#శ్రీమన్నారాయణీయము
#అంబరీషోపాఖ్యానము
1)వైవస్వతాఖ్యమనుపుత్ర నభాగజాత-
నాభాగనామక నరేంద్రసుతో అంబరీషః।
సప్తార్ణవావృతమహీదయితోఽపి రేమే
త్వత్సంగిషు త్వయి చ మగ్నమనాస్సదైవ॥
భావము:-
వైవస్వత మనువు పుత్రుడు నభాగుడు,ఆ నభాగుని పుత్రుడు నాభాగుడు; ఈ నాభాగుని పుత్రుడే 'అంబరీషుడు'. నారాయణమూర్తీ!+
అంబరీషుడు సప్తసముద్రములు ఆవరణగాగల భూమండలమును పరిపాలించు మహాచక్రవర్తే అయినను నీయందు ధృఢమైన భక్తికలవాడు; సదా నీభక్తుల సేవయందే నిమగ్నుడైయుండెడువాడు.
2)త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోఽస్య
భక్త్యైవ దేవ న చిరాదభృథాః ప్రసాదమ్।
యేనాస్య యాచనమృతేఽప్యభిరక్షణార్ధం
చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారమ్॥
భావము:-
ప్రభూ! అంబరీషుడు తన మనసును నీయందే లగ్నము చేసుకొని, తను చేయు సకలకర్మలను భక్తితో నీకు అర్పించు చుండెను; అచిర కాలముననే నీకు మిక్కిలి
ప్రీతిపాత్రుడయ్యెను. ప్రభూ! నీవు సంతసించి, ఆ అంబరీషునకు, రక్షణార్ధము, వేయిఅంచులుగల చక్రాయుధమును అనుగ్రహించితివి.

3)స ద్వాదశీవ్రతమథో భవదర్చనార్థం
వర్షం దధౌ మధువనే యమునోపకంఠే।
పత్న్వా సమం సుమనసా మహతీం వితన్వన్
పూజాం ద్విజేషు విసృజన్ పశుషష్టికోటిమ్.॥
భావము:-
నారాయణమూర్తీ! అంబరీషుని
భార్యకూడా నీయందు నిర్మలమైన భక్తికలిగిన సాధ్వి. అంబరీషుడు ఆమెతో కలిసి యమునానదీ తీరమునగల మధువనమునందు 'ద్వాదశీవ్రతమును' ఒక సంవత్సరకాలముగా భక్తితో ఆచరించుచుండెను; విప్రులను పూజించి వారికి అరువది కోట్ల గోవులను దానముచేసెను.
4)తత్రాఽథ పారణదినే భవదర్చనాంతే
దుర్వాససాస్య మునినా భవనం ప్రపేదే।
భోక్తుం వృతశ్చ స నృపేణ పరార్తిశీలో
మందం జగామ యమునాం నియమాన్ విధాస్యన్॥
భావము:-
నారాయణమూర్తీ! 'ద్వాదశీవ్రతము' ముగిసి, తీర్ధప్రసాదములను స్వీకరించు ( పారణ) ద్వాదశ ఘడియలు ఆసన్నమయ్యెను. ఆసమయములో 'దూర్వాస మహాముని'
అంబరీషుని రాజప్రసాదమునకు వచ్చెను. అంబరీషుడు - ఆ మునీశ్వరునిని తనతో కలిసి భుజించ వలసినదని కోరెను. 'దూర్వాసుడు' అందుకు అంగీకరించి, భోజనమునకు ముందు ఆచరించు నియమములను నిర్వర్తించుకొని వత్తునని యమునానదికి వెడలెను; స్నానాది కార్యక్రమములను కాలాతీతముగా నిర్వర్తించసాగెను.
5)రాజ్ఞాఅఽథ పారణ ముహుర్తసమాప్తిఖేదాద్
వారైవ పారణమకారి భవత్పరేణ।
ప్రాప్తో మునిస్తదథ దివ్యదృశా విజానన్
క్షిప్యన్ కృధోద్దృతజటో వితతాన కృత్యామ్॥
భావము:-
'దూర్వాసుడు' యమునా నది నుండి తిరిగివచ్చుట ఆలస్యమగుచుండెను. ఇంతలో ద్వాదశి తిథి ఉండగనే పారణ (ఉపవాసము ముగించి ప్రసాదము స్వీకరించుట)
చేయవలసి ఉండిన, ద్వాదశఘడియలు దాటిపోవుచుండెను. సమయము మించినచో చేసిన వ్రతము నిష్ప్రయోజనమగునని తలచి, ప్రభూ! నారాయణమూర్తీ! నీ భక్త పరాయణుడగు అంబరీషుడు (స్వల్ప) తీర్ధమును స్వీకరించి పారణ జరిపెను. దివ్యదృష్టితో ఇది గ్రహించిన 'దూర్వాసుడు' (తనను భోజనమునకు పిలిచి వేచియుండలేదని నిందించి)
క్రోధముతో తన జట నుండి ఒక పాయను తీసి 'కృత్యను' (హింసాత్మక శక్తిని) సృష్టించి ఆ 'అంబరీషుని' పైకి వదిలెను.
6)కృత్యాం చ తామసిధరాం భువనం దహంతీం
అగ్రేఽభివీక్ష్య నృపతిర్న పదాచ్చకంపే।
త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే
కృత్యానలం శలభ యన్మునిమన్వధావీత్॥
భావము:-
'దూర్వాసునిచే' సృష్టించబడిన
ఆ 'కృత్య' - ఖడ్గము ధరించి లోకమునెల్లా దగ్ధము గావించుచూ విలయము సృష్టించసాగెను. అయినను 'అంబరీషుడు' ఎంతమాత్రమూ చలించక స్థిరముగా నిన్నే ప్రార్ధించుచుండెను. అప్పుడు ప్రభూ! నారాయణమూర్తీ! నీవు ప్రసాదించిన (వేయి అంచులు కలిగిన) సుదర్శన చక్రము - నీ భక్తుని కష్టమునుచూచి- మండుచున్న జ్వాలలతో
ఆ ' కృత్యను' (దుష్ట శక్తిని) దహించివేసెను; 'దూర్వాసముని' వెంటపడి అతనిని తరమసాగెను.

