#అశోక #వృక్షాలు

-- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం

ఇటీవలి మా ఈశాన్య రాష్ట్రాల పర్యటన సందర్భంగా మేము పలు ప్రాంతాలలో అశోక వృక్షాలు చూశాము. ముఖ్యంగా అస్సామ్ లోని #గువాహాటిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చాలా అశోక వృక్షాలు కనిపించాయి.

'అశోక' అనే సంస్కృత పదానికి శోకము Image
లేనిది (Sorrow-less) అని అర్థం. రామాయణ కథనం ప్రకారం సీతను చెరబట్టిన రావణుడు ఆమెను లంకా నగరంలోని #అశోకవనం లోనే బందీగా ఉంచాడంటారు. 'అశోకవనమున సీత .. శోకించె వియోగము చేత' అనే పాట మనందరం విన్నదే.

మన్మథునికి 'పంచేషుడు',' పంచబాణుడు', 'పంచశరుడు' అనే పేర్లున్నాయి. సంస్కృతంలో 'పంచ' Image
అంటే ఐదు అనీ, 'ఇషు' అన్నా 'శర' అన్నా 'బాణము' అని అర్థం. మన్మథుడికి 'పుష్పశరుడు', ' సుమశరుడు' అనే పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆయన పూవులనే బాణాలుగా వేస్తాడన్నమాట. యువతీయువకులపై మన్మథుడు ఐదు రకాల పూలను బాణాలుగా ప్రయోగించి వారిలో కామతాపాన్ని రగులుస్తాడట. ఆయన అమ్ముల పొది(Quiver) లో Image
ఉండే ఐదు రకాల పుష్పాలలో పరిమళ భరితమైన అశోక పుష్పం కూడా ఒకటి.

అరవిందమశోకం చ చూతం చ నవమల్లికా |
నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాః ||

అరవిందము (తామర), అశోకము, చూతము (మామిడి), నవమల్లిక (మల్లెలలో ఒక రకం), నీలోత్పలా (నల్ల కలువ లేక నీలికలువ) - ఈ ఐదు పూలూ పంచబాణుడు (మన్మథుడు) Image
ప్రయోగించే సాయకములు (బాణములు).

అశోక చెట్టు లెగ్యూమినసీ కుటుంబానికి చెందిన సీజాల్పినియాయిడే (Caesalpinioideae) ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం #Saraca #asoca. అయితే దీనిని కొందరు తప్పుగా Saraca indica అని కూడా అంటున్నారు. భారత ఉపఖండంలో - ప్రత్యేకించి నేపాల్, Image
భారతదేశం, శ్రీలంకలలో- అశోక చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఆకుపచ్చని గుబురుగా వచ్చే ఆకులు, గుత్తులు గుత్తులుగా పూసే పూలతో అశోక చెట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫిబ్రవరి నుండి ఏప్రిల్, మే నెలలవరకు ఈ చెట్లు విరగబూస్తాయి. పూసినప్పుడు ప్రకాశవంతమైన కాషాయ వర్ణంలో ఉండే ఈ పూలు తరువాత Image
క్రమంగా ఎర్రగా మారిపోతాయి.

భారతీయ శిల్పంలో బౌద్ధ, హిందూ సంప్రదాయాలలో "అశోక వృక్షం కింద నిలిచిన యక్షిణి శిల్పం" సర్వసాధారణంగా కనుపిస్తుంది. బౌద్ధులకూ, హిందువులకూ ఇది పరమ పవిత్రమైన వృక్షం. హిందువులు చైత్ర మాసంలో అశోక వృక్షాన్ని పూజిస్తారు. శాక్య గణానికి చెందిన రాజు శుద్ధోదనుడి Image
భార్య మాయాదేవి లుంబినీ వనంలోని ఒక అశోక వృక్షం కిందనే గౌతముడిని కన్నది. ఆ గౌతముడే అనంతరకాలంలో జ్ఞానోదయం పొంది బుద్ధుడై బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఆ రకంగా బౌద్ధ మతస్థులకూ అశోక వృక్షం పరమ పవిత్రమైనది.

అశోక అనే పేరుతో పిలువబడే #నారమామిడి (Polyalthia longifolia) మన ప్రాంతంలో Image
సర్వ సాధారణం. ఈ చెట్టు సీతాఫలం, తీగ సంపెంగ జాతి (అనోనేసీ ) కి చెందినది. వీటిలో ఒక వృక్షంలా విస్తరించకుండా కేవలం నిలువుగా, ఎత్తుగా (30 అడుగుల ఎత్తు వరకూ) పెరిగే మరో రకం ఉంది. దానిని Polyalthia longifolia 'pendula' అనే శాస్త్రీయ నామం తో పిలుస్తారు. బారుగా పెరిగి గాలికి Image
లోలకం (pendulum) లా ఊగులాడడాన్ని బట్టి దీనికి 'pendula' అనే పేరు వచ్చింది. పొడవుగా పెరగడం కారణంగా దీనిని Mast Tree అని కూడా అంటారు. నారమామిడిలోని ఈ రెండు రకాలనూ #False #Ashoka అనే పేరుతో వ్యవహరిస్తారు. అశోక పూలు ఎర్రగా ఉంటే నారమామిడి పూలు యాపిల్ గ్రీన్ వన్నెలో కనపడీ కనపడకుండా Image
ఉంటాయి.అశోక కాయలు బ్రాడ్ బీన్స్ లా ఉండి, లోపల చాలా గింజలు ఉంటాయి. నారమామిడి కాయలు గుత్తులుగా కాస్తాయి. అవి చిన్నవిగా, గుండ్రంగా, ఆకుపచ్చగా (పండితే నల్లగా నేరేడు పళ్ళలా) ఉంటాయి. వాటిలో ఒకే విత్తనం ఉంటుంది. అశోక చెట్టు దాదాపు పదిహేను - ఇరవై అడుగులకు మించి ఎత్తు పెరగదు. Image
False ashoka చెట్లు బాగా ఎత్తు పెరుగుతాయి.

అశోక చెట్టు కాండంపై బెరడు అగ్నిమాంద్యానికి, అజీర్ణానికీ దివ్యౌషధం. కడుపు నొప్పి, కడుపులో పుండ్లు మొదలైన వాటికి ఈ బెరడు కషాయం లోనికిస్తారు. దీని ఆకుల రసంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. మొటిమల నివారణకు ఈ ఆకుల రసం బాగా పనిచేస్తుంది. Image
పచ్చి అశోక పూల రసం రక్త విరేచనాలకు ఔషధంగా పనిచేస్తుంది. ఎండు అశోక పూలు చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతాయి. సిఫిలిస్ వంటి సుఖ వ్యాధులకే కాక, స్త్రీల అండకోశాలకు సంబంధించిన అన్ని రుగ్మతలకూ అశోక పూలు బాగా పనిచేస్తాయి. Image
ఆయుర్వేదంలో 'అశోకారిష్ట' వంటి పలు ఔషధాలు అశోక వృక్ష ఉత్పాదనలతోనే తయారు చేస్తారు. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with శివశంకర కలకొండ

శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @janakishivasha2

Oct 22
#ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీలో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ
మాట్లాడేవాడు కాదు. కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.

ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వచ్చి వ్యక్తి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం
విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు.
Read 10 tweets
Oct 22
"నేను" చచ్చిన తర్వాత రా....!!

#జనక మహారాజు గొప్ప వేదాంతి. అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలు నేర్చుకుని రావలసిందిగా ఓ గురువు తన శిష్యుడైన ఓ యువకుడిని పంపించాడు. ఆ యువకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి జనకుడిని వెదుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చే సమయానికి జనకుడు కొలువులో ఉన్నాడు.
ఆ సమయంలో లోనికి వెళ్లడం భావ్యం కాదు కనుక ఈ యువకుడు బయట ద్వారం దగ్గర ఉన్న కాపరి వారికి ఒక చీటీ మీద ‘మీ వద్ద వేదాంత విషయాలను నేర్చుకుని రమ్మని మా గురువు గారు పంపించగా నేను వచ్చాను’ అని రాసి లోపలకు పంపించాడు. జనకుడు ఆ చీటీ చూసి, దాని వెనకాల ‘నేను చచ్చిన తర్వాత రండి’ అని రాసి
తిరిగి పంపించాడు.

ఆ యువకుడికి మతిపోయినంత పనైంది. ఇదేంటి.. నేను ఈయన దగ్గర వేదాంత రహస్యాలను తెలుసుకుందామని వస్తే ఈయనేమో తాను చచ్చిన తర్వాత రమ్మని అంటున్నాడు అనుకుని నిరాశతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ప్రయాణ అలసట, ఆకలి, దప్పికలతో
Read 8 tweets
Oct 22
#బీద పుట్టుక..

