విష్ణుమూర్తే 4నెలలు ( చాతుర్మాసం) నిద్ర పోతే ఇంక మనం చేసే పూజలు ఎవరికి??!!
నిన్న తొలి ఏకాదశి రోజు నుండి 4నెలలూ విష్ణువు నిద్రపోతాడు అందుకే దీన్ని "శయన ఏకాదశి" అని అంటారు అని తెలుసుకున్నాం.బ్రహ్మ సృష్టి ,విష్ణువు స్థితి,శివుడు లయ కారకులు ఐతే,మరి స్థితికర్త ఐన విష్ణువు తన పని
చెయ్యకుండా నిద్ర పోవచ్చా??ఆయనే 4నెలలు పడుకుంటే, మనం మాత్రం ఎందుకు చెయ్యాలి పనులు/పూజలు??అసలే వర్షాకాలం,చలికాలం కదా ఈ 4 నెలలు, మనం కూడా విష్ణువు లాగే నిద్రపోతే బావుంటుంది కదా??ఇలాంటి ప్రశ్నలు విన్నారా?? వాటికి సమాధానం ఏంటో తెలుసుకుందాం.
1)#కాలమానం లో తేడాలు.4నెలలు అనేది మన లెక్కల ప్రకారం.పితృదేవతల కాలం మన కంటే 30రెట్లు ఎక్కువ.
అంటే మనకి 15రోజులు (ఒక పక్షం)పితృదేవతలకి ఒక రోజులో సగం.
మనకి శుక్ల పక్షం 15 రోజులు, పితృదేవతలకి పగలూ,కృష్ణ పక్షం 15 రోజులు వారికి రాత్రి అవుతుంది.
పితృదేవతల కాలమానం కంటే దేవతల కాలమానం
12రెట్లు అధికంగా ఉంటుంది. అంటే మనకి ఒక సంవత్సరం కాలం అంటే దేవతలకి ఒక రోజు (6నెలలు పగలు,6నెలలు రాత్రి)
ఇప్పుడు ఈ 4నెలల సంగతికొస్తే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ కదా.అంటే అది సరిగ్గా పగలు రాత్రి మధ్య వస్తుంది. ఇక్కడ మనం జనవరి నుంచి 6నెలలు లెక్కలు వెయ్యకూడదు.
చైత్ర,వైసాఖ,జేష్ఠ, ఆషాఢ నుంచి మొదలై శ్రావణ,భాద్రపద, ఆశ్వీయుజ,కార్తీక వరకూ ఉన్నట్లు.అంటే 4,5,6,7thనెలలు. మనకి సంవత్సరం మధ్యలో , దేవతలకు రోజు మధ్యలో వచ్చినట్లు అయ్యింది.
స్థితికర్త ఐన విష్ణువు భోజనం తర్వాత తీసే చిన్న కునుకు లాంటిది ఈ 4నెలలు!!మనకి తెలుసు మధ్యాహ్న నిద్ర రాత్రి నిద్ర
అంత గాఢంగా ఉండదు.చుట్టు పక్కల ఏం జరుగుతోందో లీలగా తెలుస్తూ ఉంటుంది.అవసరం ఐతే మెలకువ వచ్చేస్తుంది.
శ్రీహరి నిద్ర కూడా అలాంటి యోగనిద్ర మాత్రమే.కనులు మూసినట్లు ఉన్నా,అన్నీ గమనిస్తూ ఉంటాడు.ఇప్పుడు మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది మనకి ఈ 4 నెలలు మధ్యాహ్న నిద్ర ఐతే ఆఖరి 4నెలలు రాత్రి నిద్ర
లాగా పోతాడా,అప్పుడు ప్రళయం రాదా అని.
ప్రళయం అనేదానికి విష్ణువు నిద్రతో సంబంధం ఉండదు. బ్రహ్మ దేవుడు సృష్టి చేసీచేసీ అలిసిపోయి కన్నులు మూసుకుంటే అప్పుడు వస్తుంది.అది ఎప్పుడూ అంటే 4యుగాలు(కృత,త్రేతా,ద్వాపర,కలి యుగాలు)అయ్యాక.
కాబట్టి విష్ణువు పడుకుంటాడు అంటే నిజంగా నిద్రపోతాడు అని
కాదు అర్థం.కొద్ది సేపు విశ్రాంతి లాంటిది ఈ 4నెలలు.
2)ఇక ఈ 4నెలలు పూజలు,ఉపవాసాలు ఎందుకు?
అంటే మన కోసమే!!!
విష్ణువు అంటే సర్వవ్యాపి కాబట్టి అది సూర్యనారాయణ మూర్తి అని అంతర్లీనంగా ఒక అర్థం.అంటే ఇది సూర్యుడి గమనానికి సంబంధించిన విషయం.తొలిఏకాదశి తర్వాత దక్షిణాయనం మొదలై,పగటి కాలం
తక్కువగా, రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకూ ఉత్తరం వైపు ప్రయాణించిన సూర్యుడు దక్షిణం దిక్కుకి వాలతాడు. దీన్నే నిద్రగా భావించాలి.ఆ సమయంలో వాతావరణంలో,ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల అనారోగ్యం పాలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.వాటిని తప్పించుకునే మార్గాలే ఈ ఉపవాసాలు,
కొన్ని రకాల ఆహారం(ఉల్లిపాయ, టమాటా, సొరకాయ, ఆకుకూరలు,పప్పు) తినకపోవడం లాంటివి.అంటే indirect గా ఇవన్నీ మనం healthy గా ఉండటానికి చేసే ప్రయత్నాలు.మన ప్రతి సాంప్రదాయం వెనుక ఏదోఒక scientific reason ఉంటుంది 🙏.అవేమిటో తెలిసినా,తెలియకపోయినా ఆచరించడం వల్ల ఉపయోగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
2)త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోఽస్య
భక్త్యైవ దేవ న చిరాదభృథాః ప్రసాదమ్।
యేనాస్య యాచనమృతేఽప్యభిరక్షణార్ధం
చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారమ్॥
భావము:-
ప్రభూ! అంబరీషుడు తన మనసును నీయందే లగ్నము చేసుకొని, తను చేయు సకలకర్మలను భక్తితో నీకు అర్పించు చుండెను; అచిర కాలముననే నీకు మిక్కిలి
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
ఎండాకాలం వెళ్ళి వర్షాలు కురిసే సమయంలో కొత్త నీరు,వాతావరణంలో వచ్చే మార్పుల్ని మన శరీరం తట్టుకునేలా,రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది ఈ పేలాల పిండి.
దానిలో కలిపే బెల్లం,నెయ్యి శరీరానికి ఉపవాసం ఉన్నా (ఏకాదశి ఉపవాసం ఉంటాం కదా)తగినంత శక్తిని ఇచ్చి,త్వరగా +
అలిసిపోకుండా ఉండటానికి కారణం. ఈ ఏకాదశి తో మొదలయ్యి కార్తీక ఏకాదశి వరకూ "చాతుర్మాస వ్రతం" చేస్తారు అందరూ.దాన్లో భాగంగా ఏఏ వస్తువులు తినాలి(మిల్లెట్స్, ఉసిరి)/తినకూడదు(మొదటి నెలలో ఆకుకూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో పప్పు దినుసులూ తినకూడదు +
వెల్లుల్లి,+
సొరకాయ, టమాట, ఆవనూనె కూడా avoid చెయ్యాలి.)(to improve digestion)అనే నియమాలు పాటించాలి ఆరోగ్యం కోసం.అలాగే బియ్యానికి బదులు మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.ఈ 4 నెలలు నెలకి రెండు ఏకాదశుల చొప్పున ఉపవాసం ఉండి జీర్ణవ్యవస్థకి రెస్టు ఇవ్వాలి.
జొన్నలు మంచి పౌష్టికాహారం
పరమేశ్వరుడు ఎంత భక్తసులభుడో చెప్పే ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం.
స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు
చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికమార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి అంటూ ఒకానొకప్పుడు మానవులు వేడుకోగా.. సాక్షాత్తూ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది. దీని ప్రకారం.. చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు. చిదంబరంలో దర్శనమంటే..
అక్కడ మారేడు దళాల దండలుంటాయంతే.ఆకాశమంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం.చేసుకోగలిగేవాడికి
ఏకాదశి--మురారి
ఈ నామానికి, ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.
స్వామి పుష్కరిణీ తీర్థ మాహాత్మ్యం,గురువు,ఏకాదశి గురించి స్కాంధపురాణంలో ఇలా ఉంది
"స్వామి పుష్కరిణీ స్నానం,
సద్గురు పాదసేవనం,
ఏకాదశి వ్రతంచైవ
త్రయం అత్యంత దుర్లభం" 1) స్వామి పుష్కరిణి యందు స్నానము చేయడము
2) మానవ జన్మము ఎత్తినందుకు సార్థకము జీవితంలో ఒక సద్గురువును సంపాదించుకోవడం. 3) వ్రతములలో కెల్ల ఉత్తమమైన వ్రతము ఏకాదశి వ్రతము (ఏకాదశి తిథియందు ఉపవాసం చేయడం).
ఈ మూడు వరాలు లభించవలెనంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప కుదరదు. అని వేదవ్యాస మహర్షి మాట.
శ్రీమన్నారాయణీయం...92 వ దశకం లో
గఙ్గా గీతా చ గాయత్ర్యపి చ తులసికా గోపికాచన్దనం తత్
సాలగ్రామాభిపూజా పరపురుష తథైకాదశీ నామవర్ణాః |
ఏతాన్యష్టాప్యయత్నాన్యయి కలిసమయే త్వత్ప్రసాదప్రవృద్ధ్యా
క్షిప్రం ముక్తిప్రదానీత్యభిదధురృషయస్తేషు మాం సజ్జయేథాః ||