April 30, 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు : శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి,వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56
7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటిది
మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. .
ఎవరు నా కోసం శ్రోత్రాదికర్మల్ని చేస్తూ ఉంటాడో,,ఎవడు అన్ని విధాలా ఉత్సాహంతో నన్నే భజిస్తాడో సంగ దోష రహితుడై ఉంటాడో,ఎవడు సమస్త జీవుల యందు ఆత్మభావం కలిగి ఉంటాడో అట్టి నా భక్తుడు నన్ను పొందుతాడు.అట్టి వానికి ముక్తి లభిస్తుంది” అని గీతాచార్యుడు చెప్పాడు.
జీవుడు సుఖంలో పరమాత్మను మరచి పోతాడు. దుఃఖంలో స్మరణ చేస్తాడు. లౌకిక, పారలౌకిక సుఖాలన్నీ పరమాత్మ అనుగ్రహం చేతనే జీవునికి లభిస్తాయి. అందుకే సుఖమైనా, దుఃఖమైనా పరమాత్మ ప్రసాదమని గ్రహించి ఆచరించాలి