7)ధావన్నశేషభువనేషు భియా స పశ్యన్
విశ్వత్రచక్రమపి తే గతవాన్ విరించమ్।

కః కాలచక్రమతిలంఘయతీత్యపాస్తః
శర్వం యయౌ స చ భవంతమవందతైవ॥
భావము:-
'దూర్వాసుడు' ఆ సుదర్శన చక్రమును తప్పించుకొనుటకై సకల లోకములను
తిరగసాగెను. బ్రహ్మదేముని శరణుకోరెను. కాలచక్రమును అధిగమించుట ఎవరితరము? అనిపలికి 'బ్రహ్మ' మిన్నకుండెను. దూర్వాసుడు శివుని వద్దకు వెళ్ళగా, ప్రభూ! నారాయణమూర్తీ! 'పరమ శివుడు' - దేవదేవుడవైన నిన్ను తలుచుకొని నమస్కరించెను గాని ఆ 'దూర్వాసుని' రక్షించలేదు.
8)భూయో భవన్నిలయమేత్య మునిం నమంతం
ప్రోచే భవానహమృషే నను భక్తదాసః।
జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం
యాహ్యంబరీషపదమేవ భజేతి భూమన్॥
భావము:-
విశ్వేశ్వరా! అంతట, ఆ 'దూర్వాసముని', నీ స్ధానమయిన వైకుంఠము చేరి నిన్ను శరణుకోరెను. ప్రభూ! అప్పుడు దూర్వాసునితో నీవు ఇట్లంటివి. "నేను భక్తులకు
దాసుడను. తపస్సైనను, జ్ఞానమేయైననూ వినయముతో కలిసి ఉండినచో గౌరవము; శక్తి ఉండును (అది నీలో లోపించినది). నిన్ను రక్షించువాడు అంబరీషుడు మాత్రమే; నీవు అతనినే శరణువేడుము", అని పలికితివి.
9)తావత్ సమేత్య మునినా స గృహీతపాదో
రాజాఽపసృత్య భవదస్త్రమసావనౌషీత్।
చక్రే గతే మునిరదాదఖిలాశిషోఽస్మై
త్వద్భక్తిమాగసికృతే౾పి కృపాం చ శంసన్॥
భావము:-
దూర్వాసుడు, గర్వమణిగినవాడై, అంబరీషుని వద్దకు తిరిగివచ్చి, అతని పాదములకు సాగిలపడబోయెను. అంతట, నీ భక్తుడయిన అంబరీషుడు, దూరముగా
తొలగి, ప్రభూ! నారాయణమూర్తీ! నీ సుదర్శనచక్రమును స్తుతించెను. వెనువెంటనే, ఆ సుదర్శనచక్రము దూర్వాసుని వదలి వెడలిపోయెను. అప్పుడు దూర్వాస మునీంద్రుడు - అపకారము తలపెట్టిన వానిపైకూడా 'కరుణ చూపిన భక్తుడవని' అంబరీషుని ప్రశంసించెను; ఆశీర్వదించెను
10)రాజా ప్రతీక్ష్య మునిమేకసమామనాశ్వాన్
సంభోజ్య సాధు తమృషిం విసృజన్ ప్రసన్నమ్।
భుక్త్వా స్వయం త్వయి తతోఽపి దృఢం రతోఽభూత్
సాయుజ్యమాప చ సమాం పవనేశ పాయాః॥
భావము:-
సుదర్శనచక్రము ఆ దూర్వాస మునిని తరుముచూ తిరిగి తిరిగి, అంబరీషుని వద్దకు చేరుటకు ఒక సంవత్సర కాలము పట్టెను.
ఆ సంవత్సరకాలమూ, అంబరీషుడు నిరాహారుడై ఆ మునీశ్వరుని రాకకై ఎదురు చూచుచుండెను. ఆ ముని తిరిగిరాగా - ఆహారమొసగి ఆ ముని భుజించిన పిమ్మట తానును భుజించెను. మునుపటికంటెను నీయందు ధృడభక్తితో అంబరీషుడు తన శేషజీవితమును గడిపి, పిదప, ప్రభూ! నారాయణమూర్తీ!
నీ సాయుజ్యమును పొందెను. అంతటి మహిమాన్వితుడవయిన ఓ! గురవాయూరు పురవాసా! నన్ను కాపాడుము.🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with లక్ష్మి

