#GalileoGalilei గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. #Galileo#Telescope
తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు. #GalileoGalilie 🔭 #Telescope
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును.
ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది.
దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.
గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి.
ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి
కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఈ వాళ మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.
గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది
గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.
ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను
ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు.
క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.
అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి,
కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు.
1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో క్రీ.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు.
వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు.
నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు.
అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642,
జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.
మీ
H.పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు,కడప జిల్లా..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#InnovationDay ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.
కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి
ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
ఆవిష్కర్త అనగా ఒక వ్యక్తి, అతను కొత్త ఆవిష్కరణలను, పరికరాలను చేస్తాడు, అవి ఫంక్షన్ యొక్క ఒక రకాన్ని నిర్వహిస్తాయి. ఇవి చాలావరకు విద్యుత్ లేదా యాంత్రిక పరికరాలు. కొత్త ఆలోచనలను లేదా విధానాలను కనిపెట్టిన వ్యక్తిని కూడా
బాదం (ఆంగ్లం #AlmondDay) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో
వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #AlmondDay 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి.
వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు. బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును.
1. హిప్పోపొటామస్ ఆఫ్రికాకు చెందిన జంతువుగా పేరున్నా,సుమారు 9,000 ఏళ్ల క్రితం హిప్పోపొటామస్‌లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అవి ఆఫ్రికావైపు వెళ్లాయని పరిశోధకుల అభిప్రాయం.మధ్యప్రదేశ్‌లోని హిప్పోపొటామస్‌లు దంతాలు బయటపడటంతో వాటిగురించి తెలిసింది.#WorldHippoDay 🦛
నీటిగుర్రం (హిప్పోపోటామస్ దినోత్సవం)
2. హిప్పోపొటామస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపొటామస్‌ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ-ఆక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద జీవించే జంతువుగా హిప్పోపొటామస్‌కు పేరు.
3. నీటిలో నివసించే జంతువుగా పేరున్నా హిప్పోపొటామస్‌కు ఈత పూర్తిగారాదు. నీటిలోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్రలేవకుండానే ప్రతీ 3 నుంచి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే.
మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు!!వారి కోసం ఈ కవిత!! అంకితం
జన్మ ఎత్తుతారు,జన్మనిస్తారు
ఇరువురు చేసే ప్రయాణములొో
కుటుంబాలనే ఏర్పరుస్తారు!!
పిల్లలను మెరుగుపరిచే సమయంలో
సగం జీవితాన్ని కోల్పోతారు!!
వాళ్లకో తోడును కల్పించి
ఆ జన్మాంతం వారికి తోడుగా నిలుస్తారు!! #ParentsWorshipDay
అందరూ ఉండి ఎవ్వరు లేని
అనాథలా జీవితాంతమున ఒంటరిగా జీవిస్తారు !!
ఒంటరిగా ఉండి,ఒంటరిగానే వెళ్లిపోతారు!!
మీ శరీరాలకు మృత్యువు ఉందేమో కానీ నాకు తెలిసి "అమ్మా" ,"అయ్యా" అమ్మయ్య,అనే పిలుపుకు మాత్రం అంతమె లేదు!!ఓ తల్లి తండ్రి మీకు ఇదే నా పాదాభి వందనాలు. #ParentsWorship
"మాతృదేవోభవ" పితృదేవోభవ "ఆచార్య దేవోభవ" అనే ఈ మాటలను మనం గుర్తు చేసుకుందాం!!అందరి తల్లిదండ్రులకు ఇవే నా వందనాలు!!🙏💐🙏
మాతృపితృ పూజన దినోత్సవ శుభాకాంక్షలు !!
కవి: గుణ శ్రీ.
Happy Parents Worship Day
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
#DonorDay 🙏
దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.
అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను #Donor
కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర, చర్మం , గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని
దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.
మీ పేరు మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ రోజు ప్రత్యేక పేరు కలిగివుండు దినోత్సవం. #GetADifferentNameDay
పేరు లేదా నామము అనగా ఒక పదార్ధానికి, స్థలానికి, వస్తువుకు, మొక్కలకు, జంతువులకు మొదలగు వాటిని గుర్తించడానికి, పిలవడానికి సంబంధించిన పదం.
ఇది ఒకర్ని ఇతరులనుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఒక వర్గానికి లేదా సంస్థకు చెందినది కూడా కావచ్చు. పేరులన్నీ వ్యాకరణ పరంగా నామవాచకం క్రిందకు వస్తాయి.
మొక్కలు, జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి
ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. డాల్ఫిన్ లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.
జీవశాస్త్రంలో భూమి మీద నివసించే జీవులన్నింటికీ శాస్త్రీయంగా పేరు పెడతారు. దీనిని 'నామీకరణ' అంటారు. కొందరు ద్వినామ నామకరణ విధానాన్ని అంగీకరిస్తే,