#విష్ణుసహస్రనామం_ప్రతిపదార్థం
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
11.పరమాత్మా=అందరిలో ఉన్న ఆత్మలన్నింటికీ ఆత్మ ఐనవాడు.
12.ముక్తానాం పరమాగతిః=మోక్షాన్ని పొందటానికి ఎవర్ని చేరాల్సి ఉందో అతడు.
13.అవ్యయః=మార్పు/నాశనం లేనివాడు.
14.పురుషః=ప్రతి పురంలో(శరీరం)లో నివసించేవాడు.
15.సాక్షీ =ప్రతి జీవి చేసే పనులన్నీ కంటితో చూసేవాడు.
16.క్షేత్రజ్ఞః=ఈ క్షేత్రాల (శరీరాల)తత్వం బాగా తెలిసినవాడు.
17.అక్షరః(అక్ష+రః)=వైకుంఠాన్ని కూడా తెచ్చి ఇవ్వగలిగేవాడు.
18.యోగః=యోగవిద్య ద్వారా కనుక్కోగలిగిన వాడు.
19.యోగవిదాం నేతః=యోగవేత్తలని రక్షించే వాడు.
20.ప్రధానపురుషేశ్వరః=వ్యక్తికీ, ఆ వ్యక్తిలో ఉండే మాయకి కూడా ప్రభువు ఐనవాడు.
21.నారసింహవపుః =నర రూపాన్నీ,సింహ రూపాన్నీ కలిపి ధరించినవాడు.
22.శ్రీమాన్ =నిరంతరం లక్ష్మిదేవి ని తన వద్ద కలిగిన వాడు.
23.కేశవః=ఆకర్షణీయమైన శిరోజాలు కలవాడు.
24.పురుషోత్తమ =పురుషుల లో ఉత్తముడు.
25.సర్వః=అన్నిటికీ ఉండే ఎన్నో లక్షణాలన్నీ తానే ఐన వాడు.
26.శర్వః=కాలం ఐపోగానే సంహరించేవాడు.
27.శివః=శివుని రూపమే తానైనవాడు.
28.స్థాణుః=అవతారాలన్నింటిలోనూ ఒకే లక్షణాలతో స్థిరంగా ఉండేవాడు.
29.భూతాది=ప్రాణులన్నింటి పుట్టుకకి మూలకారణం ఐనవాడు.
30.నిధిః అవ్యయః=ఎప్పటికీ తరిగిపోని నిధి ఐనవాడు.
31.సంభవః=ధర్మ సంస్థాపన కోసం పుట్టేవాడు.
32.భావనః=జీవులందరికీ వారి వారి కర్మఫలాణుగుణంగా ఫలితాలు ఇచ్చేవాడు.
33.భర్తా=సుఖదుఃఖాలు రెంటినీ సమంగా భరించేవాడు.
34.ప్ర+భవః=తీవ్రమైన,విలక్షణమైన జన్మ కలవాడు.
35.ప్రభుః=చేసే పనులన్నింటి లోనూ నేర్పరితనం కలవాడు.
36.ఈశ్వరః=అధికారిగా ఉండేవాడు.
37.స్వయంభూః=స్వయంగా పుట్టగలిగినవాడు.
38.శంభుః=శుభాన్నీ, సుఖాన్నీ తక్షణం కలగచేసేవాడు.
39.ఆదిత్యః=పన్నెండు మంది సూర్యులకి ఆధారభూతమైనవాడు.
40.పుష్కరాక్షః=పద్మాల వంటి కళ్ళు కలవాడు.
41.మహాస్వనః=వేదమే తన నాదంగా కలవాడు.
42.అనాదినిధనః=ఆది,అంతాలు లేనివాడు.
43.ధాతాః=ప్రపంచాన్ని తానై ధరించేవాడు.
44.విధాతా=వ్యక్తులు చేసే కర్మ లకీ,ఫలితాలకీ కర్త ఐనవాడు.
45.ధాతురుత్తమః=బ్రహ్మ ని మించిన సృష్టికర్త.
46.అప్రమేయః=ఏ ప్రమాణానికీ లొంగనివాడు.
52.త్వష్టా=ప్రళయానికి ముందు జీవులని నశింప చేసేవాడు.