లక్ష్మి Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @jayahanuma

Jul 11
విష్ణుమూర్తే   4నెలలు ( చాతుర్మాసం)  నిద్ర పోతే ఇంక మనం చేసే పూజలు ఎవరికి??!!

నిన్న తొలి ఏకాదశి రోజు నుండి 4నెలలూ విష్ణువు నిద్రపోతాడు అందుకే దీన్ని "శయన ఏకాదశి" అని అంటారు అని తెలుసుకున్నాం.బ్రహ్మ సృష్టి ,విష్ణువు స్థితి,శివుడు లయ కారకులు ఐతే,మరి స్థితికర్త ఐన విష్ణువు తన పని
చెయ్యకుండా నిద్ర పోవచ్చా??ఆయనే 4నెలలు పడుకుంటే, మనం మాత్రం ఎందుకు చెయ్యాలి పనులు/పూజలు??అసలే వర్షాకాలం,చలికాలం కదా ఈ 4 నెలలు, మనం కూడా విష్ణువు లాగే నిద్రపోతే బావుంటుంది కదా??ఇలాంటి ప్రశ్నలు  విన్నారా?? వాటికి సమాధానం ఏంటో తెలుసుకుందాం.
1)#కాలమానం లో తేడాలు.4నెలలు అనేది మన లెక్కల ప్రకారం.పితృదేవతల కాలం మన కంటే 30రెట్లు ఎక్కువ.
అంటే మనకి 15రోజులు (ఒక పక్షం)పితృదేవతలకి ఒక రోజులో సగం.
మనకి శుక్ల పక్షం 15 రోజులు, పితృదేవతలకి పగలూ,కృష్ణ పక్షం 15 రోజులు వారికి రాత్రి అవుతుంది.
పితృదేవతల కాలమానం కంటే దేవతల కాలమానం
Read 10 tweets
Jul 10
#విష్ణుసహస్రనామం ప్రతిపదార్థం.(రోజుకో 10)

1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
Read 5 tweets
Jul 9
ఏకాదశి--పేలాల పిండి

