మీ పేరు మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ రోజు ప్రత్యేక పేరు కలిగివుండు దినోత్సవం. #GetADifferentNameDay
పేరు లేదా నామము అనగా ఒక పదార్ధానికి, స్థలానికి, వస్తువుకు, మొక్కలకు, జంతువులకు మొదలగు వాటిని గుర్తించడానికి, పిలవడానికి సంబంధించిన పదం.
ఇది ఒకర్ని ఇతరులనుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఒక వర్గానికి లేదా సంస్థకు చెందినది కూడా కావచ్చు. పేరులన్నీ వ్యాకరణ పరంగా నామవాచకం క్రిందకు వస్తాయి.
మొక్కలు, జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి
ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. డాల్ఫిన్ లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.
జీవశాస్త్రంలో భూమి మీద నివసించే జీవులన్నింటికీ శాస్త్రీయంగా పేరు పెడతారు. దీనిని 'నామీకరణ' అంటారు. కొందరు ద్వినామ నామకరణ విధానాన్ని అంగీకరిస్తే,
కొన్నింటికి మాత్రం త్రినామ నామీకరణ అవసరం అయింది. ఈ విధమైన జీవుల వర్గీకరణ విధానానికి ఆద్యుడు లిన్నేయస్.
రకాలు
ఇంటి పేరు (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి.
కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు.చాలా దేశాలలో ఇంటి పేరును తండ్రి పేరు నుండి తీసుకోవడం ఆనవాయితీ.
ఇవ్వబడిన పేరు (Given Name) లేదా వ్యక్తి పేరు (Personal Name) : వ్యక్తి పేరు సాధారణం ఆ వ్యక్తిని పిలిచే, లేదా నమోదు చేసుకొనే పేరు.
ముద్దు పేరుతో కొంతమందిని చిన్నప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా పెద్దయిన తరువాత కూడా ఈ పేరు
స్థిరపడిపోతుంది. హిందువులలో పుట్టిన రోజు తర్వాత నామకరణోత్సవం నాడు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పేరు పెడతారు. వ్యక్తి పేరు ఎక్కువగా వారి కుటుంబం యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది.
అయితే పిల్లలకు ఇష్టం లేనప్పుడు తన పేరును మార్చుకొనే హక్కు వారికున్నది.
ముద్దు పేరు (Pet Name) : ముద్దుగా పిలుచుకొనే పేరు. గాంధీగారిని ముద్దుగా బాపు అని పిలిచినట్లు.
పొట్టి పేరు (Short Name) : కొందరు వ్యక్తులకు, ప్రదేశాలకు లేదా సంస్థలకు ఇవి ఉపయోగిస్తారు.
పెద్ద పెద్ద పేర్లున్నప్పుడు ఇలా పొట్టి పేర్లు వ్యవహారికమైపోతాయి.
ఉదా: ఐరాసా అంటే ఐక్యరాజ్య సమితి. కారా అంటే కాళీపట్నం రామారావు. ఆంగ్లంలో వీటిని 'Abbrevations' అంటారు.
ఊరి పేరు (Village Name) : ఒక ఊరి పేరు ఆ ప్రాంతపు రెవిన్యూ అధికార్లు అక్కడ నివసించే ప్రజల ఇష్టాన్ని పరిగణించి నిర్నయిస్తారు.
వాహనాల పేరు (Vehicle Name) : కొన్ని ప్రయాణ వాహనాలకు పేర్లు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.
రైలు బండ్లను గుర్తించడానికి గుర్తింపు సంఖ్యతో సహా పేర్లు పెడతారు. ఉదా: గోదావరి ఎక్స్ ప్రెస్, కోనార్క ఎక్స్ ప్రెస్ మొ. ఇలాగే బస్సులకు, పడవలకు కూడా పేర్లు పెడతారు.
సంస్థల పేరు (Company Name) : ఒక సంస్థను స్థాపించినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ సంస్థ అధిపతి పేరు పెడతారు.
కొన్ని పేర్లు అవిచేసే పనిని, విభాగాన్ని తెలియజేస్తూ ఆ రంగంలో ప్రసిద్ధిచెందిన వారిని పేరులో ముందు చేర్చడం కొన్ని సార్లు జరుగుతుంది.
కలం పేరు (Pen Name) : కొందరు రచయితలు నిజమైన పేరుకు ప్రత్యామ్నాయంగా వాడుకునే పేరు.
పేరు పుట్టుపూర్వోత్తరాలు : భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు.
వీటిలో మొదటిది "జంబూ ద్వీపము". ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణ గోదావారీ మధ్య స్థానే.....).
జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయికనుక దీనికి ఈ పేరు వచ్చింది.
ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది,
ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!
ఒక కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక అతను ఇంటి యజమాని అవుతాడు.
వివాహమయిన తరువాత స్త్రీ తన ఇంటి పేరు మారుట వలన, కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యతాభావము ఏర్పడుతుంది.
ముఖ్యంగా ఈ సాంప్రదాయము సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవ మర్యాదలు భుజాన మోస్తానని, వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరించినట్లుగా చెబుతుంది.