53.స్థవిష్ఠః=మిక్కిలి స్థూలంగా దర్శనమిచ్చేవాడు
54.స్థవిరోధృవః=ఎంతోకాలం నుంచి ఉన్నవాడు,కదలనివాడు.
55.అగ్రాహ్యః=జ్ఞాన కర్మేంద్రియాల ద్వారా పట్టుకో వీలుకాని వాడు.
56.శాశ్వతః=ఎల్లప్పుడూ ఉండగలిగే వాడు.
57.కృష్ణః=ఆకర్షణీయమైన రూపం కలిగి,అందరినీ ఆకర్షించేవాడు.
58.లోహితాక్షః=ఎర్రని నేత్రాలు కలవాడు.
59.ప్రతర్దనః=ప్రళయకాలంలో ప్రాణుల కర్మఫలాన్ని బట్టి హింసించే వాడు.
60.ప్రభూతః=ఉత్తమ గుణాలు కలవాడు.
61.త్రికకుబ్దామ=ముల్లోకాలూ తన నివాసంగా కలవాడు.
62.పవిత్రమ్=పవిత్రతను కలిగించేవాడు.
63.మంగళం పరమ్=విశేషంగా శుభాన్ని కలిగించేవాడు.
64.ఈశానః=తన ఆలోచనలకి అనుగుణంగా సమస్త భూతాలని శాసించేవాడు.
65.ప్రాణదః=ప్రాణాన్ని ఇచ్చేవాడూ, తుంచేవాడు.
66.ప్రాణః=ప్రాణులకి పుట్టుకతో వచ్చే ఉచ్ఛ్వాసమైనవాడు.
67.జేష్ఠః=అందరికీ పెద్ద.
68.శ్రేష్ఠః=అందరి ప్రశంశలకీ పాత్రుడు.
69.ప్రజాపతిః=ప్రజల్ని రక్షించే వాడు.
70.హిరణ్యగర్భః=బ్రహ్మ దేవునికి కూడా ఆత్మ.
71.భూగర్భః=భూమిని తన గర్భంలో ఉంచుకునేవాడు.
72.మాధవః=లక్ష్మిదేవి భర్త
73.మధుసూదనః="మధువు" అనే పేరున్న రాక్షసుడ్ని సంహరించిన వాడు.
74.ఈశ్వరః=బ్రహ్మ,ఈశ్వరుల కంటే శ్రేష్ఠుడు.
75.విక్రమీ=ప్రతీ కార్యంలో తనదైన,విశేషమైన క్రమం కలవాడు.
76.ధన్వీ=విల్లు పట్టుకున్నవాడు.
77.మేధావీ=మఱుపు లేని వాడు.
78.విక్రమః=గరుత్మంతుని మీద ప్రయాణించేవాడు.
79.క్రమః=లోక క్షేమాన్నే దృష్టిలో ఉంచుకుని అడుగు వేసేవాడు.
80.అనుత్తమః=ఎవని కంటే ఇక ఉత్తముడు లేడో అతడు.
81.దురాదర్షః=ఎప్పుడూ ఎవరికీ లొంగనివాడు.
82.కృతజ్ఞః=ఏ ప్రాణి ఏమాత్రపు ఆరాధనని చేసినా ఎప్పుడూ గుర్తు ఉంచుకునేవాడు.
83.కృతిః=ప్రతి ప్రయత్నానికి కారణమైనవాడు.
84.ఆత్మవాన్=ఎవిమీదా ఆధారపడనివాడు.
85.సురేశః=దేవతలకి కూడా అధికారి.
86.శరణమ్=ఆర్తిని పోగట్టగలవాడు.
87.శర్మ=సుఖాన్నిచ్చే రూపం కలవాడు.
88.విశ్వరేతాః=విశ్వం అనే చెట్టు కి విత్తనం లాటివాడు.
89.ప్రజాభవః=ప్రజల్ని పుట్టుకకు కారణమైనవాడు.
90.అహః=ప్రకాశమంతా తన రూపంగా కలవాడు.
91.సంవత్సరః=కాలమే తానైనవాడు.
92.వ్యాలః=పాములాగా ఎప్పుడో కానీ కనబడకుండా తన ఉనికిని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు.
