DD News Andhra (అధికారిక ఖాతా) Profile picture
This is the Official Twitter account of Doordarshan News, Andhra Pradesh.The News is broadcast daily through DD Saptagiri at 8AM, 1PM,5PM, 7PM and 09.30PM.
Apr 30, 2023 4 tweets 2 min read
►నా ప్రియమైన దేశప్రజలారా, మన ఉపనిషత్తులలో ఒక మంత్రం అనాదిగా మన మనసుకు ప్రేరణను అందిస్తోంది
"చరైవతి చరైవతి చరైవతి"
నడుస్తూ ఉండు, నడుస్తూ ఉండు, నడుస్తూ ఉండు.
►నేడు మనం "నడుస్తూ ఉండు,నడుస్తూ ఉండు" అనే ఇదే భావనతో వందవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము.
#MannKiBaat100 Image ►భారతీయ సామాజిక జన జీవనాన్ని బలోపేతం చేసే మన్ కీ బాత్, అందరి మనసులనీ జోడించే మాలలో దారం వంటిది.
►ప్రతి సంచికలోనూ దేశప్రజల సేవా సామర్థ్యాలు ఇతరులకు ప్రేరణను అందించాయి.
►ఈ కార్యక్రమం ద్వారా ప్రతి దేశపౌరుడూ మరొక పౌరుడికి ప్రేరణగా నిలుస్తాడు.
Apr 30, 2023 4 tweets 2 min read
►మిత్రులారా.. నేడు దేశంలో పర్యాటన చాలా వేగంగా పెరుగుతోంది : ప్రధాని మోదీ
►మన ప్రాకృతిక వనరులైన నదులు, కొండలు, చెరువులు, లేదా మన పుణ్య క్షేత్రాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం.
► ఇది పర్యాటకరంగానికి చాలా సహాయపడుతుంది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannkiBaat100Episode Image ►పర్యాటనలో పరిశుభ్రతతో పాటూ మనం Incredible India movement గురించి కూడా ఎన్నో సార్లు చర్చించాము.
►ఈ ఉద్యమం వల్ల ప్రజలకు వారి చుట్టుపక్కలే ఉన్న ఎన్నో ప్రాంతాల గురించి మొదటిసారిగా తెలిసింది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannkiBaat100Episode
Apr 30, 2023 5 tweets 2 min read
► మన్ కీ బాత్ లో మనం ప్రస్తావించుకునే వ్యక్తులే మనకు నాయకులు. వారే ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చారు : ప్రధాని మోదీ
► ఇవాళ మనం ఈ కార్యక్రమ నూరవ అంకానికి చేరుకున్నామంటే, మరోసారి మనందరమూ ఈ నాయకులందరి వద్దకూ వెళ్ళి, వారి ప్రయాణాని గురించి తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది. Image ►నేడు మనమ్ కొందరు మిత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం : ప్రధాని మోదీ
►నాతో ఇప్పుడు హర్యానాకు చెందిన సోదరుడు సునీల్ జగ్లాన్ గారు ఉన్నారు.
►సునీల్ జగ్లాన్ గారి ప్రభావం నా మనసుపై ఎంతో ఉంది : ప్రధాని మోదీ
►ఎందుకంటే హర్యానాలో లింగ నిష్పత్తిపై ఎంతో చర్చ జరుగుతూ ఉండేది.
Apr 30, 2023 5 tweets 2 min read
►నాకు "మన్ కీ బాత్" అంటే ప్రజల రూపంలో ఉన్న భగవంతుడి చరణాల వద్ద ఉంచే ప్రసాదపు పళ్ళెం లాంటిది : ప్రధాని మోదీ
►మన్ కీ బాత్ కార్యక్రమం నా మనసు చేసే ఆధ్యాత్మిక ప్రయాణంగా మారింది.
►మన్ కీ బాత్ - "నా" నుంచి మొదలయ్యే సమిష్ఠి ప్రయాణం : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannKiBaat Image ►మన్ కీ బాత్ - అహమ్ నుంచి వయం వరకూ ప్రయాణం.
►ఇది నేను కాదు, మీరు చేసే సంస్కార సాధన : ప్రధాని మోదీ
►మీరు ఉహించండి, నా దేశ పౌరుడొకడు నలభై ఏళ్ళ నుంచీ నిర్జన కొండప్రాంతంలో, బంజరు భూమిలో చెట్లు నాటుతున్నాడు.
Apr 30, 2023 5 tweets 3 min read
►నా ప్రియమైన దేశప్రజలారా,
►ఈ కార్యక్రమం నన్ను మీ నుంచీ ఎప్పుడూ దూరం కానివ్వలేదు : ప్రధాని మోదీ
► నాకు బాగా గుర్తుంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడి సామాన్య ప్రజలతో కలిసి తిరగడం అనేది సహజంగానే జరుగుతూ ఉండేది.
#MannKiBaat100 #MannKiBaat Image ►ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొనే కార్యక్రమాలు, చేసే పనులు ఇలా ప్రజలతో కలిసి ఉండే అవకాశాలను ఎక్కువగా వస్తూనే ఉంటాయి.
►కానీ.. 2014లో ఢిల్లీ వచ్చిన తరువాత ఇక్కడి జీవితం అందుకు పూర్తిగా విరుధ్ధంగా ఉంది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannKiBaat
Apr 30, 2023 4 tweets 2 min read
►అసలు మన్ కీ బాత్ మొదలయ్యి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు గడిచాయి అంటే నమ్మశక్యంగా ఉండదు : ప్రధాని మోదీ
► ప్రతి కార్యక్రమమూ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతిసారీ, సరికొత్త ఉదాహరణల కొత్తదనం, ప్రతిసారీ దేశప్రజల కొత్త విజయాలు ఇందులో భాగమయ్యాయి.
#MannKiBaat100 #MannKiBaat ►మన్ కీ బాత్ లో దేశం నలుమూలల నుండీ ప్రజలు పాల్గొన్నారు. అన్ని వయసుల వారు ఇందులో భాగమయ్యారు : ప్రధాని మోదీ
Apr 29, 2023 4 tweets 2 min read
🟥 కేంద్ర జలశక్తి, ఆహార శుద్ది కర్మాగారాల శాఖ సహాయ మంత్రి @prahladspatel విజయవాడలో పత్రిక సమావేశం

