*నోబెల్ బహుమతులను ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? స్వీడిష్ శాస్త్రవేత్త #ఆల్‌ఫ్రెడ్_నోబెల్.
ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల
తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు.
#ఆల్‌ఫ్రెడ్_నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21, 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమాన్యుయెల్ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో
సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.
ఈయనకు రసాయనశాస్త్రం, అనేక భాషలపై అత్యంత అభిరుచి. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో ఎంతో ప్రావీణ్యం ఉంది. జీవితం మొత్తం మీద ఆల్‌ఫ్రెడ్
355 ఆవిష్కరణలు చేసి పేటెంట్లు పొందాడు.
వీటిలో #డైనమైట్ (శక్తిమంతమైన పేలుడు పదార్థం) కూడా ఒకటి. అసలు ఈయనకు నోబెల్ బహుమతులివ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే? ఈయన సోదరుడు లడ్విగ్ 1888లో కేన్స్‌లో చనిపోయాడు. కానీ ఓ ఫ్రెంచి వార్తాపత్రిక ప్రముఖుడైన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని
పొరపాటున ప్రచురించింది.The merchant of death is dead (మరణాలతో వ్యాపారం చేసేవాడు చనిపోయాడు అని దీనర్థం) అనే శీర్షికతో. ప్రాణాంతకమైన డైనమైట్‌ను కనిపెట్టినందుకు ఇలా వ్యాఖ్యానించింది ఆ పత్రిక. దాన్ని చూసి నిర్ఘాంతపోయాడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ కాకుండా ఇంకా ఎన్నో మంచి ఆవిష్కరణలు
చేసినా తను చనిపోయాక తనను ప్రపంచం ఎలా గుర్తుంచుకుంటుందో అని భయపడి పోయాడు. చాలా బాధపడ్డాడు. తన పేరు చెడుగా కాకుండా మంచిగా గుర్తుండాలనే ఉద్దేశంతో నోబెల్ బహుమతులు ఇవ్వాలనుకున్నాడు.
తర్వాత 1885లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా ప్రకారమే ఈ బహుమతుల్ని ఇస్తున్నారు.
మానవాళి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహు మతులు ఇవ్వాలని ఆ వీలునామాలో రాశారు. ఈ అవార్డుల కోసమే ఆయన ఆస్తి మొత్తంలో 94 శాతం సొమ్మును కేటాయించారు. దీనిపై వచ్చిన వడ్డీతోనే ఈ అవార్డుల్ని అందించాలని కోరారు. దాని ప్రకారమే ఈయన చనిపోయాక 1901 నుంచి ఏటా ఇవి ఇస్తున్నారు.
భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రాల్లో కృషి చేసిన శాస్త్రజ్ఞులకు, ప్రపంచ శాంతికి కృషి చేసిన గొప్పవారికి ఈ బహుమతుల్ని అందిస్తారు.
1968 నుంచి అర్థశాస్త్రంలోనూ నోబెల్ ఇవ్వడం ఆరంభించారు. దీంతో కలిపి ప్రస్తుతం ఆరు విభాగాల్లో ఈ బహుమతులు ఇస్తున్నారు.
1901 మొదటి సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ విజేతలు..
Wilhelm Conrad Röntgen - Physics (Discovery of X rays)
Jacobus Henricus van 't Hoff - Chemistry (Osmotic Pressure and Chemical Equilibrium)
Emil von Behring - Medicine (Discovery of serum therapy against diphtheria)
Sully Prudhomme - Literature
Henry Dunant - Peace ( Red Cross)
గణితంలో నోబెల్ బహుమతి ఎందుకు ఉండదబ్బా? అనే సందేహం మీకూ వచ్చే ఉంటుందిగా. దీనిపై రకరకాల వాదనలున్నా గణితంలో నోబెల్ బహుమతికి సమానమైన అవార్డులూ ఉన్నాయి. ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫీల్డ్ పతకాన్ని
గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు.
ఒక్కో విభాగంలో ముగ్గురికి ఇస్తారు. అవార్డులకు డబ్బు ఎలా అంటే.. నోబెల్ ఏర్పాటు చేసిన ఫండ్ నుంచే అందిస్తారు. ఒక్కో ప్రైజ్‌మనీ మన రూపాయల్లో దాదాపు ఏడు కోట్లకు పైనే. ఒక నోబెల్ అవార్డును సంయుక్తంగా పంచుకుంటే ఈ డబ్బు కూడా సమానంగా వస్తుంది.
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్ 1917, 1944, 1963 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. ఇలా మూడుసార్లు బహుమతి తీసుకున్న సంస్థ మరోటి లేదు.
మేరి క్యూరి 1903లో భౌతిక శాస్త్రం, 1911లో రసాయన శాస్త్రాల్లో రెండుసార్లు బహుమతులు అందుకుంది. ఈమె కాకుండా లూనస్ పాలింగ్,
జాన్ బర్దీన్, ఫ్రెడెరిక్ సాంగర్‌లు మాత్రమే ఇప్పటి వరకు రెండుసార్లు నోబెల్స్ దక్కించుకున్నారు.
చనిపోయిన వారికి నోబెల్ బహుమతులు ఇవ్వకూడదని 1974లో నిర్ణయించారు.
నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారు, భారత పౌరసత్వం తీసుకున్నవారు మొత్తం 12 మంది.
ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ (1913 లో).
నోబెల్ బహుమతి పొందాలంటే మనం కూడా దరఖాస్తు చేసుకోవచ్చేమో అని అనుకోకండి. ఎందుకంటే ఎవరూ నేరుగా దరఖాస్తు చేసుకోలేరు. మన పేరు పరిశీలనలో ఉన్నా ఆ సంగతి కూడా మనకు తెలియదు. ఇదంతా రహస్యంగా జరుగుతుంది. నామినేషన్లు చేయడానికి
ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. వీరు ప్రతిపాదించిన పేర్లను నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఆ తర్వాతే బహుమతులిస్తుంది.1901 నుంచి 2016 వరకు మొత్తం నోబెల్ బహుమతుల్ని 911 మంది వ్యక్తులు, సంస్థలు దక్కించుకున్నాయి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.
మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..
ఎందుకు ?
ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.
దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..
గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.
అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.
"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.
”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.
”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.