సోమవారం ది.27-03-2023 స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ద షష్ఠి సందర్భంగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు గ్రామం లో వేంచేసిన వున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణోత్సవం
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
👉వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది.
'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
👉ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
👉ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.
👉స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు : శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి,వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56
7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటిది
మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. .
April 30, 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples