ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..
ఎందుకు ?
ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
అందులో వడ్డించే వన్నీ
రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.. #అన్నం, #కూర, #ఇగురు, #పులుసు, #వేపుడు, #తినండి అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం..
బ్యాగ్ పట్టుకుని షాప్ కు వెళ్తున్నాము.
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. #కూరగాయలు, #పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.
ఏమండీ మీ మనవరాలికి #కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది.
బిత్తరపోవడం నావంతయింది..
టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,
వంటా – వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి.
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.
తెలుగు టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది..
అది ఏ భాషో మీరే చెప్పండి..
"కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి".
నిన్న మా పక్కింటాయన వచ్చి
"మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి" అని చెప్పి వెళ్ళాడు. #మేనల్లుడి_పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?
పిల్లల్ని #బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్ కు పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.
మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ?
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ?
తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ?
ఇది పరభాషా వ్యామోహం మాత్రమేనా.. ఇంకా ఏమైనాన..
ఒక్క తెలుగు వాళ్ళకే ఇంత వ్యామోహం..
ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కనున్న ఏ పరాయి బాషా వాడికో మొత్తం అర్ధం అయిపోతుంది. ఎందుకంటే మన మాటలలో 90 వంతు ఇంగ్లీష్ పదాలే..
అదే ఏ తమిళులో, మలయాళీలో కన్నడిగులో, మరాఠీలో, మాట్లాడు కుంటే వేరే వాళ్ళకి ఏమి అర్ధం అవదు..
అందుకే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి..
ఇప్పుడు మాత్రం #పల్లెలు, #పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి. అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు
వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది.
బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు #తలుపులు తెరుద్దాం
అర్ధం చేసుకోండి మన తెలుగు ప్రజలారా...
సేకరణ.. శాస్త్రి తనికెళ్ళ..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.
దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..
గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.
అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.
"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.
”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.
”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.
“సర్. ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట.
ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట. ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.” అంటూ
ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ.
కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీకి
చెప్పారు మంత్రిగారు.
“రండి..! కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.” అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు.
“ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట
వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు,” అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి,
సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు.
మాస్టారు ఉప్పొంగిపోయేరు. “గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని
అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్ అన్న దగ్గర ఫస్ట్‌నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్‌నేమ్ అని మూడుగళ్ళున్నాయి.
మనకు తెలిసిందల్లా మనపేరు, దాని
వెనకాముందు ఓ ఇంటిపేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్తుడైన ఉద్యోగి సర్ నేమ్ అన్నకాలమ్ ఎదుట స్వామిభక్తితో వాళ్ళ బాస్ పేరు రాస్తే, అతి భయస్తుడైన భర్త ఎందుకొచ్చిన గొడవని సర్‌నేమ్ అన్న కాలమే కొట్టేసి
మేడమ్ నేమ్ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళావిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యాడట.
గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తరువాత జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్ని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులొచ్చాయి అని చమత్కరించారు.
ఏనుగు లక్ష్మణకవి,