పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న సృజనని, దార్శనికతను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం "జానీ" అని చాలా మంది అనుకుంటారు, కానీ నిజానికి "తమ్ముడు" చిత్రంతోనే ఆయన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. "తమ్ముడు" చిత్రంతో మొదటి సారిగా "కిక్ బాక్సింగ్", తరువాత వచ్చిన "బద్రి" చిత్రంతో "Escrima" 1/n
(stick fight) ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా విభిన్న పంథాలో ప్రేక్షకులను రంజింపజేసి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్, ఫ్యాన్-డమ్ క్రియేట్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు నమ్మసాగారు. అలాంటి సమయంలోనే #Kushi చిత్రం విడుదలైంది. చాలా
సాధారణమైన ప్రేమ కథను కళ్యాణ్ తన ఈజ్-తో, మేనరిజంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ధరించిన హుడీస్, షూస్, లిప్ పౌట్, లుక్స్, హెయిర్ స్టైల్, ఒకటని కాదు! అన్నీ ట్రెండై కూర్చున్నాయి. ప్రతీ నటుడు కలలు గనే సక్సెస్, స్టార్ డమ్ అన్నీ రెండు దశాబ్దాల క్రితమే చూసేసారు కళ్యాణ్. అతని
క్రేజ్, సక్సెస్ చూసి "ఈడెవడ్రా బాబు, అన్నయ్యను మించిపోయాడు" అని గాజువాక కన్య - శ్రీకన్య థియేటర్ దగ్గర ప్రేక్షకులు మాట్లాడుకోవటం నాకింకా గుర్తుంది.
ఆల్రెడీ ప్రూవ్ అయిన కథను తెలుగులో చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా కథనం మార్చటానికి మేకర్స్ సాహసించరు, బట్ ఇక్కడున్నది
కళ్యాణ్! తమిళ ఖుషి కథ, కథనంలో ఎన్నో మార్పులు చేర్పులు చేయటమే కాక డ్యాన్స్, ఫైట్స్ తనే కంపోస్ చేశారు కళ్యాణ్. ఒక విధంగా ఖుషీ సినిమాను తన భుజాల పై మోశారాయన.
కొన్ని సెంటర్స్-లో రెవెన్యూ పరంగా "ఖుషీ" నెలకొల్పిన రికార్డ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కళ్యాణ్
మరో వంద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా అభిమానులకు "ఖుషీ" చిత్రం ఎప్పటికీ ఓ ప్రత్యేక చిత్రమే. మరో సారి ఆ రాయల్ బెంగాల్ టైగర్ సిద్దు.. సిద్ధార్థ్ రాయ్-ని డిసెంబర్ 31న నేను చూడబోతున్నాను. మరి మీరు?