మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
👉వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది.
'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
👉ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
👉ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.
👉స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
👉సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది #మావుళ్ళమ్మ' అయింది.
👉ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది.
👉శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, #అంకాళమ్మ గా మారిపోయింది.
👉పొలిమేరలో వుండే మరొక తల్లి #శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
👉పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే '#నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
👉బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి #బతుకమ్మ.
👉గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= #సత్తెమ్మ.
👉అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ #పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
👉ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా #అప్పలమ్మ అయినది. #బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
👉అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= #పెంటమ్మ.
👉భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= #బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను '#అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
👉లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= #గుర్రాలమ్మ అయినది.
👉ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. ఉదా:- సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట అని ఇప్పుడు వాడుకలో పిలవబడుతుంది. అలా చాలా గ్రామాల పేర్లు గ్రామ దేవతల పేరుతోనే పిలుస్తున్నారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు : శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి,వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56
7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటిది
మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. .
April 30, 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples