మనం పూజించే దేవుడు/దేవత ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆ దేవుడి/దేవతా రూపం మనకి స్పష్టంగా గోచరిస్తే (మానసికంగా)..అది #సారూప్యముక్తి.(EX:కంచి పరమాచార్య కి కామాక్షి అమ్మ వారు,
రామకృష్ణ పరమహంస & తెనాలి రామలింగడి కి కాళికాదేవి ని కళ్ళు మూసుకుని ధ్యానంలో చూడగలిగారు!!)
భగవంతుడు ఉండే లోకాలలో నివసించగలిగితే అది #సాలోక్యముక్తి. (EX:శివుడి ప్రమధగణాలు,విష్ణుభటులు,అమ్మవారి 64 కోట్ల సైన్యం ఇలాంటి వారు ఈ కోవలోకి వస్తారు)
ఆ లోకంలో కూడా ఆ దేవుడి/దేనతకి అతిసమీపంలో ఉండగలిగే అదృష్టవంతులది #సామీప్యముక్తి (EX:నందీశ్వరుడు,చండీశ్వరుడు,భృంగీశ్వరుడు
--శివుడి వద్ద గరుత్మంతుడు,ఆదిశేషుడు--విష్ణువు వద్ద
రాజశ్యామల, వారాహీ-- అమ్మవారి వద్ద )
జీవించి ఉన్నంతవరకూ ఇష్టదైవం ధ్యానంలో గడిపి చివరికి ఆ భగవంతునిలో ఐక్యం ఐపోతే వారిది #సాయుజ్యముక్తి.(Ex:అన్నమయ్య, రామదాసు,తరిగొండ వెంగమాంబ, త్యాగయ్య,ప్రహ్లాదుడు, మార్కండేయుడు)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#పితృపక్షాలు
విజ్ఞప్తి:: 1. పోస్ట్ పూర్తిగా చదివి, దేశ, విదేశాల్లో
నివసించే మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయడం ద్వారా హిందూధర్మాన్ని
కాపాడండి. శ్రాద్ధకర్మల ఆవశ్యకత
గ్రహించి పూర్వీకులకు నివాళులు
అర్పించేందుకు మీవంతు కృషి చేయండి. 2. ప్రస్తుత సంవత్సరంలో అనగా శ్రీ శుభకృత్
నామ సం.లో భాద్రపద బహుళ
పాడ్యమి ది 10-09-22
నుండి బహుళ అమావాస్య
ది 25-09-22 వరకు పితృపక్షం.
3.. వారణాశి నందు సత్రములు మరియు
ఆశ్రమము వివరములు ఇచ్చుచున్నాము.
పితృపక్షం ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, భాద్రపద బహుళ
పాడ్యమి నాడు ప్రారంభమై బహుళ
అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం నందు పిండప్రదానం
స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రము లందు
చేయు అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ
క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో
ఇంటి ముందర, గడప మీద,గేటు బయట ముగ్గులు పెడితే ఆ ఇంట దుష్టశక్తులు ప్రవేశించకుండా,ఇంట్లో ఉన్న లక్ష్మి బైటికి వెళ్ళకుండా కాపాడతాయి.
ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు వేస్తే ఆ ఇంట మంగళకరమైన పనులు జరుగుతున్నాయి అని అర్దం.
నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూతప్రేతపిశాచాలని ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తుంది.
సాధారణంగా మనం వేసే ముగ్గుల్లో పద్మాలు శుభసూచకం.అందుకే ఏ ముగ్గునీ తొక్కకూడదు.అలాగే ఒట్టి ముగ్గు వేసి వదిలెయ్యకూడదు, దాని మీద కొంచెం పసుపు/కుంకుమ/పువ్వులు వెయ్యాలి.
తులసి కోట వద్ద,దేవుడి మందిరం వద్ద, పూజా పీఠం/పీట మీద అష్టదళపద్మం ముగ్గు వేయడం శుభకరం.
ఎవరైనా భిక్షువు/సన్యాసి ఇంటికి వస్తే ఏమీ ఇవ్వకుండా పంపించకూడదు.(శంకరాచార్యులు భిక్షకి వస్తే ఆ ఇంటి ఇల్లాలు వెతికి మరీ #ఎండుఉసిరికాయ ఇస్తే,సంతోషంగా ఆయన చేసిన కనకధారాస్తోత్రం ఫలితంగా బంగారు
విష్ణుసహస్రనామం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు విన్నారు, కానీ ఎవరూ రాసుకోలేదు. మరి అది ఎలా ప్రచారం పొంది మన వరకూ వచ్చింది??
ఈ ప్రశ్నకు సమాధానం కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఇలా చెప్పారు.
భీష్ముడు చెపుతున్నప్పుడు పాండవులు, వ్యాసమహర్షి అందరూ శ్రద్ధగా విన్నారు.కానీ ఎవరూ రాయలేదు.అప్పుడు ధర్మరాజు అడిగాడు శ్రీ కృష్ణుడ్ని "ఈ నామాలు మేమందరమూ విన్నాము.కానీ మళ్ళీ పారాయణ చెయ్యాలంటే ఎలా??ఏం చెయ్యాలి" అని.
"మళ్ళీ కావాలంటే వాటిని వ్యాసమహర్షి, సహదేవుడు మాత్రమే అందివ్వగలరు" అన్నాడు శ్రీ కృష్ణుడు.
అప్పుడు అక్కడి వారందరూ "అదెలా?!!"అన్నారు.
శ్రీకృష్ణుడు "మనందరిలో ఒక్క సహదేవుడు మాత్రమే #సూతస్పటికం వేసుకున్నాడు మెడలో.అది సాక్షాత్తూ మహేశ్వర స్వరూపం.
ఇది భోజరాజు కాలం నాటి కథ.
"దాసు"అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు భోజుని ధారానగరంలో. ఎన్నోపూజలు,వ్రతాలూ చేసినా,నోములు నోచినా చాలాకాలం పిల్లలు లేరు ఆ దంపతులకి.
ఒకసారి గుడిలో ఉపన్యాసం ఐపోయిన తర్వాత దాసు, ఆ పండితుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు "తాను తండ్రి ఎలా కాగలనో"
చెప్పమని. ఆయన బాగా అలోచించి అప్పుడే గుడిలో అడుగుపెట్టిన ఒక యోగి ని చూపించి "ఈయన #న_ప్రతిగ్రహీత(ఎవరి దగ్గర ఏదీ తీసుకోని వాడు)ఈయన్ని నీకు బాకీ పడేలా చేసుకుంటే నీకు పుత్రుడిలాగా తప్పకుండా వస్తాడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను"అని వెళ్ళాడు.
దాసు ఆలోచన లో పడ్డాడు.ఆయనకి ఏం ఇవ్వాలి?
అసలే ఎవ్వరి దగ్గర ఏం తీసుకునే వాడు కాదని అంటారు.ఒకవేళ 'ఇది కావాలి' అని అడిగితే నా వల్ల ఏం అవుతుంది తెచ్చి ఇవ్వడం అని.
ఆయన దినచర్యలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు కొన్ని రోజులు.ప్రతి రోజూ నదీతీరాన స్నానం, సంధ్యావందనం చేసి ఆశ్రమానికి వచ్చి,ఫలమో,కాయో(ఎవరైనా ఇస్తే)తిని సదా
#విష్ణుసహస్రనామం_ప్రతిపదార్థం
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
11.పరమాత్మా=అందరిలో ఉన్న ఆత్మలన్నింటికీ ఆత్మ ఐనవాడు.
12.ముక్తానాం పరమాగతిః=మోక్షాన్ని పొందటానికి ఎవర్ని చేరాల్సి ఉందో అతడు.
13.అవ్యయః=మార్పు/నాశనం లేనివాడు.