Harish R.M Profile picture
Professional Writer - Telugu Movies & Web Series
Sachin10Dy Profile picture Pavan kumar Profile picture Kalyan Raja Profile picture Prasadbabu Profile picture 𝗧𝗲𝗮𝗺 𝗢𝗻𝗲 𝗧𝗗𝗣 Profile picture 6 subscribed
Jun 27, 2023 16 tweets 3 min read
ఐరన్ చేసిన బట్టలు బీరువాలో పెడుతూ శరత్ వైపు చూసింది సింధు. అతను సీరియస్‌గా లాప్‌టాప్ మీద వర్క్ చేస్తున్నాడు. "రేపు వాడికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపిద్ధామని అనుకుంటున్నాను" అని సింధు అనగానే తలెత్తి ఆమె వైపు చూసాడు. "మెల్లగా వాడే తింటాడు" అని బీరువా క్లోజ్ చేసింది సింధు. లాప్‌టాప్ పక్కన పెడుతూ "వాడు తినగలడా? ఇంకా నాలుగేళ్లు కూడా నిండలేదు" అని సందేహంగా అడిగాడు శరత్. "హా, కానీ అలవాటు చేయాలి కదా!" అని బొట్టు బిళ్ళ అద్దానికి అంటించింది, క్లిప్ తీసి హెయిర్ లూజ్ చేసింది. శరత్ లైట్ ఆఫ్ చేశాడు.

లంచ్ బాక్స్ స్కూల్ బ్యాగులో పెడుతూ "స్పూన్‌తో కొంచెం కొంచెంగా
Jun 1, 2023 5 tweets 1 min read
పిల్లాడిగా ఉన్నప్పుడు "ఆడపిల్లలా ఏడుస్తావేంట్రా ఎధవా"
అని పిన్నో, అత్తమ్మో అన్నప్పుడు
"ఓహో, మనం ఏడవకూడదన్నమాట"
అని ఫిక్స్ అయిపోతాడు సగటు మగాడు. ఏడుపు మీద సర్వ హక్కులు స్త్రీవే
ఏడుపు అనేది ఆడదానికి ఆయుధం.

మగాడు మాత్రం ఎంత కష్టం వచ్చినా
గుండెలో దాచుకుని కుమిలిపోయి
ఏదో రోజది బద్దలై"పోవాలి"
బంకులో మోసం, ప్రేమలో దగా,
చట్నీలో ఈగ, ఆఫీసులో బాస్ సెగ,
షర్ట్ మీద సాంబార్ మరక, రాత్రి రూమ్మేట్ గురక, erectile dysfunction, premature ejaculation, అప్పుల పాలు చేసే ఫంక్షన్
కూతురి పెళ్లి టెన్షన్, అమ్మకూచి,
పెళ్ళాం చాటు మొగుడని
అదనపు ట్యాగులు, అక్కర్లేని బిరుదులు!
May 30, 2023 12 tweets 2 min read
@ యమలోకం - 2069 AD

"హాయ్"

"నమస్కారం"

"మీరు తెలుగు వారనుకున్నా!"

"తెలుగే, నేనే తెలుగు భాషని"

"తెలుగా!? మరి "Wassup" "Hey Dude" అనాలి కదా!"

"ఇంతకీ మీది?"

"ఎంద చేట! మలయాళం.. నాది కేరళ"

"బియ్యం దొంగిలిస్తే కొట్టి చంపేశారా నిన్ను?"

"నో, బీఫ్ కరీ తిన్నానని కొట్టి చంసింది మా కొత్త ప్రభుత్వం"

"ఇదేం ఖర్మ"

"నీ సంగతి చెప్పు. నిన్నెందుకు చంపేశారు?"

"నాది ఓ రకంగా హత్య"

"రకాలు, టీకాలు కాదు.. మేటర్ చెప్పు"

"ఎవరికైనా శత్రువులు బయట వుంటారు, బయట నుంచి వస్తారు. నాకు మాత్రం నా సొంత వాళ్ళే శత్రువులుగా మారారు"

"తరతరాలుగా మన దేశంలో ఇది మామూలే కదా!"

"అవును"
May 26, 2023 12 tweets 2 min read
@ Office Cafeteria

"హాయ్ రవి"

"హాయ్ చైత్ర.."

"ఏదో మాట్లాడాలన్నావ్"

"హా, చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను"

"ఏంటి?"

"ఐ లవ్ యు"

"అంటే?"

"నిన్ను ప్రేమిస్తున్నాను"

"ఎందుకు?"

"ఎందుకేంటి!?"

"అవును.. ఎందుకు ప్రేమిస్తున్నావ్ అని అడుగుతున్నా"

"నచ్చావ్ కాబట్టి"

"ఏం నచ్చాను"

"నీ వ్యక్తిత్వం, నీ కళ్లు, నీ స్మైల్"

"నా బాడీ నచ్చలేదా?"

"..."

"చెప్పు, పర్లేదు"

"ఇష్టమే"

"మరి అది చెప్పడం మానేసి poetic expressions దేనికి?"

"బాగోదేమో అని"

"మీరనుకునేంత క్లాసేం కాదు మేం. మీరే అనవసరంగా కవికాళిదాసు అవతారాలు ఎత్తుతుంటారు"

"నీకు నేనంటే ఇష్టమేనా?"
May 26, 2023 7 tweets 2 min read
My Room to Me:
"నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా చివరికి నా దగ్గరకే వస్తావని నాకు తెలుసు"

"మరి!? పక్కింటికి వెళ్ళనా? అయినా డైలాగ్ కాపీ కొట్టి బానే ఫిట్ చేసావ్ సీన్‌కి తగ్గట్టు"

"సరేలే గానీ ఏంటి సీరియస్‌గా టైప్ చేస్తున్నావ్?"

"ఏదోలే"

"మనిద్దరి మధ్య convo క్రియేట్ చేసి ట్విటర్‌లో Image పెడతావా?"

"వద్దా?"

"పెట్టు గానీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్‌తో జనాలను inferiorకి గురి చేయకు. నీకున్న fears, complexes కూడా చెప్తే వాళ్లు రిలాక్స్ అవుతారు"

"ట్రై చేస్తా"

"నీ వల్ల కాదులే"

"ఏం?"

"పొద్దున్న లేస్తే "అటెన్షన్" గురించి ఆలోచించే టిపికల్ ట్విటర్ జనాల కన్నా నువ్వేం
May 24, 2023 4 tweets 1 min read
దాదాపు 2 వారాల క్రితం పంచవటి కాలనీ "మన కేఫ్"లో ఆనంద్ అనే aspiring director‌ పరిచయమయ్యారు. కాసేపు ఫిల్మ్ డిస్కషన్స్ అయ్యాక pitch deck నాకు WA ‌చేశారు.. impressive work అనిపించి నిన్న అతన్ని శశిగారి (d/o m s narayana garu) దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసాను. Everything went well. ఐతే తరువాత casually మాట్లాడుకుంటుంటే అతను TFI‌కి రావటానికి గల కారణం చెప్పారు, అది వినగానే నిజంగా షాకయ్యాను. I was like "వార్నీ!! ఇలా కూడా ఉంటారా"!!

Two years బ్యాక్ అనుకుంటా అతను S/W ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు తన మదర్ birthday‌కి గిఫ్ట్ ఏం కావాలో చెప్పమ్మా అని అడిగారు. ఆవిడ
Apr 19, 2023 26 tweets 4 min read
"Bad Touch" [a micro story]

"అమ్మూ" అన్న గీత పిలుపు వినగానే కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించింది చైత్ర. మెల్లగా ఆ గదిలోకి వెళ్లి "అమ్మూ ఎక్కడా" అని బ్లాంకెట్-ని లాగుతుంటే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కళ్లు మూసుకుంది చైత్ర. "నా బుజ్జి అమ్ములు ఇక్కడుందా!" అని కితకితలు పెట్టగానే బిగ్గరగా నవ్వుతూ తల్లిని వాటేసుకుంది చిన్నారి. "పద, స్కూల్-కి టైమ్ అవుతోంది" అని గీత అనగానే చైత్ర ముఖంలో నవ్వు మాయమై పోయింది. తల్లి వైపు చూస్తూ "డాడీని డ్రాప్ చేయమని చెప్పు" అని నెమ్మదిగా అంది. "సరే, రా" అని పాపని ఎత్తుకుని బాత్రూమ్ వైపు నడిచింది.