ఎండాకాలం వెళ్ళి వర్షాలు కురిసే సమయంలో కొత్త నీరు,వాతావరణంలో వచ్చే మార్పుల్ని మన శరీరం తట్టుకునేలా,రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది ఈ పేలాల పిండి.
దానిలో కలిపే బెల్లం,నెయ్యి శరీరానికి ఉపవాసం ఉన్నా (ఏకాదశి ఉపవాసం  ఉంటాం కదా)తగినంత శక్తిని ఇచ్చి,త్వరగా +
అలిసిపోకుండా ఉండటానికి కారణం. ఈ ఏకాదశి తో మొదలయ్యి కార్తీక ఏకాదశి వరకూ "చాతుర్మాస వ్రతం" చేస్తారు అందరూ.దాన్లో భాగంగా ఏఏ వస్తువులు తినాలి(మిల్లెట్స్, ఉసిరి)/తినకూడదు(మొదటి నెలలో ఆకుకూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో పప్పు దినుసులూ తినకూడదు +   
వెల్లుల్లి,+
సొరకాయ, టమాట, ఆవనూనె కూడా avoid చెయ్యాలి.)(to improve digestion)అనే నియమాలు పాటించాలి ఆరోగ్యం కోసం.అలాగే బియ్యానికి బదులు మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.ఈ 4 నెలలు నెలకి రెండు ఏకాదశుల చొప్పున ఉపవాసం ఉండి జీర్ణవ్యవస్థకి రెస్టు ఇవ్వాలి. 
జొన్నలు మంచి పౌష్టికాహారం
Read 9 tweets
Jul 8
దర్శనాత్ అభ్రశదసి
జననాత్ కమలాలే
స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

పరమేశ్వరుడు ఎంత భక్తసులభుడో చెప్పే  ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం.

స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు
చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికమార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి అంటూ ఒకానొకప్పుడు మానవులు వేడుకోగా.. సాక్షాత్తూ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది. దీని ప్రకారం.. చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు. చిదంబరంలో దర్శనమంటే..
అక్కడ మారేడు దళాల దండలుంటాయంతే.ఆకాశమంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం.చేసుకోగలిగేవాడికి
Read 10 tweets
Jan 13
ఏకాదశి--మురారి
ఈ నామానికి, ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామి పుష్కరిణీ తీర్థ మాహాత్మ్యం,గురువు,ఏకాదశి గురించి స్కాంధపురాణంలో ఇలా ఉంది

"స్వామి పుష్కరిణీ స్నానం,
సద్గురు పాదసేవనం,
ఏకాదశి వ్రతంచైవ
త్రయం అత్యంత దుర్లభం"
1) స్వామి పుష్కరిణి యందు స్నానము చేయడము
2) మానవ జన్మము ఎత్తినందుకు సార్థకము జీవితంలో ఒక సద్గురువును సంపాదించుకోవడం.
3) వ్రతములలో కెల్ల ఉత్తమమైన వ్రతము ఏకాదశి వ్రతము (ఏకాదశి తిథియందు ఉపవాసం చేయడం).
ఈ మూడు వరాలు లభించవలెనంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప కుదరదు. అని వేదవ్యాస మహర్షి మాట.
శ్రీమన్నారాయణీయం...92 వ దశకం లో
గఙ్గా గీతా చ గాయత్ర్యపి చ తులసికా గోపికాచన్దనం తత్
సాలగ్రామాభిపూజా పరపురుష తథైకాదశీ నామవర్ణాః |
ఏతాన్యష్టాప్యయత్నాన్యయి కలిసమయే త్వత్ప్రసాదప్రవృద్ధ్యా
క్షిప్రం ముక్తిప్రదానీత్యభిదధురృషయస్తేషు మాం సజ్జయేథాః ||

గంగానది,భగవద్గీత,గాయత్రీ మంత్రజపం
Read 13 tweets
Jan 13
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారదర్శనం కు ఎందుకు అంత ప్రాధాన్యత?

పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?

ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్థిస్తాయి?

మానవులకు 365 రోజులు…దేవతలకు ఒక్కరోజుతో సమానం.

మానవులకు 6 నెలల కాల సమయం….దేవతలకు 12 గంటల సమయం.
దేవతలకు 12 గంటల రాత్రి సమయాన్ని దక్షిణాయం అని….పగలు 12 గంటల సమయాన్ని ఉత్తరాయణం అని అంటారు.

దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం…దీనినే కర్కాటక మాసం అంటారు.

రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం…8 నుంచి 10 గంటల సమయాన్ని సింహ మాసం
అంటారు.

రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్కకి తిరిగి పడుకునే సమయం….ఈ కాలం మానవులకు కన్యా మాసం.

అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాఢ నిద్రలో వుండే సమయం….మానవులకు తులామాసం.

మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు….
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(