పాండవ ప్రథముడు #ధర్మరాజు దాన ధర్మాలకు పేరు. రాజ్యంలో ప్రజలకు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని #కృష్ణుడికి అనిపించింది. అందుకోసం #కృష్ణుడు#ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకువెళ్ళాడు.
ఆ రాజ్యం ఒక మహా చక్రవర్తి పాలనలో ఉండేది. అక్కడ వారు ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు చెంబులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ చెంబును తిరిగి ఇచ్చేస్తూ మా రాజ్యంలో ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోము అని బదులు చెప్పిలోనికి వెళ్ళిపోయింది !!!
ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు #ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్లారు.
రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు #ధర్మరాజు అని చెప్పాడు #కృష్ణుడు. అయినా ఆ మహారాజు #ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా #కృష్ణుడితో ఇలా అన్నాడు…
కృష్ణా.. మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ భిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు
ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు.. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో…ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!
తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు !!! ఇది ఒక మహాభారత నీతి గాధ..
ఉచితం లభించే దేనికైనా విలువుండదు..
కష్టపడి సంపాదించిన దానికే ఎప్పటికైనా విలువ.. ప్రజలకు పని కల్పించటం పాలకుల ధర్మం..
కష్టించి పని చేయటం ప్రజల ధర్మం..
అప్పుడు ఏ రాష్ట్రమైనా, దేశమైనా సుభిక్షమే..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా
#తూర్పుగోదావరి జిల్లా #రాయవరంలోని#వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్‌లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు.
అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని #నరసింహారావు మాట్లాడుతూ..
‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం
హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు..
భోజనానికి ఎంత తీసుకుంటారు అని..?
యజమాని చెప్పాడు..
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,
అవి లేకుండా అయితే 20 రూపాయలు..
ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి, ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి
యజమాని వైపు చెయ్యి చాచాడు..
నా చేతిలో ఇవే ఉన్నాయి..
వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు.. ఉత్తి అన్నమైనా ఫరవాలేదు..
కాస్త ఆకలి తీరితే చాలు..
నిన్నటి నుండి ఏమీ తినలేదు..
ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది..
హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన
విస్తరిలో వడ్డించాడు..
నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను.. ఆయన కంటినుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు..
తెలుగుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం మీద చర్చ ఇది. #తెలుగువారిలో లోపించిన #మాతృభాషాభిమానం వారిలో ఆత్మాభిమానం లోపించడానికి కూడా ఎంతోకొంత మేరకు కారణం అవుతున్నది.
#తెనాలి#ఇస్లామ్_పేటలో ఒకప్పుడు తమిళనాడుకు చెందిన లబ్బీ సాయిబులు ఉండేవారు. వారు పచ్చి తోళ్లను కొనుగోలుచేసి, ఊనడం కోసం తమిళనాడులోని #వాణియంబాడి వంటి కొన్ని ప్రదేశాలలో ఉన్న తోళ్ళు ఊనే టానరీలకు పంపేవారు. వారు #తమిళ భాషను తమ #మాతృభాషగానే భావించేవారు. వారు నిత్యం చక్కని
తమిళ భాషనే మాట్లాడేవారు. వారి కార్యాలయాలకు ' దినతంతి', 'దిన మణి ', ' అలై ఒషై', 'ఆనంద విగడన్' , 'కుముదం', 'కలకండు' వంటి తమిళ పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకుని శ్రద్ధగా చదివేవారు. తమిళ దినపత్రికలు ఏ ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వచ్చినా వారు ఎంతో తపనపడేవారు. వారి కార్యాలయాల
అందమైన మా అరుగు నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీల్ని ఎరగనుగాని
మా అరుగును తలచుకుంటే
నా చిన్ననాటి స్మృతులు ఘనీభవించినట్టుగా
కళ్లముందు నా బాల్యం
అమ్మ అలుకులు
అక్కయ్య వెల్లచిలుకులు
అన్నయ్య బొంగరాలాట
చెల్లి కాళ్లారజాపి పాడే
‘‘కాళ్లాగజ్జ కంకాళమ్మా’’ పాట
లాంటి జ్ఞాపకాలనెన్నింటినో
మా అరుగు పదిలంగా దాచుకుంది
అందుకే మా అరుగంటే అంత ఇష్టం..
మా అరుగును తాకితే చాలు
నా బాల్యం నన్ను చుట్టుముట్టేస్తుంది
పచ్చని పొలాలమధ్య
అచ్చమైన పల్లెటూళ్లో ఉన్న
మా అరుగును చూస్తే ఎంతో ఆనందం
స్మరిస్తే పులకింత; పలవరింత
పిండి ఆరబోసినట్లుగా ఉన్న వెన్నెల్లో
దాగుడుమూతలాడుకుంటున్న
మాకు తల్లి అవుతుంది
కూని రాగాలతో పాటలు పాడుతుంటే
కచేరి వేదికలా మారిపోతుంది
మా సంకల్పాలకు అనువైన
రూపాల్ని ధరిస్తుంది
పండగ వచ్చిందంటే
ఆవుపేడ అలుకు చీరె ధరించి
ముగ్గుల రైకతో సింగారించుకుంటుంది
ఆడపిల్లలు పెట్టిన గొబ్బెమ్మల్ని
#నెమలి_పట్టాభి_రామారావు.. ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన.. దేశ స్వాతంత్ర్యం కోసం తనవంతు పోరాటం చేశారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి.. ఆ దిశగా అందరినీ పయనమయ్యేలా చేశారు. అంతేకాదు.. ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పని కల్పించారు.
ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్నారు. తన సొంత ఖర్చులతోనే గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచిస్తుండేవారు. ప్రత్యేక ఆంద్రరాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు.
1862లో కడప జిల్లా సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పట్టాభి రామారావు జన్మించారు.
ఈయన కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శిస్తూ,