"ఏవండీ, పాపని ఈ రోజు మీరు
Apr 18, 2023 22 tweets 4 min read
Part 2

"సర్, శేఖర్ గారు లైనులో ఉన్నారు" అని సెక్రటరీ ఫోన్ ఇచ్చాడు. "హలో" అని సిద్దార్థ్ అనగానే "నమస్కారం సిద్దార్థ్ గారు" అని చంద్రశేఖర్ అనగానే "చెప్పండి" అన్నాడు సిద్దార్థ్. "సూటిగా విషయానికొస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మనం కలిసి పోటీ చేద్దాం, ఏమంటారు?" అని అడిగాడు. "మరి సీ ఎమ్ అభ్యర్ధి ఎవరు? మీ అబ్బాయా?" అని అడిగాడు సిద్దార్థ్. "నో నో.. నేనే. మీకు నచ్చిన శాఖ మీరు తీసుకోండి. మీ వాళ్లకు కూడా కీలక పోర్ట్ ఫోలియోలు ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదు" అని ఆన్నాడు శేఖర్. కొన్ని క్షణాల తరువాత "పార్టీతో మాట్లాడి నిర్ణయమేమిటో మీకు చెప్తాను" అని ఫోన్ పెట్టేసాడు
Apr 18, 2023 23 tweets 4 min read
"నవతరం" Part 1

యదార్థ ఘటనల ఆధారంగా కల్పిత పాత్రలతో రాసిన కథ.
**

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో "గండ్ర గొడ్డలి" పార్టీ నాయకులు సమావేశమయ్యారు. "CM వస్తున్నారు" అని ఆఫీస్ బాయ్ చెప్పడంతో ఆ గదిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అలెర్ట్ అయ్యారు. సి ఎమ్ దామోదర్ రెడ్డి తిన్నగా వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉన్నాడతను. ఓ సారి అందరి వైపు చూసి మాట్లాడటం స్టార్ట్ చేసాడు. "ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సారి మన పార్టీ గెలవటం కష్టమే అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది" అని అనగానే అక్కడున్న వాళ్ళ ముఖాలలో ఆందోళన
Apr 4, 2023 9 tweets 2 min read
Part 1



Part 2

12 ఏళ్ల క్రితం చనిపోయిన నటుడు మనోహర్ నా ఎదురుగా నిలబడి ఉండటం ఏంటి!!? అతని కళ్ళు తీక్షణంగా నన్నే చూస్తున్నాయి. నా శరీరం ఈ సారి తీవ్రంగా వణకసాగింది. బుర్రలో రకరకాల ఆలోచనలు.. మనోహర్ దెయ్యమై వచ్చాడా? ఎక్కడో పిడుగు పడ్డ శబ్దం.. జల్లులు కూడా మొదలయ్యాయి. అతను మెల్లగా తన అరచేయి పైకెత్తాడు. నేను షాక్-లో వుండగానే.... ఫట్-మని నా ముఖనా ఎవరో నీళ్లు కొట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచాను. ఎదురుగా అమ్మ నిలబడి ఉంది. "చిన్నప్పుడు లవి లవి అని పక్కింటి లావణ్యను కలవరించే వాడివి. ఇప్పుడేమో సినిమా సినిమా అని ఒకటే గోల" అని గొణుక్కుంటూ
Mar 7, 2023 7 tweets 3 min read
ఊళ్ళో తిరిగే ప్రతీ కుక్కకి నోరుంటుంది, దానికో అభిప్రాయం కూడా ఉంటుంది, సో #KGF సినిమా & కమర్షియల్ మూవీస్ పట్ల డైరెక్టర్ @mahaisnotanoun అభిప్రాయం మీద నా వ్యక్తిగత ప్రతిస్పందన.

ప్రేక్షకులు ఇది క్లాస్ సినిమా, అది మాస్ సినిమా అని విభజించరు. కేరళ, తమిళనాడులో సైతం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన శంకరాభరణం ఏ కోవకు చెందిన సినిమా? రియలిస్టిక్ అప్రోచ్-తో సినిమా తీసే చాలా మంది దర్శకులకు మాస్, కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుల మీద చిన్న చూపుంటుంది. నిజానికి కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టతరం. ఎందుకంటే, ఇలాంటి సినిమాల్లో హీరోలు తర్కానికి, సైన్సుకి అందని ఎన్నో పనులు
Jan 22, 2023 6 tweets 2 min read
తెలంగాణా ఐ టి మినిస్టర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ప్యానల్ మీటింగ్స్, పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ఆంధ్రా ఐ టి మినిస్టర్ ఎవరెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, "వారాహి" బండి రంగేంటి అని సోది కబుర్లు చెప్తున్నాడు. తేడా ఇక్కడే తెలిసిపోతోంది!

పవన్ కళ్యాణ్ని తిట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తుంటే ఇంక రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలన్న ఆలోచన ఆంధ్ర మంత్రులకు, పాలకులకు ఎక్కడ నుంచి వస్తుంది? సంక్షేమ పథకాల ద్వారా జనాలను సోమరిపోతులను చేయటం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేముంది?

ఒక అవినీతి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణాలు రెండే. ఒకటి ఆ రాష్ట్రంలోని
Jan 19, 2023 5 tweets 1 min read
తమిళనాడులోని ప్రఖ్యాత గుడిని సందర్శించి కొందరు (డ్రామా కంపెనీ సభ్యులు) మినీ వ్యాన్-లో తిరిగి తమ ఊరికి ప్రయాణమవుతారు. మధ్యాహ్నం కావటం చేత అందరూ భోన్ చేసి మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. కొద్ది సేపటి తరువాత ఓనర్ జేమ్స్ (మమ్ముట్టి) సడెన్-గా నిద్రలోంచి మేల్కొని బస్సుని ఆపమంటాడు.
1/n
సుసు పోసుకోవటానికేమో అని వ్యాన్ డ్రైవర్ అనుకుంటాడు. జేమ్స్ వ్యాన్ దిగి రోడ్డు పక్కన తోటలోంచి నడుచుకుంటూ ఓ కుగ్రామానికి (తమిళనాడు) చేరుకుంటాడు. అక్కడ ఒక ఇంట్లోకి వెళ్లి అక్కడి మనుషులు, ఆ పరిసరాలు తనకు బాగా పరిచయం ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. జేమ్స్-ని
Dec 29, 2022 6 tweets 2 min read
పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న సృజనని, దార్శనికతను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం "జానీ" అని చాలా మంది అనుకుంటారు, కానీ నిజానికి "తమ్ముడు" చిత్రంతోనే ఆయన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. "తమ్ముడు" చిత్రంతో మొదటి సారిగా "కిక్ బాక్సింగ్", తరువాత వచ్చిన "బద్రి" చిత్రంతో "Escrima" 1/n (stick fight) ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా విభిన్న పంథాలో ప్రేక్షకులను రంజింపజేసి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్, ఫ్యాన్-డమ్ క్రియేట్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు నమ్మసాగారు. అలాంటి సమయంలోనే #Kushi చిత్రం విడుదలైంది. చాలా
Oct 19, 2022 26 tweets 4 min read
July | 2013

సెల్ ఫోన్ మోగుతుంటే తీసి చూసాడు శ్రీకర్. అమ్మ కాలింగ్ అని కనిపించగానే అతని పెదాల పై చిరునవ్వు కదలాడింది. హలో మా అన్నాడు. అట్నుంచి ఆవిడ 'ఎలానో విజయవాడ వచ్చావ్ ఇంటికి వచ్చి వెళ్ళరా' అని అంది. 'మీటింగ్ ఇప్పుడే అయ్యింది. రేపు ఆఫీసులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. వీకెండ్ వస్తాను' అంటూ లాప్ టాప్ సర్దుకోసాగాడు. సరే గానీ, ఇంతకీ శైలజను కలుస్తున్నావా? అంది చిన్నగా నవ్వుతూ. తను కూడా బిజీగా ఉంది. సాయంత్రం రైల్వే స్టేషన్'కి వస్తానంది. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చెస్తాను అని మీటింగ్ హాల్ నుంచి హోటల్ రూమ్'కి బయలుదేరాడు.

ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంటే