మంచి తెలుగు రాయాలంటే, తెలుగు చదివే అలవాటు చేసుకోవాలి కదా. ఇదే విషయం వెలగా వెంకటప్పయ్య గారు చెబుతున్నారు.
"తెలుగు బాగా రాయడం నేర్చుకుందాం" అనే పుస్తకంలో.
వారు ఇచ్చిన సూచనలు:
* చదివే అలవాటు పెంచుకోవాలి.
* చదివేటప్పుడు పదాలను పరిశీలనగా చూడాలి.
* మనసులో పదస్వరూపం నింపుకోవాలి.
* ప్రామాణిక నిఘంటువును(andhrabharati.comలో ఇచ్చినవన్నీ ప్రామాణిక నిఘంటువులే) తరచూ పరికించాలి.
* చందమామ, బాలమిత్ర, బాలభారతం పత్రికలు చదవడంతో ప్రారంభించాలి.