#పితృపక్షాలు
విజ్ఞప్తి:: 1. పోస్ట్ పూర్తిగా చదివి, దేశ, విదేశాల్లో
నివసించే మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయడం ద్వారా హిందూధర్మాన్ని
కాపాడండి. శ్రాద్ధకర్మల ఆవశ్యకత
గ్రహించి పూర్వీకులకు నివాళులు
అర్పించేందుకు మీవంతు కృషి చేయండి. 2. ప్రస్తుత సంవత్సరంలో అనగా శ్రీ శుభకృత్
నామ సం.లో భాద్రపద బహుళ
పాడ్యమి ది 10-09-22
నుండి బహుళ అమావాస్య
ది 25-09-22 వరకు పితృపక్షం.
3.. వారణాశి నందు సత్రములు మరియు
ఆశ్రమము వివరములు ఇచ్చుచున్నాము.
పితృపక్షం ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, భాద్రపద బహుళ
పాడ్యమి నాడు ప్రారంభమై బహుళ
అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షం నందు పిండప్రదానం
స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రము లందు
చేయు అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ
క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో
లభ్యమగు వివిధ సౌకర్యాల వివరాలు తెలియచేయు
చున్నాము.
మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిధి
దేవోభవ అన్న నానుడియందు జన్మనిచ్చిన తల్లితండ్రులు,
విద్య నేర్పిన గురువు మరియు స్నేహితుల
ఋణం తీర్చుకొనే అవకాశం, వారికి సద్గతులు కలిగించు
అవకాశం మానవ జన్మనందే సాధ్యం.
శాస్త్రప్రకారం
మరణించిన వారి కుమారులు, జామాత (కుమార్తె భర్త),
దౌహిత్రుడు (కుమార్తె యొక్క కుమారుడు), బ్రాహ్మణుడు
వరుస క్రమంలో లభ్యతను బట్టి వారి కర్మలు
మహాలయ పక్షములో పిండప్రదానం చేయుట వల్ల
వారి ఆత్మలకు సద్గతులు కలుగజేసి వారి దీవనలతో
సుఖసంతోషాలు పొందవచ్చును.
తల్లితండ్రుల మరియు
పూర్వీకుల ఆత్మలు ముక్తిపొందుటకు పితృ ముక్తిక్షేత్రాలుగా
పరిగణించు పంచ (ఐదు) గయా క్షేత్రాలైన శిరోగయ (బీహార్),
నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ
(సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మకపాల్ (బద్రీనాథ్)లలో
పిండప్రదానం చేయవలసి ఉంది.
అన్నిక్షేత్రములు
దర్శించలేనివారు పుణ్య క్షేత్రములైన కాశీ (వారణాశి), గయ
మరియు ప్రయాగ లందు పిండప్రదానం చేయడంవల్ల
వారి ఆత్మలకు ముక్తి కలుగుతుంది..
పురాణమలందు తెలిపిన ప్రకారం శ్రాద్ధకర్మ కానీ పిండప్రదానం
చేయుటకుగాని అర్హతకల కర్త అనగా కుమారుడు, దౌహిత్రుడు
లభ్యం కానప్పుడు శోత్రియ
బ్రాహ్మణుని నియోగించి
వారి ద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండప్రదానం చేయించు
ఏర్పాటు కొన్ని సత్రములందు మరియు ఆశ్రమములందు
లభ్యం. అంతేకాక విదేశములలో నుండి పితృకర్మలు
చేయుటలో లేదా చేయించు కొనుటపట్ల ఆసక్తి ఉన్నవారికి
లేదా పితృకర్మ చేయుటకు ఆసక్తి ఉన్ననూ శారీరక ధృఢత్వం
లేక చేయలేనివారికి
శాస్త్రంలో తెలిపినట్లు ప్రత్యామ్నాయంగా
శోత్రియ బ్రాహ్మణునితో వారి స్థానంలో ఆబ్దీక, పిండప్రదానాది
కార్యక్రమములు నిర్వర్తించు
సదుపాయం ఉన్నది.
అశౌచకర్మలైన శ్రాద్ధకర్మలు, పిండప్రధానం తదితర
కార్యక్రమాలకు వంశంలో గత మూడు తరముల గోత్ర
నామములు (బ్రాహ్మణులలో ప్రవర) అవసరమై ఉన్నవి.
