుకోవడముకన్నా
సుగ్రీవునితో స్నేహము చేసి వాలిని సంహరిచి కష్టపడి సేతువు కట్టి యుద్ధము చేసి రావణుని
సంహరించి సీతమ్మను పొందుతాను అన్నాడు.
Read 4 tweets
Apr 8
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః" ✨💫
పెళ్ళి కూతురుగా సీతమ్మతల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట.
ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే)
ఉన్నంత సేపు ఎర్రని..
పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పాయట
(#కుంద ప్రసూనాయితాః) ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన
శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట.✨💫
Read 4 tweets
Apr 8
#రామాయణములో #ఆరుకాండలు
✨✨💫💫
“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ సమాః |
యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్" ||

'మా నిషాదః' - లక్ష్మిని పొందినవాడా - సీతమ్మతల్లి #పరిణయం -
రామాయణములో #బాలకాండ వచ్చేసింది.
ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ
సమాః' - రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు
తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు.
అయోధ్యకాండ, #అరణ్యకాండ వచ్చేసాయి.
యత్ క్రౌంచ మిథునా దేకమ్' -
రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని
క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి
ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు.
Read 5 tweets
Apr 1
పురాణ గాథ.✨
#ఋతూనాం #కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "#ఉగాది, "#శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి.
అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.

ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(