విజయనగరం జిల్లా రామతీర్ధం శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. సాధారణంగా శ్రీరామ కళ్యాణం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం అందు దేశంలోని వివిధ రామాలయాలలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఏడాదికి రెండుసార్లు కళ్యాణం జరిగే రామాలయం ఇది #మనదేవాలయాలు
రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
సీతారాముల విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగ రంగ వైభవంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది
పల్నాడు జిల్లా చామర్రు గ్రామములో ఫలు దేవాలయాలను జీర్ణోద్ధరణ సాగించి నిత్య దీప ధూప నైవేద్యాలతో నిర్వహిస్తున్నాము.ఇక్కడే రాజా వేంకటాద్రి నాయుడు ప్రతిష్ఠ చేసిన,ప్రస్తుతము శిధిలం అయిన ప్రాచీన లక్ష్మణేశ్వర ఆలయము మీద పరిశోధన నిర్వహిస్తున్నగ్రామస్థులు,చామర్రు రూరల్ డెవలప్మెంట్ సభ్యులు
దేవాలయం పూర్తిగా దెబ్బతిన్నది.శిధిలం కాలేదు. ఇంకా క్లీనింగ్ జరగాలి. అది 80 సెంట్స్ అని రెవెన్యూ రికార్డ్స్ తెలియబరుస్తున్నాయి;
ఈ పరిశోధనలో ప్రాచీన కాలము లో వున్నాయి అని చెప్పపడుతున్న వీర శిలలు బయట పడ్డాయి.
ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు 🚩🙏
🚩 ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం
🚩 స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు 1. తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
2. మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం. 3. పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. 4. తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
విజయనగరం జిల్లా పుణ్యగిరి లోని శ్రీ ధారగంగమ్మ ఈశ్వరాలయము
పచ్చటి ప్రకృతి కొండలపై పుణ్యగిరి పరమ పవిత్రమైన క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపై పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వర స్వామిగా వెలసి భక్తుల నీరాజనాలందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం.
ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ క్షేత్ర పరిసరాలన్నీ వనభోజనాలకు వచ్చే వారితోనూ, పర్యాటకుల శివనామస్మరణతో మారు మోగిపోతాయి. పరమేశ్వరుని దర్శనంతో జన్మ పునీతం చేసుకోవాలన్న తలంపుతో వచ్చే భక్త జనులతో పుణ్య గిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోతుంది.
ఈ ఆలయం పర్వత పంక్తి నుండి వచ్చే జలధారపై నిర్మింపబడినది కనుక ధారగంగమ్మ ఈశ్వరాలయముగా పేరుగాంచినది.
ఇది తొలుత ధారగంగమ్మ ఆలయం, ఆ తరువాత ఇచట ఈశ్వరుడు గూడ ప్రతిష్టింపబడ్డాడు.
అందుచే ఈ ఆలయాలు ధారగంగమ్మ, ఈశ్వరాలయముగా ప్రసిద్ధమైనది
అన్ని జన్మలలోను - ఏది ఉత్తమమైనది
అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.
అసలు జన్మలు 3 రకాలు..! 1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.
మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి.
వాటినే కర్మఫలాలు అంటారు...
అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.
ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.
పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు
కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.
ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.