గతంలో ఉమ్మడి కుటుంబాలు మరియు గ్రామాల్లో
నివసించడం వలన తమకు తెలియని పితృవర్గ సమాచారం
బంధువులను, పెద్దలనడిగి తెలుసుకొనే వెసులుబాటు
ఉండేది. కాలంమారి ప్రస్తుత తరం వారు విద్యాభ్యాసం
మరియు భుక్తికొసం పట్టణాలు, విదేశాలు వలస వెళ్ళుటవల్ల
తమవారికి దూరమై కనీసం తమవారు ఎవరు, తమ గోత్రం ఏమిటి
అనే వివరాలుకూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇది
ఆందోళన కలిగించే విషయం. శుభకార్యములైన ఉపనయనం,
వివాహాది క్రతువులు, అశుభకార్యములైన వైదికకర్మలు,
శ్రాద్ధకర్మలు, పిండప్రదానం తదితర కార్యక్రమాలకు కూడా
వంశములో మూడుతరముల వారి గోత్రనామములు, ప్రవర
తదితరముల ఆవశ్యకత ఉంది.
అధికభాగం తమ తాతలపేర్లు
గోత్రం చెప్పలేని స్థితిలో ఉన్నారు.
చదువరుల సౌలభ్యము కొరకు పితృవర్గ సమాచార సేకరణకు
పట్టిక నిచ్చుచున్నాము. నగరాలు మరియు విదేశాలలో
ఉద్యోగ రీత్యా నివసిస్తున్నవారు శ్రద్ధ వహించి, అవసరమైన
సమాచారాన్ని తమ కుటుంబ పెద్దలను బంధువులను అడిగి
సేకరించి గతించిన పెద్దలకు
మహాలయ పక్షంలో పిండప్రదానం
మరియు శ్రాద్ధకర్మలు పుణ్యక్షేత్రములైన కాశీ, గయ మరియు
ప్రయాగలలో నిర్వహించి పూర్వీకుల ఆత్మలకు ముక్తి కలిగించి
వారి దీవనలతో అభివృద్ధి చెందాలని మరియు దేశ విదేశాల్లో
నివసిస్తూ దైవం మరియు భక్తుల సేవనందు ఆసక్తి కలవారు
కాశీలో చేయు పాప పుణ్యములు రెండునూ
కోటిరెట్ల ఫలితం
ఇచ్చునని పురాణాల్లో చెప్పబడి నందువల్ల, వారి పూర్వీకులకు
పిండప్రదానం చేయుటతో పాటుగా సత్రములకు,
ఆశ్రమములకు విరాళముల నిచ్చుట ద్వారా ఆర్ధిక పరిపుష్టి
కలిగించి వారి సేవలో పాలు పంచుకొనగలరని ఆశిస్తున్నాం.
From #Indian_pilgrim_tours FB Page.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మనం పూజించే దేవుడు/దేవత ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆ దేవుడి/దేవతా రూపం మనకి స్పష్టంగా గోచరిస్తే (మానసికంగా)..అది #సారూప్యముక్తి.(EX:కంచి పరమాచార్య కి కామాక్షి అమ్మ వారు,
రామకృష్ణ పరమహంస & తెనాలి రామలింగడి కి కాళికాదేవి ని కళ్ళు మూసుకుని ధ్యానంలో చూడగలిగారు!!)
భగవంతుడు ఉండే లోకాలలో నివసించగలిగితే అది #సాలోక్యముక్తి. (EX:శివుడి ప్రమధగణాలు,విష్ణుభటులు,అమ్మవారి 64 కోట్ల సైన్యం ఇలాంటి వారు ఈ కోవలోకి వస్తారు)
ఆ లోకంలో కూడా ఆ దేవుడి/దేనతకి అతిసమీపంలో ఉండగలిగే అదృష్టవంతులది #సామీప్యముక్తి (EX:నందీశ్వరుడు,చండీశ్వరుడు,భృంగీశ్వరుడు
ఇంటి ముందర, గడప మీద,గేటు బయట ముగ్గులు పెడితే ఆ ఇంట దుష్టశక్తులు ప్రవేశించకుండా,ఇంట్లో ఉన్న లక్ష్మి బైటికి వెళ్ళకుండా కాపాడతాయి.
ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు వేస్తే ఆ ఇంట మంగళకరమైన పనులు జరుగుతున్నాయి అని అర్దం.
నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూతప్రేతపిశాచాలని ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తుంది.
సాధారణంగా మనం వేసే ముగ్గుల్లో పద్మాలు శుభసూచకం.అందుకే ఏ ముగ్గునీ తొక్కకూడదు.అలాగే ఒట్టి ముగ్గు వేసి వదిలెయ్యకూడదు, దాని మీద కొంచెం పసుపు/కుంకుమ/పువ్వులు వెయ్యాలి.
తులసి కోట వద్ద,దేవుడి మందిరం వద్ద, పూజా పీఠం/పీట మీద అష్టదళపద్మం ముగ్గు వేయడం శుభకరం.
ఎవరైనా భిక్షువు/సన్యాసి ఇంటికి వస్తే ఏమీ ఇవ్వకుండా పంపించకూడదు.(శంకరాచార్యులు భిక్షకి వస్తే ఆ ఇంటి ఇల్లాలు వెతికి మరీ #ఎండుఉసిరికాయ ఇస్తే,సంతోషంగా ఆయన చేసిన కనకధారాస్తోత్రం ఫలితంగా బంగారు
విష్ణుసహస్రనామం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు విన్నారు, కానీ ఎవరూ రాసుకోలేదు. మరి అది ఎలా ప్రచారం పొంది మన వరకూ వచ్చింది??
ఈ ప్రశ్నకు సమాధానం కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఇలా చెప్పారు.
భీష్ముడు చెపుతున్నప్పుడు పాండవులు, వ్యాసమహర్షి అందరూ శ్రద్ధగా విన్నారు.కానీ ఎవరూ రాయలేదు.అప్పుడు ధర్మరాజు అడిగాడు శ్రీ కృష్ణుడ్ని "ఈ నామాలు మేమందరమూ విన్నాము.కానీ మళ్ళీ పారాయణ చెయ్యాలంటే ఎలా??ఏం చెయ్యాలి" అని.
"మళ్ళీ కావాలంటే వాటిని వ్యాసమహర్షి, సహదేవుడు మాత్రమే అందివ్వగలరు" అన్నాడు శ్రీ కృష్ణుడు.
అప్పుడు అక్కడి వారందరూ "అదెలా?!!"అన్నారు.
శ్రీకృష్ణుడు "మనందరిలో ఒక్క సహదేవుడు మాత్రమే #సూతస్పటికం వేసుకున్నాడు మెడలో.అది సాక్షాత్తూ మహేశ్వర స్వరూపం.
ఇది భోజరాజు కాలం నాటి కథ.
"దాసు"అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు భోజుని ధారానగరంలో. ఎన్నోపూజలు,వ్రతాలూ చేసినా,నోములు నోచినా చాలాకాలం పిల్లలు లేరు ఆ దంపతులకి.
ఒకసారి గుడిలో ఉపన్యాసం ఐపోయిన తర్వాత దాసు, ఆ పండితుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు "తాను తండ్రి ఎలా కాగలనో"
చెప్పమని. ఆయన బాగా అలోచించి అప్పుడే గుడిలో అడుగుపెట్టిన ఒక యోగి ని చూపించి "ఈయన #న_ప్రతిగ్రహీత(ఎవరి దగ్గర ఏదీ తీసుకోని వాడు)ఈయన్ని నీకు బాకీ పడేలా చేసుకుంటే నీకు పుత్రుడిలాగా తప్పకుండా వస్తాడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను"అని వెళ్ళాడు.
దాసు ఆలోచన లో పడ్డాడు.ఆయనకి ఏం ఇవ్వాలి?
అసలే ఎవ్వరి దగ్గర ఏం తీసుకునే వాడు కాదని అంటారు.ఒకవేళ 'ఇది కావాలి' అని అడిగితే నా వల్ల ఏం అవుతుంది తెచ్చి ఇవ్వడం అని.
ఆయన దినచర్యలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు కొన్ని రోజులు.ప్రతి రోజూ నదీతీరాన స్నానం, సంధ్యావందనం చేసి ఆశ్రమానికి వచ్చి,ఫలమో,కాయో(ఎవరైనా ఇస్తే)తిని సదా
#విష్ణుసహస్రనామం_ప్రతిపదార్థం
1.విశ్వం=ప్రపంచమే తానుగా ఐన వాడు.
2.విష్ణుః=ప్రపంచంలో అన్నిటా వ్యాపించి ఉన్నవాడు.
3.వషట్కారః=యజ్ఞం లోని ద్రవ్యాలని స్వీకరించువాడు.
4.భూతభవ్యభవత్ప్రభుః=భూత-భవిష్యత్-వర్తమానం మూడింటికీ అధికారి ఐన వాడు.
5.భూతకృద్=స్థావరాలని(ప్రాణం లేనివి),జంగమాలనీ(ప్రాణం ఉండి తిరిగేవి) సృష్టించేవాడు.
6.భూతభృత్=తానుగా సృష్టించిన వాటిలో ఉన్న మంచి చెడు బేధాన్ని చూడకుండా అన్నింటినీ,అందరినీ భరించేవాడు.
7.భావః=ప్రపంచమే తన చిరునామాగా కలవాడు.
8.భూతాత్మా=సమస్త ప్రాణులకు ఆత్మరూపంగా ఉన్నవాడు.
9.భూతభావనః=ప్రాణులన్నింటినీ అభివృద్ధి చేస్తూఉండేవాడు.
10.పూతాత్మా=పవిత్రమైన ఆత్మ కలవాడు.
11.పరమాత్మా=అందరిలో ఉన్న ఆత్మలన్నింటికీ ఆత్మ ఐనవాడు.
12.ముక్తానాం పరమాగతిః=మోక్షాన్ని పొందటానికి ఎవర్ని చేరాల్సి ఉందో అతడు.
13.అవ్యయః=మార్పు/నాశనం లేనివాడు.