ఇది భోజరాజు కాలం నాటి కథ.
"దాసు"అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు భోజుని ధారానగరంలో. ఎన్నోపూజలు,వ్రతాలూ చేసినా,నోములు నోచినా చాలాకాలం పిల్లలు లేరు ఆ దంపతులకి.
ఒకసారి గుడిలో ఉపన్యాసం ఐపోయిన తర్వాత దాసు, ఆ పండితుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు "తాను తండ్రి ఎలా కాగలనో"
చెప్పమని. ఆయన బాగా అలోచించి అప్పుడే గుడిలో అడుగుపెట్టిన ఒక యోగి ని చూపించి "ఈయన #న_ప్రతిగ్రహీత(ఎవరి దగ్గర ఏదీ తీసుకోని వాడు)ఈయన్ని నీకు బాకీ పడేలా చేసుకుంటే నీకు పుత్రుడిలాగా తప్పకుండా వస్తాడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను"అని వెళ్ళాడు.
దాసు ఆలోచన లో పడ్డాడు.ఆయనకి ఏం ఇవ్వాలి?
అసలే ఎవ్వరి దగ్గర ఏం తీసుకునే వాడు కాదని అంటారు.ఒకవేళ 'ఇది కావాలి' అని అడిగితే నా వల్ల ఏం అవుతుంది తెచ్చి ఇవ్వడం అని.
ఆయన దినచర్యలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు కొన్ని రోజులు.ప్రతి రోజూ నదీతీరాన స్నానం, సంధ్యావందనం చేసి ఆశ్రమానికి వచ్చి,ఫలమో,కాయో(ఎవరైనా ఇస్తే)తిని సదా
భగవన్నామస్మరణ చేసేవాడు ఆ యోగి.
ఈయన తనకి ఎలా ఋణగ్రస్తుడు అవుతాడా అని ఆలోచిస్తే ఒక ఉపాయం తట్టింది దాసుకి.అంతే..తనకి బాగా చేతనైన పని చెప్పులు కుట్టడం కనుక చాలా అందంగా నాలుగు జతల చెప్పులు కుట్టి యోగి వెళ్ళే దారిలో అక్కడక్కడా ఉంచాడు. ఒక వేసవికాలంలో యోగి నడుస్తుంటే కాళ్ళు మండినట్లు
అనిపించింది. దోవలో ఉన్న చెప్పుల వంక చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు.దూరం నుంచి చూస్తున్న దాసుకి నిరాశ కలిగించింది ఆ విషయం. ఐనా పట్టువదలకుండా రోజు అలాగే ఆయన వెళ్ళే దోవలో చెప్పులు పెట్టి గమనిస్తూ ఉండేవాడు,"ఆయన దృష్టిలో పడేలా చెయ్యి స్వామీ" అని మనసులో దేవుడి ని వేడుకుంటూ.
నాలుగు రోజుల తర్వాత ఎండ వేడి తట్టుకోలేక ఆ యోగి ఆ చెప్పుల్లో ఒక్క ఐదు నిముషాలు కాళ్ళు ఉంచి,తిరిగి వదిలేసి వెళ్ళి పోయాడు. దాసు లో ఆశ చిగురించింది.మళ్ళీ తీవ్రంగా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు.ఒక రోజు ఆ యోగి ఎండ భరించలేక ఆ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు.
అవి ఎవరివో,అక్కడ
ఎందుకు ఉంచారో అర్థం కాలేదు ఆ యోగికి.అంతకు ముందు ఎలా ఉండగలిగానా చెప్పులు,గొడుగు లేకపోయినా అని ఆశ్చర్య పోయాడు. #అవకాశం_ఉంటే_కావాలనుకున్న_వస్తువు_మీదికి_ఆలోచన_పోతుంది " అనే కొత్త విషయం అర్థం అయ్యింది ఆ యోగి కి.కానీ ఈ చెప్పుల కారణంగా తను ఎవరికో ఋణపడ్డానని బాధ పడసాగాడు.
ఇది జరిగిన కొన్నాళ్ళకి దాసు భార్య గర్భం దాల్చింది.పండితుడు చెప్పినట్లుగానే యోగి మరణం,దాసుకి కొడుకు పుట్టడం ఒకేసారి జరిగాయి.దాసుకి రాజు గారి ఆస్థాన ప్రధాన ద్వారం వద్ద కాపలాదారుగా ఉద్యోగం వచ్చింది.కొడుకు పుట్టిన వేళావిశేషం అని ఆనందించారు దంపతులు.
దాసు తన భార్యకి జరిగిందంతా చెప్పి,కొడుకు వద్ద నుంచి "ఏం తీసుకోకు,మన ఋణం తీరిపోతుంది, పెద్ద ప్రమాదం జరుగుతుందని" హెచ్చరించాడు.
ఇద్దరూ ఆ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచసాగారు.వాడిని ఒక్క నిముషం కూడా వదలలేని దాసు తనతో పాటు,ఉదయం పూట కోటకి తీసుకువెళ్ళేవాడు..
చిన్నవాడు కావడం వల్ల ఆస్థానంలో యధేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు.విద్వాంసులు చేసే చర్చలు వినీవినీ పిల్లాడికి సంస్కృతం ఐదవ ఏటనే బాగా వచ్చేసింది!
దాసు భార్యకి నగరంలో ఉన్న ప్రథాన కూడలిలో ఉన్న గంట ప్రతి జాముకి ఒకసారి కొట్టే ఉద్యోగం(దొంగలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికగా)
రాత్రి సమయం కావడంతో తల్లి పిల్లవాడిని తనతో పడుకోపెట్టుకునేది.
ఒక రోజు రాత్రి ఆమె మొదటి జాము గంట మోగించగానే గాఢనిద్రలోకి జారుకుంది. పిల్లవాడు రెండోజాము అవగానే తల్లికి నిద్రాభంగం చెయ్యడం ఇష్టం లేక తానే గంట మోగిస్తూ ఇలా అన్నాడు బిగ్గరగా
#మాతా నా స్తి పితా నా స్తి నా స్తి బంధు సహోదరాః!!
అర్థం నా స్తి గృహం నా స్తి తస్మా జ్జాగ్రత!!జాగ్రత!!
(ఈమె నా తల్లి, ఈయన తండ్రి, వీరు బంధువులు, సోదరులు అనుకోవడం వట్టి భ్రమ..ఒక్కో జన్మలో వీరు మారిపోతూ ఉంటారు!!..ఇది నా ఇల్లు,నా ధనం అనుకోవడం కూడా భ్రమే ..మన తర్వాత అవన్నీ వేరేవాళ్ళు
అనుభవిస్తారు.నగరంలోని దొంగలకి కాదు ..మనలో ఉన్న దొంగ(మమకారం..అంతా నాదే అనుకోవడం)గురించి భయపడండి ..అనే అర్థం వచ్చేలా)
ఆ గానం భోజరాజు విని, ఇంత అర్థవంతంగా చెప్పింది ఎవరో ఆరా తియ్యమని భటులని పంపించాడు.
మూడో జాము కాగానే మళ్ళీ గంట మోగిస్తూ ఇలా అన్నాడు
#ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా!!
ఆయుఃక్షీణం న జానాతి
తస్మా జ్జాగ్రత!!జాగ్రత!!
(ఎప్పుడూ ఏవో కోరికలు, వాటిని తీర్చుకోవాలని చేసే ప్రయత్నాలు...వీటితోనే జీవితం ఐపోతోంది. కానీ రోజు గడిస్తే ఆయుఃక్షీణం ఐపోతుంది అనే నిజం తెలుసా??!!ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అర్ధం.)
భోజరాజు మరింత ఆనందంగా పిల్లవాడికి ఇవ్వాల్సిన బంగారు నాణాలు తెప్పించి పెట్టుకున్నాడు.ఆఖరి శ్లోకం కోసం ఎదురు చూస్తూ!
(మనలో కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు అనే దొంగలు మన ఙ్ఞాన సంపదని దోచుకుంటున్నాయి...అది తెలుసుకోండి...ఇళ్ళల్లో వస్తువుల గురించి కాదు సుమా! అని అర్థం)
ఇంతలో రాజ భటులు వచ్చి తల్లీ కొడుకులని తీసుకెళ్ళారు రాజుగారి దగ్గరకు.రాత్రి గంటలు కొట్టనందుకు క్షమించమని కోరింది తల్లి.
భోజుడు "నీ కొడుకు గొప్ప పండితుడు అవుతాడు..ఇప్పటికి ఈ బహుమతి తీసుకోండి" అని బంగారునాణాలు ఇచ్చాడు ఆ బాలుడికి..పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆ మూట తల్లి చేతిలో పెట్టాడు.ఎంతో ఆనందంగా ఆ మూట అందుకుంది ఆ తల్లి...అంతే ఋణవిముక్తుడైన ఆ బాలుడి రూపంలో ఉన్న యోగి ప్రాణాలు విడిచాడు!!
ఈ వార్త తెలిసి పరుగుపరుగున వచ్చిన తండ్రి, భార్యని హెచ్చరించేలోగా జరగాల్సినది అంతా ఐపోయింది..వారి దుఃఖానికి అంతం లేకుండా అయ్యింది.
#విష్ణుసహస్రనామం_ప్రతిపదార్థం
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
11.పరమాత్మా=అందరిలో ఉన్న ఆత్మలన్నింటికీ ఆత్మ ఐనవాడు.
12.ముక్తానాం పరమాగతిః=మోక్షాన్ని పొందటానికి ఎవర్ని చేరాల్సి ఉందో అతడు.