వాడు పుడితే
ఇరుకు తడికిల్లు ఖాళీ లేక మూలిగింది...!!
వాడు కడుపు తడుంకుంటే
పేగుల్లో విశ్వం విశ్వరూపం దాల్చింది..!!
వాడు బట్ట కడితే,
వెలుతురూ, గాలీ వంటిమీద కొట్లాడుకున్నాయి..!
వాడు పడుకుంటే,
గోనేపట్టా, ఇంటికప్పూ పడీ పడీ నవ్వుకున్నాయి..!
చెరువుగట్టు మీద నిలిచి Image
“నీళ్ళో” అని అరిచాడు..
చెరువు ప్రతిధ్వనించింది..
అడవిలో కూర్చుని
“కూడో” అని పొలికేక పెట్టాడు..
అడవిలో వెన్నెల కాచింది...
దొర్లే పేలికలు చుట్టుకుంటే
పొడుగు కొమ్ములతో ఎద్దు పొడిచింది..
తాటాకు క్రింద తల దాచుకుంటే
మొరట గిట్టలతో దున్న తొక్కింది.. Image
రాలిపడ్డ మెతుకులు తినబోతే
కోరపళ్ళతో కుక్క కరిచింది..
ఊపిరి లేక యాలగిలబడితే
బ్రతికుండగానే పీక్కుతింటుంది నక్క..
శబ్ధంలేని నోరు తెరిచి
బలం లేని చేతులెత్తి
చూపులేని కళ్ళు విప్పి
అరిస్తే,
పిలిస్తే,
చూస్తే,
మబ్బుముక్క ఘోషించింది
మట్టిగడ్డ రోదించింది Image
Read 6 tweets
Oct 21
*నోబెల్‌ బహుమతులను ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? స్వీడిష్‌ శాస్త్రవేత్త #ఆల్‌ఫ్రెడ్‌_నోబెల్‌.

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల Image
తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు.

#ఆల్‌ఫ్రెడ్_నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21, 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో Image
సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

ఈయనకు రసాయనశాస్త్రం, అనేక భాషలపై అత్యంత అభిరుచి. ఇంగ్లిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషల్లో ఎంతో ప్రావీణ్యం ఉంది. జీవితం మొత్తం మీద ఆల్‌ఫ్రెడ్‌ Image
Read 15 tweets
Oct 21
#శ్రీ_దివాకర్ల_వేంకటావధాని_గారు

పరిశోధకుడు, విమర్శకుడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వీరి పినతండ్రి. బాల్యంలోనే ఇతని ప్రతిభాపాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వెంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశారు.. ఎనిమిదవ తరగతి చదివే
సమయంలోనే ఇతని పద్యాలు భారతి మాస పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈయన నలభైకిమించి గ్రంథాలను రచించారు.. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. శ్రీ ఖండవిల్లి లక్ష్మీరంజనం గారితో కలిసి ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశాడు
తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించారు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించాడు. ఇతనికి అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో
Read 8 tweets
Oct 21
నిరతాన్నదాత ఆంధ్రుల అన్నపూర్ణ - #డొక్కా_సీతమ్మ

శిబిచక్రవర్తి, రంతి దేవాది చక్రవర్తుల జన్మించిన భూమి ఇది. అతిథి దేవోభవ అని తలచే నేల ఇది. ఆకొన్నవారికి ఇంత అన్నం పెట్టడమే.. హరి సేవయని.. మానవ సేవయే మాధవ సేవయే .. అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న అని ప్రపంచానికి చాటిన దేశం ఇది.
ఈ నేల మీద పుట్టిన ఎందఱో ఈ సూత్రాలను పాటించి జగతికి చాటారు. అట్టి మహాత్ముల కోవకు చెందినదే శ్రీమతి #డొక్కా_సీతమ్మ గారు.

సీతమ్మ గారు 1841 లో గోదావరి జిల్లాలోని మండపేటలో నరసమ్మ, భవానీ శంకరం అను పుణ్యదంపతులకు జన్మించారు. చిన్నతనములోనే తల్లిని కోల్పోయిన సీతమ్మకి ఇంటి పనులు చేయడం,
తండ్రికి సహాయంగా ఉండటం నేర్చుకున్నారు. చిన్నతనము నుండే ఆమెకు అతిథులను ఆదరించడం అలవడింది.. ఒకరోజు గ్రామాంతరం వెళ్ళిన భవానీ శంకరం గారి ఇంటికి ఏదో పని మీద ఆ ఊరికి వెళ్ళిన జోగయ్య.. ఆ ఎనిమిదేళ్ళ బాలిక ఆతిథ్యానికి మర్యాదలకు అణకువకు సంతసించి తరువాత కొద్దినాళ్ళకు
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(