ఇది మా ఊరు కాదు...
నా చిన్నప్పటి విషయాలేవీ ఇప్పుడు లేవు...
ఆ మనుషులూ కొందరు లేరు...
పరిస్ధితులు మారాయి(లేవు)...
కేటీ రోడ్డులో పచ్చని పొలాలు, మంగలోళ్ళబాయి, జియ్యంగారి గుడి, పేట గుడి, కోళ్ళఫారాలు, సెంట్రల్ స్కూలు ఏవీ లేవు...
మూలటర్నింగు, మూడు కొళాయిలు, కర్ణ మసాలా, వి.వి.మహాల్ రోడ్డు పొడవునా టింబర్ డిపోలు లేవు...
వీథి వీథిలో చేదబాయిలు, వీధి కొళాయిలు, ఇత్తడి బిందెలతో కులాయిల దగ్గర పోరాటాలు లేవు... ఉదయాకేఫ్ లేదు...
టికే స్ట్రీట్ లో సారాయంగడి, జాలీ ఐస్ లేదు...
మిట్టా వైన్స్ లేదు...
మహావీర్ టాకీస్ లేదు, దాని మురుకూ, రోస్ మిల్క్, పన్నీరు సోడా లేదు... అప్పారావు మసాలా పూరీ లేదు... కర్నాలవీథీలోని కుమార కూల్ డ్రింక్స్ లో ఫేమస్ కోకో కోల, టేస్టీ ఫ్రూట్ సలాడ్ లేదు... రైల్వేస్టేషన్ దగ్గరి కొండ బస్టాండు, ఇండియన్ కాఫీ బోర్డు, ఒకటో సత్రం లేదు...
సుగుణా, స్టూడెంట్ మెస్సులు లేవు.. గాంధీరోడ్డులో రామక్రిష్ణా బేకరీ, పాత డీలక్సు, ఆల్ఫా డీలక్సు, సిలోన్ పరోటా లేదు... కొత్తిండ్లు లేదు... ఉల్లి పట్టెడ పేరు లేదు... ఎర్ర రంగు టేసన్లు, నిక్కరు పోలీసు లేదు... పార్కు స్కూలనే పేరు లేదు... కోనేటికాడ ఎస్వీ హైస్కూలు లేదు...
ముక్కు టెంపోలు, రిక్షాలు, నూరు కేజీల బియ్యం మూటలు లేవు... సోడా బాటిల్ రౌడీల్లేరు... కాసురాళ్ళ బండలు పరచిన వీధుల్లేవు... ఇసుక వీధిలో సున్నపురాసుల్లేవు... దారి పక్కన గంపల్లో బియ్యం అమ్మేవాళ్ళు, గంపల్లో నూనాయిందం, పాలు పెరుగు, ఇడియాప్పం లేదు...
ఇంటికొచ్చే చాకళ్ళు, మంగళ్ళు, గంపలో కుండలు, మట్టి బొమ్మలు ఉండీలు అమ్మే కుమ్మరోళ్ళు లేరు... సున్నపు గానుగలు, నూనె గానుగలు, వడ్ల మిషన్లు లేవు... విజయా రామక్రిష్ణా టెంట్లు లేవు... సప్పరాలు, పులి వేషాల్లేవు... చెరువులు, మట్టి రోడ్లు, గుర్రపుబండ్లు, ముక్కుబస్సులు లేవు...
ఇంకేమేమి లేవో మీరు చెప్పండి... ఈ తరం తెలుసుకుంటుంది... నన్ను తెలియని వాళ్ళే లేని చోట నాకు తెలియని వాళ్ళు నిండి పోయారు... ఇంకా మరికొన్ని లేనివి... జ్యోతి టాకీసు, ఐ.యస్.మహాల్, బాలాజీ&శ్రీరామ, రామకృష్ణ డీలక్స్, శ్రీనివాసా, లీలామహల్, జయభారత్, వెంకటేశ్వర థియేటర్లు(ప్రస్థుతం మూతబడి,
త్వరలో లేపేసే భూమా థియేటర్లతో సహా).., మంగళం రోడ్డులోని ఆహ్లాద పైర్లు, ఈతాడిన బావులు, మద్దె మానులు, రైల్వేస్టేషన్ దగ్గర.. విష్ణునివాసం ఎదురుగా.. ఇప్పటి రిజర్వేషన్ కౌంటర్ స్ధానంలో పాత బస్టాండ్, పక్కనే మొట్టమొదటి గోపాల్ సైకిల్ షాప్(నా మొదటి హీరో సైకిల్ కొన్న చోటు)
(ఇప్పటి హీరో మోటార్ సైకిల్స్ షోరూమ్ ఓనర్ గోపాల్ ది), డిఆర్ మహాల్ రైల్వేగేటు, రాయల్ చెరువు రైల్వేగేటు, మీటర్ గేజ్ బొగ్గింజను రైళ్లు(పాకాల, కాట్పాడి రైళ్లు), రాయల్ చెరువు(ఇప్పటి రాయల్ నగర్), కృష్ణపురం ఠాణా దగ్గరి మునిసిపల్ ఆఫీస్, గాంధీరోడ్ లోని కూరగాయల మార్కెట్, కర్నాలవీథి
బేక్సైడ్ గోవింద రాజుల గుడి దగ్గరి టెలిఫోన్ ఎక్స్చేంజ్, రైల్వే స్టేషన్ దగ్గరి బాలాజి భవన్ కళ్యాణ మండపం, పాత తిరుచానూరు రోడ్డులో కరెంట్ ఆఫీస్ దగ్గరి సూరా వాళ్ల పెట్రోల్ బంక్, ఒకప్పటి విష్ణుప్రియ హోటల్.. ఇప్పుడు కెన్సెస్, ఒకప్పటి ఊర్వశి హోటల్..
ఇప్పుడు రిలయన్స్ మార్ట్&మినర్వా హోటల్, ఊర్వశి ఓనర్ ఋషి(చిరకాల మిత్రుడు) లేడు, పాత రేణిగుంట రోడ్డు లోని ఊర్వశి హోటల్ దగ్గర RTO ఆఫీస్(నేను టు వీలర్ లైసెన్స్ తీసుకున్న చోటు), తరువాత RTO ఆఫీస్ లు వరుసగా.. బాలాజి కాలనీ, తుమ్మలగుంట, కపిలతీర్ధం దగ్గరి కొండ మెయిన్ రోడ్ లో..,
భవానినగర్ లో పెద్దాయన(MLA) ఇంటి దగ్గరి మధు సైకిల్ షాప్(నా చిరకాల మిత్రుల పెద్ద అడ్డా), రేణిగుంట రోడ్డు లోని మోపేడ్స్(సువేగా) ఫ్యాక్టరీ(ఇప్పటి చదలవాడ డెంటల్ కాలేజ్), చివరిగా భేరివీథీ లోని కైనెటిక్ షోరూం(నా Luna tfr plus కొన్నచోటు).
నా ఊరికి నేను దూరమౌతున్న ఫీలింగు... ఈ ఊరు నాదే... ఈ ఊరు నా ప్రాణం... నా ఊరు తిరుపతి...📷 కానీ ఇప్పుడు నా ఊరు కాదు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”!
ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక,
యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది,
మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు.
అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం.
అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్దదిగదు.
విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా
నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి.
ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి ‘అత్తగారు’,”
అన్నారు శ్రీ కొడవటిగంటి వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి
అయిన భానుమతీ రామకృష్ణగారి “అత్తగారు – ఆవకాయ”
మరొకమాటు రుచి చూద్దాము, 1958 నాటి ఆంధ్ర పత్రిక నుండి.
# ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం
# ఆవకాయలో ఎరుపు --- "రవి"
# ఆవకాయలోవేడి, తీక్షణత --- "కుజుడు"
# ఆవకాయలో వేసే నూనె, ఉప్పు --- "శని"
# ఆవకాయలో వేసే పసుపు, మెంతులు --- "గురువు"
# మామిడిలో ఆకుపచ్చ --- "బుధుడు"
ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి :
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్
డొక్కందురు, మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా !
ఆవకాయ ఉపయోగాలు :
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇది వాడి చూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా !
ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచి హరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
కొండ క్రింద ఉన్న ఈ "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.
అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.
అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ?
📷దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?
అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.
📷పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.
ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-
"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.
అది ( 1656 - 1668 ) ప్రాంతం .
📷ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది.
జీవితం అంటే?జీవితానికి సార్ధకత ఏమిటి?కొంచం ఓపిగ్గా చదవండి...
పుస్తకాలలోనే కాదు,మనమధ్య కూడా ఇలాంటి మనిషి ఒకరు వున్నరన్నా నిజం తెలుసుకోవటం కోసం పోస్టు మొత్తం చదవండి....ఉమ్మడి మద్రాసు,ఆంద్ర రాష్ట్రం, ఆంద్రప్రదేశ్ 3 రాష్ట్రాలలో చర్చించి,ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ,
52 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత పూర్తి అయిన ప్రాజెక్టు గురించి ఈ పొస్టు చదవండి.
ఇప్పుడు ప్రతి నీటి ప్రాజెక్టుకు ఆయా సమయాల్లో అధికారంలో వున్న నాయకుల పేర్లో,వారి తండ్రుల పేర్లో పెడుతున్నారు కాని ఒక మనిషి మొత్తం జీవితాన్ని ఒక ప్రాజెక్టు కోసం ధారబోశాడు...
ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేవరకు గడ్డం తీయనని శపధంచేసి దాదాపు 25 సంవత్సరాలు గడ్డం తీయలేదు, ఆ మహనీయుడు "శివభాష్యం" ,ఆ ప్రాజెక్టుపేరు "వరదరాజస్వామి/శివభాష్యం ప్రాజెక్టు"..ఆయన సమాధి కూడా ఆ ప్రాజెక్టు పక్కనే కట్టారు...