భైరవకొండ సమీపంలోని మాత్యేని కోట అనే పేరు గల కొండ మీద మాల్యవంతుడు అనే మిక్కిలినేని కమ్మ నాయకుడు ఉండేవాడు. అతన్ని అండలో అనేకమంది వేటగాళ్లు ఉండేవారు. వారు ఉదయమంతా తలో దిక్కుకు వేటకు వెళ్లి, సాయంత్రం గ్రామం చేరేవారు.
ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
వారు తామంతా వేటకు వెళ్లి, గ్రామం నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని వెతికి మాల్యవంతుడికి విన్నవిస్తామని చెప్పి తలో దిక్కూ వేటకు వెళ్లారు.
ఆ సాయంత్రం కిలారి నాయుడు అనే వేటకాడు తప్ప మిగతా వారంతా మాత్యేని కోట చేరుకున్నారు.
'సైరా' సినిమాలో బాలుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని వారసులు లేని నొస్సం పాలేగాడు(నరసింహారెడ్డి తాత) జయరామిరెడ్డి దత్తత తీసుకున్నాడని, బ్రిటీషు వారి అరాచకాల గురించి నరసింహారెడ్డి జయరామిరెడ్డిని ప్రశ్నించి, మీరెందుకు వారిని ఎదురించట్లేదు అని అడిగితే, తెల్లవాళ్లు బలవంతులని
1. జయరామిరెడ్డికి నరసింహారెడ్డి అని ఒక కొడుకు ఉండేవాడు. అతడిని నొస్సం నరసింహారెడ్డి అని అనేవారు. జయరామిరెడ్డి మరణాంతరం ఈ నొస్సం నరసింహారెడ్డి పాలేగాడు
అయ్యాడు. కనుక జయరామిరెడ్డికి వారసులు లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని దత్తత తీసుకున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం.
2. 1800లో సీమ బ్రిటీషు వారి చేతుల్లోకి వెళ్లగా, అంతకు చాలా సంవత్సరాల ముందే జయరామిరెడ్డి మరణించాడు. అంతే కాక 1846లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మరణించేనాటికి మధ్యవయస్కుడు
రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి ఎన్నిక - విశేషాలు
ఫిబ్రవరి 11, 1977 భారతదేశ 5 వ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉంది. తాత్కాలికంగా నాటి ఉపరాష్ట్రపతి శ్రీ BD జత్తి గారు రాష్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.
ఆ తరుణంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపక్ష, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఏకగ్రీవంగా భారతదేశ 6 వ రాష్ట్రపతిగా సంజీవరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. అప్పటికే ఆయన 1969లో రాష్ట్రపతిగా పోటీచేసి ఆ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.
పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది.
పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
ముద్గలు అంటే పెసలు అని అర్థం. అందుకే పెసర పులగానికి ముద్గాన్నము అని కూడా పేరు. పిండిపదార్థం (carbohydrates) (బియ్యం) , మాంసకృత్తులు(preoreins) (పెసలు) కలగలిపి చేసే పులగం రుచిపరంగానే కాక, ఆరోగ్య రీత్యా కూడా శ్రేష్టమైనది.