ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6% రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర #ST కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర STకమిషన్ చైర్మన్ అద్యక్షతన బుధవారం సచివాలయం పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడుతూ @Tourism_AP
నియామకాల్లో రిజర్వేషన్ కు మించి STలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అయితే రాష్ట్రంలోని #ITDA, ITDA యేతర ప్రాంతాల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో STలకు కేటాయించిన 6% రిజర్వేషన్ సక్రమంగా అమలుకావడం లేదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు
భవిష్యత్తులో జరిగే నియామకాల్లో ఈ లోటును పూరిస్తూ అర్హత, అవకాశం మేరకు గిరిజన అభ్యర్థులతోనే ఉద్యోగ నియామకాలు జరపాలని పర్యాటక శాఖ అధికారులకు ఆయన సూచించారు. 2007లో తీసుకున్న నిర్ణయం మేరకు బొర్రా గుహల ద్వారా వచ్చే నికర అదాయంలో 20%ఆదాయాన్ని బొర్రా గ్రామ పంచాయితీకే కేటాయించాల్సి ఉందని,
అయితే ఆ నిర్ణయం సక్రమంగా అమలు కావడం లేదని ఆయన అన్నారు. FY 2014-15నుండి ఈ ఏడాది జూలై మాసాంతం వరకూ బొర్రా గుహల ద్వారా వచ్చిన మొత్తం నికర ఆదాయంలో 20% నిధులను అంటే దాదాపు రూ.204.76 లక్షలను బొర్రా గ్రామ పంచాయితీకి కేటాయించాల్సి ఉందన్నారు.
అయితే ఇప్పటి వరకూ కేవలం రూ.41.84 లక్షలను మాత్రమే ఆ పంచాయితీకి కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. మిగిలిన సొమ్ము రూ.162.92 లక్షలను వెంటనే బొర్రా గ్రామ పంచాయితీకి కేటాయించాలని పర్యాటక శాఖ అధికారులకు ఆయన సూచించారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్లోర్ ఆల్కలై పరిశ్రమల హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు @ApiicOfficial ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. @AdityaBirlaGrp ప్రతినిధులు మంగళగిరి #APIIC కార్యాలయంలో ఛైర్మన్ ని కలిశారు.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ బలభద్రాపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభం జరిగిన పరిసరాల్లో క్లోర్ ఆల్కలై పరిశ్రమలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. క్లోర్ ఆల్కలై ప్రక్రియలో కాలుష్యం లేకుండా కాస్టిక్ సోడా తయారవుతుందని ఛైర్మన్ కు వివరించారు.
ఫార్మా, ఆక్వా కల్చర్, షుగర్ మిల్స్, వాటర్ సానిటేషన్, హైడ్రోజన్ సార్బిటాల్ ఆధారిత ఉత్పత్తుల్లో క్లోర్ ఆల్కలై కీలకమన్నారు. కాకినాడ సమీపంలోని గ్రాసిమ్ పరిశ్రమ సమీపంలో ఈ దిశగా మరింత విస్తరణకు కసరత్తు చేయడానికి తోడ్పాటునందించాలని ఏపీఐఐసీ ఛైర్మన్ ని కోరారు.
రాజ్యసభ ఎంపీ @GVLNRAO@MoHFW_INDIA శాఖ మంత్రి @mansukhmandviya ను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో #CGHS కార్యకలాపాలకు ప్రత్యేక అదనపు డైరెక్టర్‌ను నియమించాలని, విశాఖపట్నంలో CGHS కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
APలోని వైజాగ్ లో అత్యధిక CGHS లబ్ధిదారులు ఉన్నారని, ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి AP విభజన జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో నియమితులైన CGHS అదనపు డైరెక్టర్ మాత్రమే తెలంగాణతో పాటు APలో CGHS కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నారని GVL కేంద్ర మంత్రికి అందచేసిన లేఖలో తెలియచేసారు.
అన్ని ఇతర దక్షిణాది రాష్ట్రాలకు CGHS కు ప్రత్యేక అదనపు డైరెక్టర్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో CGHS కై ప్రత్యేక కార్యాలయం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు CGHS సేవలను అందించడంలో విపరీత జాప్యం జరుగుతోందని జీవీఎల్ పేర్కొన్నారు.
AP రాష్ట్రంలో నిర్వహించబడుచున్న బాలల సంరక్షణ కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ Chairperson కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు.
బాలల న్యాయచట్టప్రకారం 18సం లోపు గల రక్షణ సంరక్షణ అవసరమగు నిరాదరణకు గురైన బాలలను వసతి గృహాలలో చేర్పించే ముందు తప్పని సరిగా ఆయా జిల్లాలకు సంబంధించిన బాలల సంక్షేమ సమితి ఆదేశాలతో బాటు జిల్లా అధికారులచే ధృవీకరించిన లైసెన్సు విధిగా ఉండాలన్నారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు.
కమిషన్ కార్యాలయంలో జువైనెల్ వెల్ఫేర్ డైరెక్టర్ BDV ప్రసాద్ మూర్తి మాట్లాడుతూ ఏ సంస్థ అయినా ఇటువంటి పిల్లలతో బాలల సంరక్షణ కేంద్రం నిర్వహించాలనుకుంటే బాలల న్యాయచట్టం, సెక్షన్ 41నియమ, నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకొని లైసెన్సును జిల్లా అధికారులు ధృవీకరణతో తీసుకోవాలని తెలిపారు.
►ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు గుప్పించారు.
►డిజిటల్ చెల్లింపులు, పారిశుధ్యం, టీకా డ్రైవ్, మహిళా సాధికారత వంటి కీలక అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారని కొనియాడారు
.
►ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక సంఘాలు, డిజిటల్ సాధికారత వంటి అనేక అంశాలకు భారత దేశం ఐకాన్‌గా నిలిచిందని, దీనికి ప్రధాని మోదీ కృషే కారణమని వెల్లడించారు.
►ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు గుర్తింపులేని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం తమ జాబితా నుంచి తొలగించింది.
► తెలంగాణలో 14 RUPPలను క్రియాశీలకంగా లేని పార్టీలుగా గుర్తించింది.
► దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత RUPPలుగా ప్రకటించింది.
►దీంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.
►పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయాలి.
►ఆ తర్వాత పోటీ చేయడం కొనసాగించాలి. పార్టీ ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.