ఈ సాంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాకుండా సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది... ఎవరి భార్య అని చెబుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఈ సాంప్రదాయము ఒక కారణం.
మారు పేర్లు
ప్రఖ్యాత వ్యక్తుల మారుపేర్ల జాబితా
అసలు పేరు ↔️మారుపేరు
యూసఫ్‌ఖాన్ /↔️దిలీప్‌కుమార్
ఫాతిమా ఎ.రషీద్↔️నర్గీస్
జతిన్‌ఖన్నా↔️రాజేష్‌ఖన్నా
రవికపూర్↔️జితేంద్ర
బాలరాజ్↔️సునీల్‌దత్
తాయారమ్మ↔️పుష్పవల్లి
మణి↔️గీతాంజలి
ఉప్పు శోభనాచలపతిరావు↔️శోభన్‌బాబు
సత్యనారాయణ దీక్షిత్↔️శరత్‌బాబు
అప్పలరాజు↔️రాజబాబు
భక్తవత్సలం నాయుడు↔️మోహన్‌బాబు
సుబ్బమ్మ↔️శాంతకుమారి
కుసుమకుమారి↔️రాజశ్రీ
కమలకుమారి↔️జయంతి
రోహిణి↔️జయచిత్ర
సుజాత↔️జయసుధ
అలమేలు↔️జయమాలిని
లలిత↔️విజయలలిత
లలితారాణి↔️జయప్రద
#InnovationDay ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.
కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి
ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
ఆవిష్కర్త అనగా ఒక వ్యక్తి, అతను కొత్త ఆవిష్కరణలను, పరికరాలను చేస్తాడు, అవి ఫంక్షన్ యొక్క ఒక రకాన్ని నిర్వహిస్తాయి. ఇవి చాలావరకు విద్యుత్ లేదా యాంత్రిక పరికరాలు. కొత్త ఆలోచనలను లేదా విధానాలను కనిపెట్టిన వ్యక్తిని కూడా
బాదం (ఆంగ్లం #AlmondDay) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో
వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #AlmondDay 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి.
వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు. బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును.
#GalileoGalilei గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. #Galileo#Telescope
తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు. #GalileoGalilie 🔭 #Telescope
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును.
1. హిప్పోపొటామస్ ఆఫ్రికాకు చెందిన జంతువుగా పేరున్నా,సుమారు 9,000 ఏళ్ల క్రితం హిప్పోపొటామస్‌లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అవి ఆఫ్రికావైపు వెళ్లాయని పరిశోధకుల అభిప్రాయం.మధ్యప్రదేశ్‌లోని హిప్పోపొటామస్‌లు దంతాలు బయటపడటంతో వాటిగురించి తెలిసింది.#WorldHippoDay 🦛
నీటిగుర్రం (హిప్పోపోటామస్ దినోత్సవం)
2. హిప్పోపొటామస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపొటామస్‌ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ-ఆక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద జీవించే జంతువుగా హిప్పోపొటామస్‌కు పేరు.
3. నీటిలో నివసించే జంతువుగా పేరున్నా హిప్పోపొటామస్‌కు ఈత పూర్తిగారాదు. నీటిలోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్రలేవకుండానే ప్రతీ 3 నుంచి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే.
మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు!!వారి కోసం ఈ కవిత!! అంకితం
జన్మ ఎత్తుతారు,జన్మనిస్తారు
ఇరువురు చేసే ప్రయాణములొో
కుటుంబాలనే ఏర్పరుస్తారు!!
పిల్లలను మెరుగుపరిచే సమయంలో
సగం జీవితాన్ని కోల్పోతారు!!
వాళ్లకో తోడును కల్పించి
ఆ జన్మాంతం వారికి తోడుగా నిలుస్తారు!! #ParentsWorshipDay
అందరూ ఉండి ఎవ్వరు లేని
అనాథలా జీవితాంతమున ఒంటరిగా జీవిస్తారు !!
ఒంటరిగా ఉండి,ఒంటరిగానే వెళ్లిపోతారు!!
మీ శరీరాలకు మృత్యువు ఉందేమో కానీ నాకు తెలిసి "అమ్మా" ,"అయ్యా" అమ్మయ్య,అనే పిలుపుకు మాత్రం అంతమె లేదు!!ఓ తల్లి తండ్రి మీకు ఇదే నా పాదాభి వందనాలు. #ParentsWorship
"మాతృదేవోభవ" పితృదేవోభవ "ఆచార్య దేవోభవ" అనే ఈ మాటలను మనం గుర్తు చేసుకుందాం!!అందరి తల్లిదండ్రులకు ఇవే నా వందనాలు!!🙏💐🙏
మాతృపితృ పూజన దినోత్సవ శుభాకాంక్షలు !!
కవి: గుణ శ్రీ.
Happy Parents Worship Day
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
#DonorDay 🙏
దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.
అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను #Donor
కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర, చర్మం , గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని
దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.