దర్శక నిర్మాత రచయిత #ఆలూరి_చక్రపాణి గారి వర్ధంతి నేడు..

చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. వ్రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే
ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆయన నేతృత్వంలో వెలుగు చూసిన ‘యువ’ మాస పత్రిక సైతం పండితపామరులను అలరించింది. ఇక చిత్రసీమలోనూ చక్రపాణి బాణీ భలేగా సాగింది.
‘చెక్కన్న’గా సినీజనం అభిమానం సంపాదించిన చక్రపాణి మిత్రుడు బి.నాగిరెడ్డితో కలసి ‘విజయా సంస్థ’ను నెలకొల్పి, తెలుగువారు మరచిపోలేని చిత్రాలను అందించారు. ఆ రోజుల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోగా ‘విజయా-వాహినీ స్టూడియోస్’ను తీర్చిదిద్దడంలోనూ చక్రపాణి పాత్ర ఎంతో ఉంది.
చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. 1908 ఆగస్టు 5న తెనాలిలో జన్మించారు. ఆయనకు ముందు తరువాత కూడా ఎందరో సరస్వతీపుత్రులు, సాహితీప్రియులు తెనాలిలో వెలిశారు. చక్రపాణి అన్నది ఆయన కలం పేరు. చిన్నతనం నుంచీ సాహిత్యం అంటే చెప్పలేనంత అభిమానం. 1932లో చక్రపాణి టీబీ బారిన పడ్డారు.
ఆ రోజుల్లో ఆ వ్యాధికి మదనపల్లె శానిటోరియం తగిన చికిత్స అందించేది. అక్కడ చేరిన చక్రపాణికి, అదే వ్యాధితో శానిటోరియం వచ్చిన ఓ బెంగాలీ పరిచయమయ్యారు. ఆయన ద్వారా బెంగాలీ భాష నేర్చుకున్న చక్రపాణి, తరువాతి రోజుల్లో శరత్ బాబు రాసిన బెంగాలీ నవలలు ‘దేవదాసు’, ‘బడీ దీదీ’
తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత మరికొందరు శరత్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినా, చక్రపాణిలాగా పాఠకులను ఆకట్టుకోలేక పోయారు. చక్రపాణి కలం నాటకాలూ పలికించింది.

పి.పుల్లయ్య ఆహ్వానం మేరకు ఆయన తెరకెక్కించిన ‘ధర్మపత్ని’కి రచన చేశారు చక్రపాణి. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’కు
కూడా చక్రపాణి రచయిత. సినిమాలకు రచన చేస్తూ, తన రచనలను పుస్తకాలు వేయిస్తూ ఉండేవారు చక్రపాణి. ఆ క్రమంలో బి.యన్.కె. ప్రెస్ నిర్వహిస్తున్న బి.యన్. రెడ్డి తమ్ముడు బి.నాగిరెడ్డి పరిచయమయ్యారు. అది కాస్తా గాఢ స్నేహంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులు కలసి ‘విజయా’ సంస్థను నెలకొల్పి, విలువలుగల
చిత్రాలను వినోదంతో నింపి మరీ ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంకేముంది విజయావారి చిత్రాలను తెలుగు జనం విశేషంగా ఆదరించారు. అలాగే తెలుగు సినిమా స్వర్ణయుగంలో విజయావారి చిత్రాలే అధికంగా విజయం సాధించాయని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘షావుకారు’
మొదలు చివరి సినిమా ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ దాకా ఆ ఇద్దరు మిత్రులు అదే తీరున సాగారు. వారు అందించిన “షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు, జగదేకవీరుని కథ, గుండమ్మకథ, సి.ఐ.డి” చిత్రాలను జనం ‘నవరత్నాలు’గా భావించారు.
చెక్కన్న తాను నిర్మించే చిత్రాల విషయంలో ప్రతీ అంశంలోనూ జోక్యం చేసుకొనేవారు. అది ఎల్.వి.ప్రసాద్ లాంటివారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. కానీ, కేవీ రెడ్డి మాత్రం ‘పాతాళభైరవి’ సమయంలో చెక్కన్నతో కలసి పనిచేశారు. ఆ తరువాత నుంచీ విజయా సంస్థలో కేవీ రెడ్డి పనిచేసే సమయంలో ముందుగానే
‘చెక్కన్న జోక్యం చేసుకోరాదు’ అని నియమం పెట్టి మరీ చిత్రాలు తీశారు. దాంతో చెక్కన్నకు దర్శకత్వం అన్నది ఏమీ బ్రహ్మపదార్థం కాదు, స్క్రిప్ట్ సరిగా ఉంటే దర్శకుల గొప్పతనం ఏముంది అనేవారు. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని ఆయన సూచనల మేరకే తెరకెక్కించారు. డి.వి.నరసరాజు రచనతో కమలాకర కామేశ్వరరావు
దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ తెరకెక్కింది. అదే సమయంలో ఈ చిత్రాన్ని తమిళంలో ‘మనిదన్ మారవిల్లై’ పేరుతో చక్రపాణి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.

తెలుగులో ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్ కాగా, తమిళ ‘మనిదన్ మారవిల్లై’ పరాజయం పాలయింది. అప్పటి నుంచీ చక్రపాణి ఎక్కడ తేడా వచ్చిందా అన్న
ఆలోచనలో పడ్డారు. పద్నాలుగేళ్ళ తరువాత ‘మిస్సమ్మ’ కథను అటుఇటుగా మార్చి, ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందించాలనుకున్నారు. బాపును తన కో-డైరెక్టర్ గా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే అంటే 1975 సెప్టెంబర్ 24న చెక్కన్న కన్నుమూశారు.
తరువాత బాపు నిర్దేశకత్వంలో ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందింది. ఆ సినిమా ఆట్టే అలరించలేకపోయింది. చెక్కన్న మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. నాగిరెడ్డితో కలసి చెక్కన్న నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్,
డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. వారి తలపులు మాత్రం జనం మదిలో నిలచే ఉన్నాయి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Sep 24
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. గుండెలోతుల్లో గూడుకట్టుకున్న భావోద్వేగం.. తెరలు తెరలుగా కంటిని కమ్మేస్తున్న వేళ.. Image
ప్రపంచాన్ని మరిచి ఏడ్చేశారు ఇద్దరూ. వాళ్ల ప్రభంజనానికి ఎర్రమట్టి కోర్టులు సాగిలపడ్డాయి. పచ్చికమైదానాలు పాహిమాం అన్నాయి. అయితే నువ్వు లేదంటే నేను ఇలానే సాగింది వాళ్ల కెరీర్ అంతా. ఆ తర్వాత నవతరం, యువరక్తం దూసుకువచ్చినా సీనియర్లుగా ఈ ఇద్దరి వాడీ వేడి ఎక్కడా తగ్గలేదు. పడిన ప్రతీసారి Image
కెరటాల్లా లేచారు. ఆడేది వేరే దేశాలకు కావచ్చు. మైదానంలో దిగితే ఇద్దరూ బద్ద శత్రువులే కావచ్చు. కానీ ఆట ముగిసిన ఆ మరుక్షణం ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. #రోజర్_ఫెదరర్, #రఫెల్_నాదల్.. టెన్నిస్ ను ఇష్టపడే ఇప్పటి తరం అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు ఇవి. Image
Read 18 tweets
Sep 24
భూస్వాముల, కామాందుల దౌర్జన్యానికి బలి అయ్యి, సర్వం కోల్పోయి , పగబట్టి గజదొంగ గానో , బందిపోటు దొంగగానో మారి ధనవంతుల కొల్లగొట్టే పాత్రలలో #ఎస్వీఆర్ అదరగొట్టేసే వారు. గంబీరంమైన నిలువెత్తు విగ్రహం, హుంకరించే స్వరం , భయపెట్టే హావభావాలతో ఆలాంటి పాత్రలకు ప్రాణప్రతిష్ట చెయ్యడం లో Image
ఎస్వీఆర్ అగ్రగణ్యులు. బందిపోటు దొంగలు, బందిపోటు భీమన్న, డాక్టర్ బాబు, దెబ్బకు టా దొంగల ముఠా , కత్తుల రత్తయ్య చిత్రాలలో బందిపోటు గా కనిపిస్తారు. శ్రీ ఎస్వీఆర్, అలాంటి పాత్రలలో కూడా ప్రేక్షకుల కంట నీరు తెప్పించగల మహానటుడు వారు. అమాయకత్వం, నిస్సహాయత, భాధ , కసి, కోపంతో పాటు Image
జాలి , హాస్యం , పశ్చాతాపం చూపగల దిట్ట. బందిపోటు దొంగలు చిత్రంలో తూటా దెబ్బలు తగిలి డాక్టర్ ఇంటికివస్తాడు. సర్దార్, మత్త్తుమందు ఇవ్వకుండా తూటాలు తీయమని డాక్టర్ ను బెదిరిస్తాడు. చాల నొప్పిగా బాధగా ఉంటుందని చెప్పిన డాక్టర్ తో పరవాలేదు అంటాడు సర్దార్. డాక్టర్ భార్య పసి బిడ్డను Image
Read 5 tweets
Sep 24
అమృతం అంటే తెలియని వారు ఎంతమంది ఉంటారో అంతకన్నా ఎక్కువ #అమృతాంజన్ తెలిసిన వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు

కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించారు

తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం Image
కొనసాగింది.

1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యారు.

ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది.

నాగేశ్వరరావు గారు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించారు Image
వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో #అమృతాంజన్_లిమిటెడ్ స్థాపించారు

ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.

వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా అతనును ప్రభావితం చేశారు

స్వర్గీయ శ్రీ #కాశీనాథుని_నాగేశ్వరరావు పాత్రికేయుడు, Image
Read 17 tweets
Sep 24
#మధురమీనాక్షి_ఆలయ_అద్భుత_శబ్దసౌందర్యం

12 వ శతాబ్దంలో నిర్మించిన మధుర మీనాక్షి ఆలయ అందాలు చూడటానికే రెండు కళ్ళు చాలవు అనుకుంటే, ఆ ఆలయ నిర్మాణం వెనుక దాగి ఉన్న శబ్ద సౌందర్యం గురించి తెలుసుకుంటే మన పూర్వీకుల, శిల్పుల నైపుణ్యం, దూరదృష్టి, ఆలయ నిర్మాణాల వెనక దాగి ఉన్న రహస్యాలు Image
ఛేదించడానికి మన తరానికి ఉన్న మిడి మిడి జ్ఞానం సరిపోదు అనిపిస్తుంది. ఈ ఆలయ శిల్పులకు, నిర్మాతలకు శిరసా ప్రణామములు..

పురాతన తమిళులు మధురై మీనాక్షి ఆలయంలో సంగీత స్తంభాలను (#musicpillars) నిర్మించడంలో “శరీరాల కంపనం” సూత్రాలను ఉపయోగించారు. ఈ అద్భుతమైన ఆలయం యొక్క శబ్ద సౌందర్యంపై Image
తమిళనాడులోని ENT నిపుణుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం - విభిన్న సంగీత శబ్దాలను పొందటానికి శిల్పులు సరైన రకమైన రాయిని ఎన్నుకుని స్తంభాల పొడవు, వ్యాసాన్ని చాలా తెలివిగా తయారుచేశారు. ఒకే రాయిని ఉపయోగించడం ద్వారా, దాని ఆకారాన్ని తగిన విధంగా మార్చడం ద్వారా వారు దానిని సాధించగలిగారు. Image
Read 10 tweets
Sep 24
#పాతాళభైరవి..

షావుకారు సినిమా కు అనుకున్నంత డబ్బు రాలేదు. దానితో జానపద చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు విజయా వారు. ఆ భాద్యత దర్శకుడు కే.వి.రెడ్డి, రచయిత పింగళి తమ భుజం పై వేసుకున్నారు. కధ, స్క్రీన్ ప్లే సిద్ధం. పాత్రలకు తగ్గ నటీనటుల అన్వేషణ ప్రారంభం. Image
ముందు కధానాయకుడు తోటరాముడు ఎవరు? అప్పటికి ఎన్టీఆర్ ఒక్క జానపదం పల్లెటూరి పిల్ల లో నటించాడు, కానీ అక్కినేని చాల జానపదాలలో నటించి వున్నాడు. ఆలోచిస్తూ గదిలోని కిటికీ దగ్గరకు వచ్చాడు దర్శకుడు రెడ్డి గారు. పక్కనే టెన్నిస్ కోర్ట్. ఎన్టీఆర్, అక్కినేని ఆడుతున్నారు. కిటికీ నుంచి స్పష్టంగా Image
కనిపిసుంది. పట్టుదలగా, కసిగా, దీక్షగా బంతిని కొట్టుతున్న ఎన్టీఆర్ ని చూడగానే తోటరాముడు ఎవరో రెడ్డి గారు డిసైడ్ అయిపోయారు. మరో ముఖ్య పాత్ర నేపాళమాంత్రికుడు. #చక్రపాణిగారు #ముక్కామల కు కబురు పెట్టగా , అయన చాల భారీ పారితోషకం అడిగారని పెండింగ్ లో పెట్టారు. అప్పుడే #ఎస్వీఆర్ గారు Image
Read 10 tweets
Sep 24
#సతీ_సక్కుబాయి 1935లో విడుదలైన తెలుగు సినిమా,

ఆ తరువాత కడారు నాగభూషణం దర్శకత్వంలో యస్ వరలక్ష్మి గారితో సతీ సక్కుబాయి (1954) సినిమా గాఁ ,

అంజలి దేవి గారితో సతీ సక్కుబాయి (1965) సినిమా గాఁ పునః నిర్మించడం జరిగింది.

తొలి సినిమా గురించి మనకు అంత సమాచారం లేదు,
రెండవ సక్కు మాత్రం అద్భుతమనే చెప్పక తప్పదు, కాకోపోతే కాస్త శోకపుపాళ్లు ఎక్కువ , సతీ సక్కుబాయి (1954) సినిమా లోని పాటలు అద్భుతమే చెప్పాలి, యస్ వరలక్ష్మి గారి నటన, వారి గాత్రంతో ఈ సినిమాన్నిఇంకో స్థాయిలోకి తీసుకుని వెళ్లారు.

ఈ మూవీ లో అనుకున్నంత స్థాయిలో హాస్యం లేకపోవడం, ఎక్కువగా
అసలు విషయం పైన దర్శకుడు దృష్టి సారించడంతో హృదయానికి కాస్త భారంగా ఉంటుంది,

#కన్నాంబ గారి నటనకి పరాకాష్ట, #వరలక్ష్మి #కన్నాంబ గార్ల నటన అద్భుతం , వారిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు కట్టి పడేస్తాయి , రేలంగి , వరలక్ష్మి భార్య భర్తలుగా నటించడం విశేషం. గయ్యాళి పాత్రలో కన్నాంబ , కనకం
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(