93.ప్రత్యయః=ప్రజ్ఞ కలిగిన వాడు.
94.సర్వదర్శనః=అందరి కళ్ళూ తనవిగా కలిగినవాడు.
95.అజః=ఎవరికీ పుట్టని వాడు.(ఋణం లేనివాడు)
96.సర్వేశ్వరః=ఈశ్వరులందరికీ ఈశ్వరుడు.
97.సిద్ధః=భక్తులని రక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు.
98.సిద్ధిః=జ్ఞాన రూపంతో ప్రకాశించేవాడు.
99.సర్వాది=ప్రాణులన్నింటికీ మూలకారణమైనవాడు.
100.అచ్యుతః=తన స్ధానం నుంచి జారిపోనితనం కలవాడు.
101.వృషాకపిః=వరాహావతారం ద్వారా భూమిని ఎత్తి ధర్మాన్ని రక్షించినవాడు.
102.అమేయాత్మా=ఇది అని నిర్ణయింప వీలు దేనికోసం కలవాడు.
103.సర్వయోగవినిసృతః=సర్వయోగ శాస్త్రాల ద్వారా తనని గూర్చి తెలియచేసే వాడు.
104.వసుః=సర్వ భూతాలలోనూ తానై ఉండే వాడు.
105.వసుమనాః=కాలుష్య భావం లేని మనసు కలవాడు.
106.సత్యః=సత్యమే తన రూపంగా కలవాడు.
107.సమాత్మా=పెద్ద,చిన్న బేధం లేక అందరిలో ఉన్నవాడు.
108.సమ్మితః=అందరివాడుగా కన్పించేవాడు.
109.సమః=ఎప్పుడూ లక్ష్మి తో కూడి ఉండే వాడు.
110.అమోఘః=వ్యర్థమైన ఏ పనీ చెయ్యని వాడు.
111.పుండరీకాక్షః=పద్మాల వంటి కన్నులు కలవాడు.
112.వృషకర్మా=ధర్మానికి లోబడి ప్రవర్తించే వాడు.
113.వృషాకృతిః=ధర్మమే తన రూపంగా కలవాడు.
114.రుద్రః=దుఃఖాన్ని తొలగించగలవాడు.
115.బహుశిరాః=అనేక శిరస్సులు(ఆలోచనలు)కలవాడు.
116.బభ్రుః=భరించేవాడు.
117.విశ్వయోనిః=ప్రపంచమనే ఫలితానికి కారణమైనవాడు.
118.శుచిశ్రవాః=తన పేరిట స్తోత్రం చేసేందుకు తగినన్ని పేర్లు కలవాడు.
119.అమృతః=మరణ విధానమే లేనివాడు.
120.శాశ్వతఃస్థాణుః=శాశ్వతుడై స్థిరంగా ఉండేవాడు.
121.వరారోహః=సర్వోత్తమైన గమ్యస్థానమైనవాడు.
122.మహాతపాః=చెప్పలేనంత తపస్సు చేసినవాడు.
123.సర్వగః=అందరి క్షేమాన్ని గూర్చి (ఆయా లోకాలకి)వెళ్ళేవాడు.
124.సర్వవిద్భానుః=అన్నీ తెలిసినవాడు.
125విష్వక్సేనః=సేనలన్నింటికీ భయాన్నికలిగించేవాడు.
126.జనార్దనః=మోక్షం కోసం ప్రార్థంపబడేవాడు.
127.వేదః=వేదాలే తన రూపంగా కలవాడు.
128.వేదవిత్=వేదాల్ని స్పష్టంగా అర్ధం చేసుకున్నవాడు.
129.అవ్యంగ=తన జ్ఞాన స్వరూపానికి లోపమే లేనివాడు.
130.వేదాంగ=వేదాలే తన అవయవాలుగా కలవాడు.
131.వేదవిత్=వేదార్థాన్ని మిక్కిలిగా విచారించేవాడు.
132.కవిః=తన ఊహకి అనుగుణంగా రచన చేసేవాడు.
133.లోకాధ్యక్షః=పద్నాలుగు లోకాల క్షేమాన్ని పరిశీలించేవాడు.
134.సురాధ్యక్షః=దేవతల బాగోగుల్ని పరిశీలించేవాడు.
135.ధర్మాధ్యక్షః=యుగధర్మాన్ని బట్టి పరిపాలన సాగేలా చూసేవాడు.
136.కృతాకృతః=కార్యాకారణాలుతానే అయ్యి కార్యరూపంగా కనిపించేవాడు.
137.చతురాత్మా=సృష్టి,స్థితి,కాలం,ప్రళయం అనే నాలుగు రూపాలతో ఉండేవాడు.
138.చతుర్వ్యూహః=నాలుగు విధాలైన ఉపాయాలు కలవాడు.
139.చతుర్ధ్రంష్టః=వరాహావతారంలో నాలుగు కోరలు కలవాడు.
140.చతుర్భుజః="ధర్మ అర్థ కామ మోక్షా"లనే నాలుగు చేతులు కలవాడు.
141.భ్రాజిష్ణుః=చెప్పలేనంత ప్రకాశంతో ఉండేవాడు.
142.భోజనం=మాయాస్వరూపమైనవాడు.
143.భోక్తాః=ప్రీతితో ఇచ్చినదాన్ని సంతోషంగా భుజించేవాడు.
144.సహిష్ణుః=భక్తుల అపరాధాల్ని సహించేవాడు.
145.జగదాదిజః=ప్రళయమయ్యాక మొదటగా పుట్టేవాడు.
146.అనఘః=పాపం లేనివాడు.
147.విజయః=తన గుణాలతో సమస్తాన్నీ జయించేవాడు.
148.జేతాః=జయించే స్వభావం కలవాడు.
149.విశ్వయోనిః=ప్రపంచానికి ముఖ్యమైన కాలంలోని మార్పులన్నింటికీ కారణమైనవాడు.
150.పునర్వసుః=జీవుని రూపంలో మరల మరల శరీరాల్లో నివసించేవాడు.
151.ఉపేంద్రః=ఇంద్రుని మించినవాడు.
152.వామనః=లోకక్షేమం కోసం యాచన కూడా చేసినవాడు.
153.ప్రాంశుః=పెరుగుతూ ఉండే స్వభావం కలవాడు.
154.అమోఘః=వ్యర్థం కాని పని చేసేవాడు.
155.శుచిః=స్మరించినవారినీ,పూజించిన వారిని పవిత్రులిని చేసేవాడు.
156.ఊర్జితః=చెప్పలేనంత బలం కలవాడు.
161.నియమః=ప్రజలను తమ తమ అధికారాలలో నియమించేవాడు.
162.యమః=అందరినీ తన ఆలోచన ప్రకారమే నడిపించేవాడు.
163.వేద్యః=మోక్షాన్ని కోరేవారికి తెలుసుకోదగినవాడు.
164.వైద్యః=అన్ని విద్యలూ తెలిసినవాడు.
165.సదాయోగీ=ఎప్పుడూ యోగాభ్యాసంలో ఉండేవాడు.
166.వీరహాః=ధర్మ రక్షణ కోసం రాక్షసులని చంపినవాడు
167.మాధవః=బ్రహ్మ విద్య తన అధీనంలో కలవాడు.
168.మధుః=భక్తులకు తేనె లాగా ఇష్టాన్ని కలిగించేవాడు.
169.అతీంద్రీయః=జ్ఞాన కర్మ ఇంద్రియాలకి అందనివాడు.
170.మహామాయః=మోసం చేయదలచిన అందరినీ మించిన మోసగాడు.
171.మహోత్సాహః=సృష్టి చేయడానికి ఉత్సాహాన్ని చూపించేవాడు.
172.మహాబలః=బలవంతులలో కెల్లా బలవంతుడు.
173.మహాబుద్ధిః=బుద్ధిమంతులందరి బుద్ధికి మించిన బుద్ధి కలవాడు.
174.మహావీర్యః=గొప్ప పరాక్రమం కలవాడు.
175.మహాశక్తిః=అందరి శక్తికి మించిన శక్తి కలవాడు.
176.మహాద్యుతిః=లోపలా బయటా కూడా ప్రకాశించే నేర్పు ఉన్నవాడు.
177.అనిర్దేశ్యవపుః="ఇలా ఉంటా" డని చెప్ప వీలు లేని శరీరం కలవాడు.
178.శ్రీమాన్=ఆర్తితో పిలిచిన వారిని కరుణించే లక్ష్మి తో కూడినవాడు.
179.అమేయాత్మా =ఎవరి ఊహకీ అందని బుద్ధి నైపుణ్యాన్ని కలిగిన వాడు.
181.మహేష్వాసః=గొప్ప విల్లుని ఎక్కు పెట్టగలవాడు.
182.మహీభర్తా=ప్రళయంలో నీటితో మునిగిన భూమిని ఎత్తగలిగినవాడు.
183.శ్రీనివాసః=లక్ష్మి దేవికి రక్షణ ఈయగలవాడు.
184.సతాంగతిః= నమ్మిన సత్పురుషులకి దిక్కైనవాడు.
185.అనిరుద్ధః=ఏ అవతారం లోనూ అడ్డుని ఎరగనివాడు.
186.సురానందః=దేవతలంతటి వారికి కూడా ఆనందాన్ని ఇవ్వగలిగినవాడు.
187.గోవిందః=మనం భూమిని పొందగలిగేలా చేయగల్గినవాడు.
188.గోవిదాంపతిః=వాక్ఛాక్తి తెలిసినవారికి దిక్కు ఐనవాడు.
189.మరీచిః=ప్రకాశానికి కూడా ప్రకాశాన్ని అందించేవాడు.
190.దమనః=ప్రాణుల్ని సరిదిద్దడం కోసం శాసించేవాడు.
191.హంసః=శరీరంలో చైతన్యాన్ని కలిగించేవాడు.
192.సుపర్ణః=సుందరమైన రెక్కలు కలవాడు.
193.భుజగోత్తమః=పాము జాతిలో శ్రేష్ఠుడు.
194.హిరణ్యగర్భః=శుభాన్ని కలిగించే నాభి(సంతతి)ఉన్నవాడు.
195.సుతపాః=ఏకాగ్రతతో తపస్సు చేసేవాడు.
196.పద్మనాభః=హృదయపద్మం యొక్క నాభిలో ఉండేవాడు.
197.ప్రజాపతిః=పుడుతూ ఉండే లక్షణమున్న ప్రజలకి ప్రభువు.
198.అమృత్యుః=మరణం,తద్వారా దుఃఖం లేనివాడు.
199.సర్వదృక్=అందరూ చేసే మంచి పనులన్నీ చూడగలిగినవాడు.
200.సింహః=అధర్మపరుల్ని హింసించే వాడు.
201.సంధాతా=పుణ్య,పాపాలకి సరైన ఫలితాన్ని ఇస్తూ ఉండేవాడు.
202.సంధిమాన్=ప్రతివ్యక్తి చేసే కర్మఫలాన్ని స్వీకరించేవాడు.(ఫలభోక్త)
203.స్థిరః=సృష్టి నుంచి లయం వరకూ ఉండేవాడు.(ఎప్పుడూ ఒకే రూపమైనవాడు)
204.అజః=పుట్టుక లేనివాడు.
205.దుర్మర్షణః=ఎదిరింపబడి,జయింపబడనివాడు.
211.ధామ=తానే గమ్యమైనవాడు.
212.సత్యః=సత్యమే రూపంగా కలవాడు.
213.సత్యపరాక్రమః=వ్యర్థముకాని పరాక్రమాన్ని కలిగినవాడు.
214.నిమిషః=యోగనిద్ర లోకి వెళ్ళగలిగినవాడు.
215.అనిమిషః=యోగనిద్ర లో ఉండి కూడా లోకస్థితిని గమనించగలవాడు.
216.స్రగ్వీ="వైజయంతి"అనే పూలమాలని ఎప్పుడూ ధరించేవాడు.
217.వాచస్పతిరుదారధీః=దయాదాక్షిణ్యాలతో కూడిన ధీశక్తి కలవాడు.
218.అగ్రణీ=మార్గదర్శకుడు.
219.గ్రామణీ=కర్మఫలాన్ని సరిగా అందేలా చూసేవాడు.
220.శ్రీమాన్=విశిష్టమైన కాంతి కలవాడు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
#కార్తీక_మాసం #Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)
నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.
3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)
కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)
కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)
కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)