నటసార్వభౌమ నందమూరి తారక రామారావు రెండోసారి రావణుడి పాత్రలో మెరిసిన చిత్రం 'సీతారామ కళ్యాణం'. ఇందులో లంకాధీశుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. అలాగే ఈ సినిమాతో తొలిసారి
ఎన్టీఆర్ కెరీర్లో అపూరుప చిత్రరాజంగా ఎన్నదగిన.. ఎన్నో వైవిధ్య చిత్రాలు తీయడానికి సూచనగా మారిన నందమూరి వారసుడు బాలకృష్ణకు అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రం 'సీతారామకళ్యాణం'.
నందమూరి తారక రామారావు సినీరంగ ప్రవేశం చేసి..
అప్పటికి పుష్కర కాలమైంది. ఈ 12 ఏళ్లలోనే జానపద, పౌరాణిక పాత్రలెన్నింటిలోనో ఆయన మెప్పించారు. 'మాయాబజార్'లో శ్రీకృష్ణ పాత్రతో ఆరాధ్యుడిగా మారిపోయారు. అంతకుముందే 'భూ కైలాస్' సినిమాలో రావణుడిగానూ మెప్పించారు. అయితే మరోసారి రావణ పాత్రధారిగా సినిమాలో నటించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు.
తాను రాముడిగా.. ఎస్వీఆర్ రావణుడిగా.. కేవీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. దాదాపు సినిమా ఖాయమే అనుకుంటున్న తరుణంలో.. ఎన్టీఆర్ సన్నిహితులు ధనేకుల వెంకట కృష్ణ చౌదరి.. శివపురాణం.. తదితర పురాణ గ్రంథాల్లో..
రావణుడిలోని విశిష్టతను ఎలా వివరించారో తెలిపే పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివాక ఎన్టీఆర్‌కు రావణుడి పాత్రపై మక్కువ పెరిగింది. ఆ పాత్ర తానే వేసేందుకు సిద్ధమైపోయారు. కానీ ఎన్టీఆర్‌ను.. కృష్ణుడి రూపంలో దేవుడిగా చూపించిన కేవీరెడ్డి.. రాక్షస పాత్రలో చూడలేనన్నారు. చివరకు ఎన్టీఆరే..
ఆ సినిమాను తెరకెక్కించారు. తాను దర్శకత్వం వహించినా.. తమ కుటుంబ ప్రొడక్షన్స్ నేషనల్ ఆర్ట్ట్స్ థియేటర్ యూనిట్ పేరుతోనే టైటిల్స్ వేయించారు.
శ్రీ రామునిగా అప్పుడు కొత్తగా వచ్చిన హరనాథ్, లక్ష్మణుడిగా శోభన్ బాబు నటించగా.. సీతగా అంతకుముందు 'రాణీ రత్న ప్రభ'లో ఓ నృత్య పాత్ర
పోషించిన #మణిని ఎన్నుకున్నారు. ఆమె, ఎవరో కాదు. గీతాంజలిగా ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించిన ప్రసిద్ధ నటి. ఇక రావణాసురుడి భార్యగా, ఎన్టీఆర్ సరసన ప్రసిద్ధ కన్నడ నటి #బి_సరోజాదేవి నటించారు. జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి మెప్పించారు. అప్పటికే సినిమాలను చాలించి
విశ్రాంతి తీసుకుంటున్న గాలిపెంచల నరసింహారావును ఒప్పించి.. సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు ఎన్టీఆర్. వెంపటి చినసత్యం నృత్యాలు సమకూర్చగా.. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం అందించారు. ఎన్ఏటీ బ్యానర్లో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య నిర్మాణ బాధ్యతలు చూశారు.
అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెడుతూ రావణ బ్రహ్మ ఈశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్లడం.. అక్కడ నంది చేత భంగపాటు.. కైలాసపర్వతాన్ని ఎత్తి, రుద్రగానం చేసి పరమ శివుని మెప్పించడం. దేవతల వినతితో శ్రీ మహాలక్ష్మి వేదవతిగా మారి భూలోకంలో పెరగడం, నారదుని ప్రోద్భలంతో ఆమె
స్వయంవరానికి రావణుడు వెళ్లడం. రావణుని ద్వేషించి ఆమె భస్మంకావడం. ఆ తర్వాత ఆమె బాలికగా జనకుని ఇంట సీతగా పెరగడం. అహల్య వృత్తాంతం, సీతా స్వయంవరం, రావణుడి భంగపాటు, రావణ ప్రేరణతో యుద్ధానికి వచ్చిన పరశురాముడు రాముడిని గుర్తించడం. అవతార పరిసమాప్తి. చివరలో సీతారామకళ్యాణం. ఇదీ సినిమా క్రమం
టైటిల్ 'సీతారామకళ్యాణం' అయినప్పటికీ, సినిమా ఎక్కువుగా రావణునిదే ప్రధాన భూమిక. రావణుడిగా #ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. రావణుడు రాక్షసుడైనా బ్రహ్మ వంశజుడు. శాస్త్రాలను ఔపాసన పట్టాడు. సకల కళాసారంగదుడు. వీటన్నింటికీ ప్రాధాన్యం ఇచ్చారు. చక్రవర్తిగా రాజసాన్ని
ఎలా పలికించారో, మండోదరితో వీణానాదం చేస్తూ, సరసాన్ని సమపాళ్లలో ఒలికించారు. ఈశ్వరుడి ఆరాధనను, నారాయణుడి తిరస్కరణను సమరీతిలో చూపించారు.
నంది చేతిలో భంగపడి పరమశివుడు ప్రసన్నం కావడం లేదన్న ఉక్రోషంతో, కైలాసాన్నే పెకిలించుకు తీసుకెళ్తాను అంటూ రావణుడు చేసే ప్రయత్నంలో ఎన్టీఆర్ నటన నభూతో!
'జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ మస్సుర.. ధగధగ ధ్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవా..' అంటూ ఎన్టీఆర్ చూపిన నటనకు మది ఉప్పొంగిపోతుంది.
ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి ఆయన చిత్రాలకు పనిచేస్తున్న రెహమాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్తరాదికి చెందిన రవికాంత్ నగాయిచ్ అనే కుర్రాడికి ఛాయాగ్రహణ బాధ్యతలు
అప్పగించారు. ఇప్పటిలా గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ట్రిక్ ఫొటోగ్రఫీ ఉపయోగించి, నగాయిచ్ అద్భుత పనితనాన్ని ప్రదర్శించారు. రావణుడు కైలాసపర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పదితలలు కనిపించడం కోసం, నగాయిచ్-ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు. అనుకున్న దృశ్యం రావడం కోసం ఎన్టీఆర్ దాదాపు 10 గంటల పాటు
చేతులు చాచి నిశ్చలంగా పైకి చూస్తూ ఉండిపోయారు. యూనిట్ వాళ్లు ఎంత వారించినా ఎన్టీఆర్ వినలేదు. అంతసేపు కళ్లను ఫోకస్ చేసి నించున్న ఎన్టీఆర్ సీన్ పూర్తయ్యాక కళ్లు తిరిగి పడిపోయారు. ( ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ సన్నివేశాన్ని చూపించారు) శివానుగ్రహం కోసం కడుపులోని పేగులను
పెళ్లగించి వాటితో వీణానాదం చేస్తూ ఎన్టీఆర్ తన మోములో పలికించిన భావాలను చూసి చిత్రసీమ దిగ్భ్రమ చెందింది. రౌద్రం, క్రోధం, ఆవేదన కలగలిసిన ఆ భావాన్ని ఎన్టీఆర్ మోములో చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారట..! ఈ సన్నివేశం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో అద్దం ముందు కూర్చొని తాను
కూడా ఆ ప్రయత్నం చేయగా ఆ ప్రభావం మాత్రం ఆయనకే సొంతం అని ఆయన చెప్పడం గొప్ప విశేషం.
ఈ సినిమాలో రెండు స్వయంవర ఘట్టాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఆ పాత్రను ప్రేమించారో ఆ సన్నివేశాల్లో అర్థం అవుతుంది. మొదటిసారి వేదవతి స్వయంవరానికి వెళ్లినప్పుడు
(ఆమె నీలమేఘశ్యాముడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని) వన్నే ప్రధానమైతే, నీలాకాశానికి కట్టరాదా.. నెమలి మెడకు ముడిపెట్టరాదా..? సముద్రంలోకి నెట్టరాదా..? అంటూ ఆమె తండ్రిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. రెండోసారి సీతా స్వయంవరానికి తనను ఆహ్వానించలేదని, శివ భక్తుడిగా, జంగమదేవరుడి వేషంలో
అద్భుతమైన ఆలోచన..! శివద్రోహం.. ఈ కలాపం అంటూ.. జంగమదేవరుడిగా ఎన్టీఆర్ ప్రవేశం.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శత్రుంజయుడైన శంకరుడికే తిరస్కారం.. మృత్యుంజయుడైన ముక్కంటికే అపచారం. హరహరమహాదేవ శంభోశంకర అంటూ ఆయన చూపిన నటన అనన్యసామాన్యం. ఆ ఆహార్యంలో దుస్తులపై భేతాళుడి బొమ్మ, మధ్యలో
శివలింగం దానిపైన లైట్‌ను ఫోకస్ చేస్తూ.. కెమెరాను కాళ్ల నుంచి మొహం మీదకు తీసుకెళ్లడం ఆ రోజుల్లో కొత్త క్రియేటివిటీ..! ఇలా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ఎన్టీఆర్ గంభీరమైన నటనతో పాటు.. సముద్రాల మాటలు, పాటలు, ఘంటసాల, సుశీల గానం, సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ
విలువలు ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా చివరిలో వచ్చే శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండీ.. పాట ఎంత ప్రజాదరణ అయిందో చెప్పాల్సిన పనేముంది. అద్భుతమైన సంగీతానికి సుశీల గొంతు అంతే అద్భుతంగా కుదిరి.. ఆ పాటను చిరస్థాయిలో నిలబెట్టింది. అరవైఏళ్లైనా ఇప్పటికీ..
తెలుగువారి వివాహాల్లోనూ.. పెళ్లి వీడియోల్లోనూ.. ఆ పాట ఉండాల్సిందే..!
ప్రతినాయక పాత్రల్లోని ధీరత్వాన్ని.. వీరత్వాన్ని కళ్లకు కట్టిన తేజోరూపం..
90ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అపురూప చిత్రరాజం..
'సీతారామ కళ్యాణం'తో ఎన్టీఆర్లోని నటవైభవం.. దర్శకత్వ ప్రతిభ శిఖర స్థాయిలో కనబడ్డాయి. ఒక పాత్రద్వారా ప్రేక్షకులను ఇంతటి స్పందనకు గురి చేయడం ఈ చిత్రంతోనే మొదలయ్యినట్లుగా చెప్పుకున్నారు. ఈ చిత్రం వచ్చిన రెండేళ్లకు.. 'లవకుశ' విడుదలైంది. ఎన్టీఆర్ తెలుగునాట ఇంటింటికీ.. ఇలవేల్పయ్యాడు..!
అయితే ఆయన ప్రత్యేకమైన ప్రతినాయక పాత్రలు చేయడానికి బీజం వేసిందిమాత్రం రావణబ్రహ్మ వేషమే..! ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత 'శ్రీకృష్ణ పాండవీయం' లో దుర్యోధన వేషం వేశారు. ఆ తర్వాత మరో దశాబ్దానికి 'దాన వీర శూర కర్ణ..' చరిత్ర తిరగరాసింది. ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్
సినిమాలలో కెల్లా.. 'సీతారామకళ్యాణం' అంటే ఎక్కువ ఇష్టం. ఈ సినిమా స్పూర్తితోనే తాను 'నర్తనశాల' ప్రారంభించానని ఆయన చెప్పుకున్నారు కూడా..!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు.
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.
ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.
వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.
సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.
కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?
సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది.
కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?
స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది.
తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..
పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం
దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు.
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.
#యస్వీఆర్#వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.
ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?
మనదేశం పరాయిపాలనలో ఉండటం
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.
ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న