#నవ్వుకోండి 😆😆
Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు.
ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది. అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు.
నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. (అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా body gaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది.
ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని, నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో propose చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితి గానే ఉండేది.
నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో.
ఆ తర్వాత మా నాన్నగారికి transfer అవటం....
మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు.
అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... exitement తో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది.
మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే.... Yes అతనే, సీరియస్ గా Suit Case సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు. నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం,
full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా.
ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, BP పెరిగింది.
ఒకటి....రెండు.... అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను....
Aunty, మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి" దొంగ సచ్చినోడు
చెత్త వెధవ పండు గెడ్డం గాడు
వాడి గుడ్లు పీకా
వాడికి Carona రానూ
----😆😆😆
(వాట్సాప్ నుండీ)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, 'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది, తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.🤞
ఆరుద్ర జూన్ 22- జూలై 5 కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే.
‘ఆరుద్ర వాన అదను వాన,
ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, #ఆరుద్రకార్తె విత్తనానికిఅన్నం పెట్టిన ఇంటికి చెరుపులేదు,ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి లాంటి #సామెతలు.
"పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకెళ్ళి మూరేసిందట!" #తెలుగుసామెత 🤗
ఈ మీటర్లు సెంటీమీటర్లు ఇవన్నీ
వాడుకలో లేని రోజుల్లో.. #బెత్త, #జేన, #మూర వీటితోనే
కొలతలు కొలిచేవారు.. ఇప్పటికీ ఇవి వాడేవారు ఉన్నారు. రెండు బెత్తలు ఐతే ఒక జేన, రెండు జేనలు
ఐతే ఒక మూర. మూరెయ్యటం అంటే
ఎన్ని మూరలో చూడటం.
మన జేజమ్మలు #పదహారుమూరల చీర కట్టుకునేవారు,
మన అమ్మమ్మల కాలానికి వచ్చేసరికి #పద్నాలుగుమూరల#చీర అయింది, మన అమ్మలకి వచ్చేసరికి అది #పన్నెండుమూరలు అయింది. ఇక ఈ కాలంలో అది
పెద్ద మ్యాటర్ కాదనుకోండి.
సరే ఇక సామెతకి వస్తే...
ఎవరో ఒక అమ్మాయి ఒక
పెద్దావిడ దగ్గరకి వెళ్ళి 'అమ్మా నాకు చీర కొనుక్కోవటానికి డబ్బులు లేవూ ఒక పాత చీర ఇవ్వమ్మా' అని అడిగింది. సరే అని దయతలచి ఒక
చీర కట్టుకోమని ఇచ్చింది ఆ పెద్దావిడ. అది తీసుకున్న ఈ టెక్కులాడి గోడ చాటుకు వెళ్ళి, ఆ చీర ఎన్ని
మూరలుందో కొలుచుకుంటోందట!
#వయ్యారిభామ ( #parthinium) మన చుట్టూ పరిసరాల్లో కనిపించే ప్రమాదకరమైన మొక్క ఇది..
దీని గురించి నిజాలు తెలిస్తే షాకవుతారు..! పొలాల గట్ల వెంబడి అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతుంటాయి.
ఇలా పెరిగే మొక్కలలో వయ్యారి భామ మొక్క ఒకటి. అందమైన పేరు కలిగి ఉన్నప్పటికీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక, ముక్కు పుల్లాకు గడ్డి మొక్క అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది.
పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్రజలపై, పశువులపై కూడా దుష్పభ్రావాలను చూపిస్తుంటుంది. పంటలకు వేసే ఎరువులను కూడా ఈ మొక్క లాగేస్తుంది.
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు.
రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
అధర్మముతో ఉన్న వాలితో
స్నేహము చేసి సీతమ్మని తెచ్చుకోవడముకన్నా
సుగ్రీవునితో స్నేహము చేసి వాలిని సంహరిచి కష్టపడి సేతువు కట్టి యుద్ధము చేసి రావణుని
సంహరించి సీతమ్మను పొందుతాను అన్నాడు.
పెళ్ళి కూతురుగా సీతమ్మతల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట.
ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే)
ఉన్నంత సేపు ఎర్రని..
పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పాయట
(#కుంద ప్రసూనాయితాః) ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన
శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట.✨💫
ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీ
సమాః' - రాజ్యమునందు ప్రతిష్టింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు
తండ్రిని నిలపెట్టడము కోసము రాజ్యత్యాగము చేసి అరణ్యవాసము చేసాడు.
అయోధ్యకాండ, #అరణ్యకాండ వచ్చేసాయి.
యత్ క్రౌంచ మిథునా దేకమ్' -
రెండు క్రౌంచములలో దారితప్పి కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలోని
క్రౌంచపక్షిని కొట్టినవాడా – అన్నయిన వాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి
ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు.