ఏప్రిల్ 25, 2023 న మంగళవారం సందర్భంగా పల్నాడు జిల్లా చామర్తి గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మధ్యాహ్నం రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు #chamarrutemples
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని.
🍁 'త్వమేవాహమ్', 'అహంబ్రహ్మోసి' అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. 'గ' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది.
🌹 కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని, ఎలాంటి శబ్దమైన భాష, భాషాత్మకమైన జగత్తు. అంతా 'గ' శబ్ద వాక్యం . దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. 'ణ' కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సుగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే 'గణేశుడు'. అతడే 'గణపతి'.
మానవ శరీరం ఒక్కటే.. కాని ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం.. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యా యి. ఆ ఒక్కదానికే ‘శివ’ అని పేరు.
శివుడు విశ్వరూపుడే. అంతే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా, అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం.
విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వసృష్టికి కారణం లేదు.ఇది కేవలం ఒక లీల.విశ్వ చైతన్యపు ప్రదర్శన.ఎలాగైతే నాట్యమూ, నాట్యకారు డూ విడివిడిగా ఉండలేరో.అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు.ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది.ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తా యి.
విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు. తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది..
అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.
కాళీ, చిన్నమస్త - కాల పరిణామం
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తం
త్రిపుర సుందరి, కమల - ఆనందం, సౌందర్యం
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళం, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి