20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్ #ఉమా_గవిని ఔదార్యం..
వారసులు లేరు.. ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం..
యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు
ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ #ఉమ_గవిని తన ఆస్తినంతా #గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు..
మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న #మాతా_శిశు_సంక్షేమ_భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో రోగానిరోధక శాస్త్ర నిపుణులు ( ఇమ్మ్యూనాలజిస్ట్ ), ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు.
ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్
సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానంచేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే... ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది.
చేతిలో డాలర్ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు. కాగా, ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు. ఈ ప్రతిపాదనను
ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి డాక్టర్ ఉమా భర్త.. డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి, ఎనస్థటిస్ట్ గా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు.
జింకానా రీ యూనియన్ సమావేశాల్లో డాక్టర్ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముందుకు వచ్చారు. డాక్టర్ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు (2.50 లక్షల డాలర్లు),
డాక్టర్ సూరపనేని కృష్ణప్రసాద్, షీలా దంపతులు రూ.8 కోట్లు (మిలియన్ డాలర్లు), తేళ్ల నళిని, వెంకట్ దంపతులు రూ.8 కోట్లు (మిలియన్ డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.
మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..
ఎందుకు ?
ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.
దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..
గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.
అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.
"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.
”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.
”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.