#జీజీహెచ్‌కు యావదాస్తి!

20 కోట్ల ఆస్తి ఆస్పత్రికి అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు డాక్టర్‌ #ఉమా_గవిని ఔదార్యం..

వారసులు లేరు.. ఇటీవలే భర్త కూడా మృతి, దీంతో తాను చదివిన జీజీహెచ్‌కు భారీవిరాళం..

యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు Image
ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ #ఉమ_గవిని తన ఆస్తినంతా #గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు.. Image
మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న #మాతా_శిశు_సంక్షేమ_భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో రోగానిరోధక శాస్త్ర నిపుణులు ( ఇమ్మ్యూనాలజిస్ట్ ), ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. Image
ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ Image
సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానంచేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే... ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. Image
చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు. కాగా, ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు. ఈ ప్రతిపాదనను Image
ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటిస్ట్ గా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. Image
#సహ_వైద్యుల్లోనూ_స్ఫూర్తి..

జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముందుకు వచ్చారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు (2.50 లక్షల డాలర్లు), Image
డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు), తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Oct 7
సీనియర్ #ఎన్టీఆర్, #నాగేశ్వరరావు మధ్య ఉన్న పోలికలు !

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగానే కాక స్నేహపూర్వకంగా మెలిగిన నటులుగా ఎన్టీఆర్, ఎన్నార్ లకు పేరుంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఎన్టీఆర్, ఎన్నార్ ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. Image
#ఎన్టీఆర్, #ఎన్నార్ స్నేహం గొప్పదనం గురించి ఇప్పటికీ చిత్రపరిశ్రమ అగ్ర రచయితలు, దర్శకులు కథలుకథలుగా చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్, ఎన్నార్ కలిసి 14 సినిమాల్లో నటించారు.

వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన తొలి సినిమా #పల్లెటూరి_పిల్ల కాగా చివరి సినిమా #సత్యం_శివం. ఈ 14 సినిమాలలో దాదాపు Image
అన్నిసినిమాలు అద్భుతమైన విజయాలే కావడం గమనార్హం.

సంవత్సరంలో విడుదలయ్యే మొత్తం చిత్రాల్లో దాదాపు సగం చిత్రాలు ఎన్టీఆర్, ఎన్నార్ లవే ఉండేవని, వాళ్లకు సినిమాల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ వల్ల తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. Image
Read 7 tweets
Oct 7
#జంతుబలులు

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. Image
కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం.. దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

#బలి_అంటే...

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం Image
స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, #గుడిలో వివిధ దిక్కులలో కానీ #బలి_పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది. Image
Read 14 tweets
Oct 7
#నల్లీనది #పచ్చడి
- డా. జి.వి పూర్ణచందు గారు
ఆయుర్వేద వైద్య నిపుణులు..

"నల్లీనదీ సంయుక్తం
విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్తం
గ్రామ చూర్ణంచ వ్యంజనం" (చాటువు)

ఇది తెనాలి రామకృష్ణ కవి రాసినది. ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా Image
అర్ధం చేసుకోవాలి:
1. ‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది.
2. “విచారఫలమేవచ” విచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు.
3. “గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు.
4. “గ్రామచూర్ణం” అంటే ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, Image
ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, Image
Read 11 tweets
Oct 7
#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు Image
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి Image
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల Image
Read 21 tweets
Oct 7
మన '#నటసార్వభౌమ_యస్వీరంగారావు' అలనాటి ఒక అపురూపమైన ఫోటోను మీకోసం...

వర్కింగ్ స్టిల్ ఫోటో: బంగారు కలలు (1974)

ప్రముఖ నవలా రచయిత్రి #యద్దనపూడి_సులోచనారాణి గారి 'బంగారు కలలు' నవలాధారంగా అదే పేరుతో అన్నపూర్ణ వారు #ఆదుర్తి_సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించారు. సంగీతం సారధ్యం Image
#సాలూరి_రాజేశ్వరరావు మాస్టారు గారు.

దయగల వాడైన గొప్ప వ్యక్తిత్వం పాత్రలో మన నాటి సింహం 'యస్వీరంగారావు' గారు పోషించారు. విధి వంచిత అయిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హిందీ నటి '#వహీదా_రెహమాన్' నటించారు. అందునా తొలిసారిగా యశస్వి #యస్వీఆర్ గారితో #వహీదా నటించారు. Image
1955 నాటి 'రోజులు మారాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కెరియర్ ప్రారంభించిన #వహీదా_రెహమాన్ అడపాదడపా 2-3 సినిమాలు తెలుగులోనే చేసింది. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది తెలుగు పరిశ్రమే కావడం విశేషం.

#యస్వీఆర్ #వహీదా మధ్య ఎన్నో రసవంతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. Image
Read 5 tweets
Oct 7
విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం Image
ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల Image
ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న Image
Read 18 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(