మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది.
పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు.🤔
పెళ్లి కుమారుని డిమాండ్ల విషయమై నగరం మొత్తం చర్చనీయాంశంగా మారింది.
ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి కావడం విశేషం..!!
డిమాండ్లు ఇలా ఉన్నాయి..🤨
1)ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు.
2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది.
3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది.++
#నవ్వుకోండి 😆😆
Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు.
ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది. అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు.
నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. (అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా body gaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది.
మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, 'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది, తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.🤞
ఆరుద్ర జూన్ 22- జూలై 5 కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే.
‘ఆరుద్ర వాన అదను వాన,
ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, #ఆరుద్రకార్తె విత్తనానికిఅన్నం పెట్టిన ఇంటికి చెరుపులేదు,ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి లాంటి #సామెతలు.
"పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకెళ్ళి మూరేసిందట!" #తెలుగుసామెత 🤗
ఈ మీటర్లు సెంటీమీటర్లు ఇవన్నీ
వాడుకలో లేని రోజుల్లో.. #బెత్త, #జేన, #మూర వీటితోనే
కొలతలు కొలిచేవారు.. ఇప్పటికీ ఇవి వాడేవారు ఉన్నారు. రెండు బెత్తలు ఐతే ఒక జేన, రెండు జేనలు
ఐతే ఒక మూర. మూరెయ్యటం అంటే
ఎన్ని మూరలో చూడటం.
మన జేజమ్మలు #పదహారుమూరల చీర కట్టుకునేవారు,
మన అమ్మమ్మల కాలానికి వచ్చేసరికి #పద్నాలుగుమూరల#చీర అయింది, మన అమ్మలకి వచ్చేసరికి అది #పన్నెండుమూరలు అయింది. ఇక ఈ కాలంలో అది
పెద్ద మ్యాటర్ కాదనుకోండి.
సరే ఇక సామెతకి వస్తే...
ఎవరో ఒక అమ్మాయి ఒక
పెద్దావిడ దగ్గరకి వెళ్ళి 'అమ్మా నాకు చీర కొనుక్కోవటానికి డబ్బులు లేవూ ఒక పాత చీర ఇవ్వమ్మా' అని అడిగింది. సరే అని దయతలచి ఒక
చీర కట్టుకోమని ఇచ్చింది ఆ పెద్దావిడ. అది తీసుకున్న ఈ టెక్కులాడి గోడ చాటుకు వెళ్ళి, ఆ చీర ఎన్ని
మూరలుందో కొలుచుకుంటోందట!
#వయ్యారిభామ ( #parthinium) మన చుట్టూ పరిసరాల్లో కనిపించే ప్రమాదకరమైన మొక్క ఇది..
దీని గురించి నిజాలు తెలిస్తే షాకవుతారు..! పొలాల గట్ల వెంబడి అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతుంటాయి.
ఇలా పెరిగే మొక్కలలో వయ్యారి భామ మొక్క ఒకటి. అందమైన పేరు కలిగి ఉన్నప్పటికీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక, ముక్కు పుల్లాకు గడ్డి మొక్క అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది.
పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్రజలపై, పశువులపై కూడా దుష్పభ్రావాలను చూపిస్తుంటుంది. పంటలకు వేసే ఎరువులను కూడా ఈ మొక్క లాగేస్తుంది.
రామచంద్రమూర్తి అంటే ఆద్యంతము ధర్మమే. ధర్మము తప్ప ఆయనకు ఇంకోటి అక్కరలేదు.
రాముడు ధర్మము తప్పితే రామాయణములో కొన్ని కాండలు లేవు. రాముడు ధర్మమును విడచి పెట్టేదామని ఒక్కక్షణము అనుకుంటే,
కిష్కింద కాండలో సుగ్రీవునితో స్నేహము మానివేసి వాలితో స్నేహము చేస్తే చాలు.
రావణాసురుడు తన జీవితము మొత్తములో తాను ఓడిపోయింది వాలి, కార్తవీర్యార్జునునితోనే.
వాలితో స్నేహము చేస్తే వాలి రావణాసురునుని పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు. సుందరకాండ, యుద్ధకాండ లేవు.
అధర్మముతో ఉన్న వాలితో
స్నేహము చేసి సీతమ్మని తెచ్చుకోవడముకన్నా
సుగ్రీవునితో స్నేహము చేసి వాలిని సంహరిచి కష్టపడి సేతువు కట్టి యుద్ధము చేసి రావణుని
సంహరించి సీతమ్మను పొందుతాను అన్నాడు.