#SarojiniNaidu#NightingaleofIndia
దేశంలో ఎందరో పురుషాధిక్యతను అధిగమించి వివిధరంగాల్లో రాణించారు. అనేక సమస్యలను సమర్థవంతం గా ఎదుర్కొని ప్రముఖులుగా పేరుపొందిన వారిలో "భారత కోకిల సరోజినీనాయుడు" ఒకరు. 'నైటింగేల్ ఆఫ్ ఇండియాగా' ప్రసిద్ధిచెంది న సరోజినీ నాయుడు
1879 ఫిబ్రవరి 13 న జన్మించారు. సరోజినీనాయుడు మంచి రచయిత్రి. ఆమె తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులవడం వల్ల ఆమెకు బాల్యం నుంచే విద్యాపరమైన గట్టి పునాదులు ఏర్పడినాయి. సరోజినీ నాయుడు మాతృభాష బెంగాలీతో పాటు, ఆంగ్లభాష అనర్గళంగా మాట్లాడేది.
ఆంగ్లంలోనే మంచి సందేశాత్మక కవితలను చిన్నతనం నుంచే రాయడం ప్రారంభించారు. తన 13వ ఏట లేడీ ఆఫ్ లేక్ పేరుతో 1300 పంక్తులతో రచన చేసి సంచలనం సృష్టించింది. సరోజినీ రచనలను ప్రముఖ ఆంగ్లభాషా విమర్శకులు ఆర్థర్సైమన్స్, ఎడ్వర్ గూస్లు చదివి ఆమెను అభినందించారు.
'సరోజిని ది బర్డ్ ఆఫ్ టైవ్ు, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్' వంటి కావ్యాలు రచించారు. ఆమె రాసిన లేఖల్లో తన వ్యక్తిగత విషయాలకన్నా, సామాజిక సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించేది. గాంధీజీ ప్రారంభించిన మూడు ముఖ్య ఉద్యమాలైన సహాయనిరాకరణ (1921), ఉప్పు సత్యాగ్రహం (1930),
క్విట్ ఇండి యా (1942)లకు ఆమె ప్రత్యక్షంగా మద్దతునిచ్చింది. సరోజినీకి హైదరాబాద్ నగరం తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆమె కవిత "నైట్ ఫాల్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్" చదివితే సంధ్యా సమయంలో ఆ నగరం ఎలా ఉంటుందో
మన కళ్ల ముందు నిలుస్తుంది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తనయగా నేటితరం అమ్మాయిలకు సరోజినీ ఆదర్శనీయం.
(నేడు సరోజినీ నాయుడు జయంతి💐)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#InnovationDay ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.
కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి
ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
ఆవిష్కర్త అనగా ఒక వ్యక్తి, అతను కొత్త ఆవిష్కరణలను, పరికరాలను చేస్తాడు, అవి ఫంక్షన్ యొక్క ఒక రకాన్ని నిర్వహిస్తాయి. ఇవి చాలావరకు విద్యుత్ లేదా యాంత్రిక పరికరాలు. కొత్త ఆలోచనలను లేదా విధానాలను కనిపెట్టిన వ్యక్తిని కూడా
బాదం (ఆంగ్లం #AlmondDay) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో
వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #AlmondDay 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి.
వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు. బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును.
#GalileoGalilei గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. #Galileo#Telescope
తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు. #GalileoGalilie 🔭 #Telescope
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును.
1. హిప్పోపొటామస్ ఆఫ్రికాకు చెందిన జంతువుగా పేరున్నా,సుమారు 9,000 ఏళ్ల క్రితం హిప్పోపొటామస్లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అవి ఆఫ్రికావైపు వెళ్లాయని పరిశోధకుల అభిప్రాయం.మధ్యప్రదేశ్లోని హిప్పోపొటామస్లు దంతాలు బయటపడటంతో వాటిగురించి తెలిసింది.#WorldHippoDay 🦛
నీటిగుర్రం (హిప్పోపోటామస్ దినోత్సవం)
2. హిప్పోపొటామస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపొటామస్ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ-ఆక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద జీవించే జంతువుగా హిప్పోపొటామస్కు పేరు.
3. నీటిలో నివసించే జంతువుగా పేరున్నా హిప్పోపొటామస్కు ఈత పూర్తిగారాదు. నీటిలోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్రలేవకుండానే ప్రతీ 3 నుంచి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే.
మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు!!వారి కోసం ఈ కవిత!! అంకితం
జన్మ ఎత్తుతారు,జన్మనిస్తారు
ఇరువురు చేసే ప్రయాణములొో
కుటుంబాలనే ఏర్పరుస్తారు!!
పిల్లలను మెరుగుపరిచే సమయంలో
సగం జీవితాన్ని కోల్పోతారు!!
వాళ్లకో తోడును కల్పించి
ఆ జన్మాంతం వారికి తోడుగా నిలుస్తారు!! #ParentsWorshipDay
అందరూ ఉండి ఎవ్వరు లేని
అనాథలా జీవితాంతమున ఒంటరిగా జీవిస్తారు !!
ఒంటరిగా ఉండి,ఒంటరిగానే వెళ్లిపోతారు!!
మీ శరీరాలకు మృత్యువు ఉందేమో కానీ నాకు తెలిసి "అమ్మా" ,"అయ్యా" అమ్మయ్య,అనే పిలుపుకు మాత్రం అంతమె లేదు!!ఓ తల్లి తండ్రి మీకు ఇదే నా పాదాభి వందనాలు. #ParentsWorship
"మాతృదేవోభవ" పితృదేవోభవ "ఆచార్య దేవోభవ" అనే ఈ మాటలను మనం గుర్తు చేసుకుందాం!!అందరి తల్లిదండ్రులకు ఇవే నా వందనాలు!!🙏💐🙏
మాతృపితృ పూజన దినోత్సవ శుభాకాంక్షలు !!
కవి: గుణ శ్రీ.
Happy Parents Worship Day
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
#DonorDay 🙏
దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.
అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను #Donor
కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర, చర్మం , గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని
దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.