13.అవ్యయః=మార్పు/నాశనం లేనివాడు.
విష్ణుమూర్తే 4నెలలు ( చాతుర్మాసం) నిద్ర పోతే ఇంక మనం చేసే పూజలు ఎవరికి??!!
నిన్న తొలి ఏకాదశి రోజు నుండి 4నెలలూ విష్ణువు నిద్రపోతాడు అందుకే దీన్ని "శయన ఏకాదశి" అని అంటారు అని తెలుసుకున్నాం.బ్రహ్మ సృష్టి ,విష్ణువు స్థితి,శివుడు లయ కారకులు ఐతే,మరి స్థితికర్త ఐన విష్ణువు తన పని
చెయ్యకుండా నిద్ర పోవచ్చా??ఆయనే 4నెలలు పడుకుంటే, మనం మాత్రం ఎందుకు చెయ్యాలి పనులు/పూజలు??అసలే వర్షాకాలం,చలికాలం కదా ఈ 4 నెలలు, మనం కూడా విష్ణువు లాగే నిద్రపోతే బావుంటుంది కదా??ఇలాంటి ప్రశ్నలు విన్నారా?? వాటికి సమాధానం ఏంటో తెలుసుకుందాం.
1)#కాలమానం లో తేడాలు.4నెలలు అనేది మన లెక్కల ప్రకారం.పితృదేవతల కాలం మన కంటే 30రెట్లు ఎక్కువ.
అంటే మనకి 15రోజులు (ఒక పక్షం)పితృదేవతలకి ఒక రోజులో సగం.
మనకి శుక్ల పక్షం 15 రోజులు, పితృదేవతలకి పగలూ,కృష్ణ పక్షం 15 రోజులు వారికి రాత్రి అవుతుంది.
పితృదేవతల కాలమానం కంటే దేవతల కాలమానం
2)త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోఽస్య
భక్త్యైవ దేవ న చిరాదభృథాః ప్రసాదమ్।
యేనాస్య యాచనమృతేఽప్యభిరక్షణార్ధం
చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారమ్॥
భావము:-
ప్రభూ! అంబరీషుడు తన మనసును నీయందే లగ్నము చేసుకొని, తను చేయు సకలకర్మలను భక్తితో నీకు అర్పించు చుండెను; అచిర కాలముననే నీకు మిక్కిలి
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
ఎండాకాలం వెళ్ళి వర్షాలు కురిసే సమయంలో కొత్త నీరు,వాతావరణంలో వచ్చే మార్పుల్ని మన శరీరం తట్టుకునేలా,రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది ఈ పేలాల పిండి.
దానిలో కలిపే బెల్లం,నెయ్యి శరీరానికి ఉపవాసం ఉన్నా (ఏకాదశి ఉపవాసం ఉంటాం కదా)తగినంత శక్తిని ఇచ్చి,త్వరగా +
అలిసిపోకుండా ఉండటానికి కారణం. ఈ ఏకాదశి తో మొదలయ్యి కార్తీక ఏకాదశి వరకూ "చాతుర్మాస వ్రతం" చేస్తారు అందరూ.దాన్లో భాగంగా ఏఏ వస్తువులు తినాలి(మిల్లెట్స్, ఉసిరి)/తినకూడదు(మొదటి నెలలో ఆకుకూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో పప్పు దినుసులూ తినకూడదు +
వెల్లుల్లి,+
సొరకాయ, టమాట, ఆవనూనె కూడా avoid చెయ్యాలి.)(to improve digestion)అనే నియమాలు పాటించాలి ఆరోగ్యం కోసం.అలాగే బియ్యానికి బదులు మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.ఈ 4 నెలలు నెలకి రెండు ఏకాదశుల చొప్పున ఉపవాసం ఉండి జీర్ణవ్యవస్థకి రెస్టు ఇవ్వాలి.
జొన్నలు మంచి పౌష్టికాహారం
పరమేశ్వరుడు ఎంత భక్తసులభుడో చెప్పే ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం.
స్వామీ ఇన్ని జన్మలెత్తలేకపోతున్నాం. అందునా వచ్చేది కలియుగం. చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం. మాయకు లోబడిపోతాం. తప్పు పనులు
చేస్తాం. మళ్లీ పునర్జన్మలొస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికమార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి అంటూ ఒకానొకప్పుడు మానవులు వేడుకోగా.. సాక్షాత్తూ పరమేశ్వరుడు చేసిన ఉపదేశం ఇది. దీని ప్రకారం.. చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం లేదు. చిదంబరంలో దర్శనమంటే..
అక్కడ మారేడు దళాల దండలుంటాయంతే.ఆకాశమంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయిన ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపించి దానికే మారేడు దళాలు వేస్తారు. అంతటా నిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వర స్వరూపమని అర్థం.చేసుకోగలిగేవాడికి