🟥 విజయవాడ రావడం సంతోషంగా ఉంది

🟥 దేశంలో చిరు ధాన్యాల ప్రచారాన్ని PM మోదీ స్వయంగా తీసుకున్నారు

🟥 దేశంలో ప్రజలు భోజనం చేస్తున్నా పౌష్టికాహారం తీసుకోవడం లేదు ImageImage 🟥 చిరు ధాన్యాల ద్వారానే ప్రతీ ఒక్కరికీ పౌష్టికాహారం అందుతుంది

🟥 2018 సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించింది

🟥 మళ్లీ 2019 నుంచి చిరు ధాన్యాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు
Apr 28, 2023 5 tweets 2 min read
►మన గౌరవ ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ ఎపిసోడ్లలో నిరంతరం అనేక సమస్యలను మరియు సంఘటనలను లేవనెత్తారు. తత్ఫలితంగా,భారతదేశం యొక్క అద్భుత చరిత్ర విశిష్టతను శ్రేష్ఠతను ప్రపంచం మొత్తం తెలుసుకుంది : పండిట్ అజోయ్ చక్రబర్తి,పద్మభూషణ్ అవార్డు గ్రహీత,భారతీయ శాస్త్రీయ గాయకుడు
#MannKiBaatAt100 Image ►ఇవన్నీ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా మూడు విషయాలపై ప్రత్యేకంగా నొక్కిచెప్పారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను.
►మొదటిది భారతీయులందరిలో సమైక్యత, వారి కులాలు మరియు మతం లేదా వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఏకత్వ భావాన్ని రేకెత్తిస్తోంది.
#MannKiBaat
Dec 23, 2022 4 tweets 1 min read
♦కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించారు.
♦గుడ్లవల్లేరులో హైస్కూల్‌, విజయవాడ, గుడివాడలలో కాలేజీ విద్యనభ్యసించారు. ♦ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి ‘పల్లె పడుచు’, ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులం లేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ వంటి నాటకాల్లో అటు విలన్‌గా, ఇటు హీరోగా మెప్పించారు.
Dec 22, 2022 6 tweets 1 min read
♦ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు.
♦రేపు జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
♦ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. ♦అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కడపలోని అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకుంటారు.
♦దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
♦దర్గా నుంచి బయలుదేరి రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు.
Dec 22, 2022 4 tweets 1 min read
♦ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’లో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు తొలి అడుగు వేశాయి.
♦ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. ♦సుమారు 10విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి.
Dec 21, 2022 5 tweets 1 min read
✓రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపు రిజర్వేషన్లు రాజ్యాంగంలోని (ఆర్టికల్ 342 ఎ (3)) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చు: రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్న కు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ✓ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ప్రశ్నించారు.. జీవీఎల్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ సమాధానం ఇస్తూ...
Dec 21, 2022 4 tweets 1 min read
♦కల్వరి విభాగం జలాంతర్గామి వాగిర్‌ భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరింది.
♦ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సబ్‌మెరైన్‌ను నేవీ అధికారులకు అప్పగించారు.
♦కేవలం 24 నెలల వ్యవధిలో మూడవ జలాంతర్గామిని భారత నౌకాదళానికి అందించారు. ♦ ఇది ప్రాజెక్ట్‌-75 లోని ఐదో కల్వరి తరగతి జలంతర్గామి యార్డ్ 11879. ఈ ప్రాజెక్ట్‌ కింద మొత్తం 6 స్వదేశీ జలంతర్గాములను స్కార్పెన్‌ డిజైన్ సంస్థ తయారుచేసి ఇవ్వనుంది.
♦ఈ సబ్‌మెరైన్‌ను మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో నిర్మిస్తోంది.
Dec 20, 2022 4 tweets 2 min read
🟥స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులలో భాగంగా తెలంగాణలో (4), APలో (2) అవార్డులు అందుకున్న @SCRailwayIndia

🟥తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న“తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2022”లో 4అవార్డులను కైవసం చేసుకున్న @SCRailwayIndia ImageImageImage 🟥APSEC, ఇంధన మంత్రిత్వ శాఖ అందించిన “APస్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2022”లో 2అవార్డులను పొందిన @SCRailwayIndia

🟥APSEC అవార్డులు
• ఆసుపత్రి భవనాల లో @drmvijayawada రైల్వే ఆసుపత్రికి గోల్డ్
• ఆఫీస్ బిల్డింగ్స్ లో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సెంటర్ కు సిల్వర్ అవార్డు
Oct 13, 2022 5 tweets 2 min read
హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మరోవైపు పిడుగుల మోతతో నగరం దద్ధరిల్లిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఏ ఒక్క ప్రాంతాన్నీ వరుణుడు వదిలిపెట్టలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది. ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేటతదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
Oct 10, 2022 4 tweets 1 min read
వివాదాస్పద వీడియో అనంతరం పీడీ చట్టం కింద అరెస్టై ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌- బీజేపీ నాయకత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు సమాధానం పంపారు.పార్టీ గౌరవానికి భంగం కలిగే చర్యలు ఏనాడు తాను చేపట్టలేదని రాజాసింగ్‌ తన వివరణలో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నాలుగు పేజీల తన వివరణతో అనేక అంశాలను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై దురుద్దేశంతో కేసులు మోపిందని ఆరోపించారు. మనవర్ షో తర్వాత తాను ఒక వీడియోను విడుదల చేశానని రాజాసింగ్ తెలిపారు.
Oct 9, 2022 4 tweets 1 min read
దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్‌ గ్రామంగా గుజరాత్‌లోని మొధేరా నిలిచింది. శుక్రవారం గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని @narendramodi దేశంలోనే తొలిసారి 24×7 సోలార్‌ విద్యుత్‌ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు. Image ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారన్నారు. ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు చెప్పారు.
Sep 15, 2022 4 tweets 2 min read
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్లోర్ ఆల్కలై పరిశ్రమల హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు @ApiicOfficial ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. @AdityaBirlaGrp ప్రతినిధులు మంగళగిరి #APIIC కార్యాలయంలో ఛైర్మన్ ని కలిశారు. ImageImage ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ బలభద్రాపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభం జరిగిన పరిసరాల్లో క్లోర్ ఆల్కలై పరిశ్రమలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. క్లోర్ ఆల్కలై ప్రక్రియలో కాలుష్యం లేకుండా కాస్టిక్ సోడా తయారవుతుందని ఛైర్మన్ కు వివరించారు.
Sep 14, 2022 5 tweets 3 min read
రాజ్యసభ ఎంపీ @GVLNRAO @MoHFW_INDIA శాఖ మంత్రి @mansukhmandviya ను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో #CGHS కార్యకలాపాలకు ప్రత్యేక అదనపు డైరెక్టర్‌ను నియమించాలని, విశాఖపట్నంలో CGHS కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ImageImageImageImage APలోని వైజాగ్ లో అత్యధిక CGHS లబ్ధిదారులు ఉన్నారని, ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి AP విభజన జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో నియమితులైన CGHS అదనపు డైరెక్టర్‌ మాత్రమే తెలంగాణతో పాటు APలో CGHS కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నారని GVL కేంద్ర మంత్రికి అందచేసిన లేఖలో తెలియచేసారు.
Sep 14, 2022 4 tweets 2 min read
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో @JaiTDP అధినేత @ncbn అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం #TDP శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. మంగ‌ళ‌గిరిలోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చ జ‌రిగింది. Image శాస‌న స‌భా స‌మావేశాల్లో మొత్తంగా 15 అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని టీడీఎల్పీ నిర్ణ‌యించింది. అమ‌రావ‌తిలో అక్ర‌మాల పేరిట కేసులు న‌మోదు చేస్తున్న వైనంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని తీర్మానించింది.
Sep 14, 2022 5 tweets 2 min read
ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6% రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర #ST కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర STకమిషన్ చైర్మన్ అద్యక్షతన బుధవారం సచివాలయం పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ImageImageImageImage ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడుతూ @Tourism_AP
నియామకాల్లో రిజర్వేషన్ కు మించి STలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అయితే రాష్ట్రంలోని #ITDA, ITDA యేతర ప్రాంతాల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో STలకు కేటాయించిన 6% రిజర్వేషన్ సక్రమంగా అమలుకావడం లేదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు