Varaprasad Daitha Profile picture
Jun 9 22 tweets 3 min read Twitter logo Read on Twitter
తెలుగు తోటలో పండిన విక్రమకేళి - #వైకుంఠపాళి

గుర్తు ఉందా చిన్నప్పటి ఈ నేస్తం.. వైకుంఠపాళి... అదేనండీ మన పాములపటం.... పరమపదసోపాన పఠము..

జీవితంలో ఎత్తు పల్లాలు సహజం అనీ, గెలుపు  ఓటమి శాశ్వతం కావు అనీ, లోకమంతా మంచి చెడు  సమానంగా వ్యాప్తి చెంది ఉందని, పరమపదం అనగా వైకుంఠం,
మోక్షం చేరుకునే మార్గం మన భారతీయ పూర్వీకులు అందరికీ చేరువుగా సులువైన రీతిలో సుమారు 2వ  శతాబ్దంలో ఇలా సరదాగా ఆట రూపంలో పొందుపరిచారంటే వాళ్ళ జ్ఞానదృష్టికి, సృజనాత్మకతకి నేటి తరం సరితూగగలదా అనిపిస్తుంది. ఆ మహానుభావులందరికీ 📷📷📷
కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి.
మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే)
ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీ వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం.
ఆ రోజు ఉపవాశం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.

గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస
సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు కచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి.
అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.

ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది.
అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందై పుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది.
దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత
పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..
ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు.
ఇదంతా పైకి ఆశ పెటే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో
నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం.
106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట.
పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని
ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో
వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై
దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!

అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.

సుగుణముతో సాలోక్యము, సత్ప్రవర్తనముతో గోలోకము, నిష్ఠతో తపోలోకము, యాగముతో స్వర్గలోకము, భక్తితో బ్రహ్మలోకము, చిత్తశుద్ధితో మహాలోకము, జ్ఞానముతో కైలాసం,
వైరాగ్యంతో వైకుంఠం నిచ్చెనల రూపంలో చూపిస్తే రావణుడు, హిరణ్యాక్షుడు, నరకాసురుడు, బకాసురుడు, తనరధుడు, కర్కోటకుడు, అరుకాషుడు మొదలైన రాక్షసులు పాముల రూపంలో కనిపిస్తారు. వైకుంఠమే ముక్తికి మార్గం కాదని పరమాత్మలో ఐక్యం అవ్వడమే ఈ జన్మకి మోక్షం అనీ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు
ఈ పటంలో గోచరిస్తాయి.

జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయి!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి.
ఈ చలనచిత్ర గీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

Jun 11
*_ఇది సోమరిపోతుల_* *_కర్మాగారం!_*

_______________________

పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!

నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
Read 6 tweets
Jun 11
*శంకర నారాయణ డిక్షనరి* కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో
Read 15 tweets
Jun 11
*తప్పులెన్నువారు…*
(దివ్య దర్పణం)
ఒకానొకప్పుడు గురుకులంలో,   ఒక ఆచార్యుడు తన శిష్యుని సేవకు చాలా ముగ్ధుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ శిష్యుడు వెళ్లిపోయేటప్పుడు, గురువు అతనిని ఆశీర్వదించి, ఒక దర్పణం బహుమతిగా ఇచ్చాడు.

అది మామూలు దర్పణం (అద్దం) కాదు.
వ్యక్తి యొక్క అంతరంగిక భావాలను ప్రతిబింబించగలిగే దివ్య దర్పణం.

గురువుగారి నుండి ఈ బహుమతిని స్వీకరిస్తూ, శిష్యుడు చాలా సంతోషించాడు. వెళ్లేముందు ఆ దర్పణ సామర్థ్యాన్ని చూడాలి అని అనుకున్నాడు.

ఆ దర్పణాన్ని పరీక్షించాలనే తొందరలో ముందుగా దాన్ని తన గురువుగారి వైపు తిప్పాడు.
శిష్యుడు ఆశ్చర్యపోయాడు. బంధనాలు, అహంకారం, కోపం మొదలైన ఎన్నో బలహీన గుణాలు గురువుగారి హృదయంలో స్పష్టంగా గోచరించటం ఆ దర్పణం చూపించింది.
’నాకు ఆదర్శమైన నా గురువుగారు చాలా లోపాలతో నిండి ఉన్నారు!' అని దీన్ని తలచుకుని చాలా బాధపడ్డాడు. బరువెక్కిన హృదయంతో దర్పణం తీసుకుని గురుకులాన్ని
Read 13 tweets
Jun 11
మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ చదవాల్సిన జీవిత సత్యం.
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.
"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి.
మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.
ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.

"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి
విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి."

వారిద్దరూ కౌంటర్ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే, జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళ్తుండగా భర్త చెప్పాడు."ఓ పెద్ద హోటల్ని నడిపే సామర్ధ్యం గల
Read 9 tweets
Jun 11
పరమాత్ముడి ప్రణాళిక తెలుసుకోవడం ఎవరితరం?

వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో మొరపెట్టుకున్నాడు.
"రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.
నా బతుకు చూడు. ..ఎంత కష్టమో.
ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"అని
సవాలు విసిరాడు.

దేవుడు వినీ వినీ సరేనన్నాడు.
"అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు         మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.
నోరు మెదపకూడదు."  అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు.

తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను.         ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు"
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.
ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది.
అతను చూడకుండా వెళ్లిపోయాడు.                            మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.
Read 11 tweets
Jun 11
వానల పలురకాలు:
1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన
2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన
3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన
12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన
13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన
14. ముసురువాన = విడువకుండా కురిసే వాన
15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన
16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన
17. రాళ్లవాన = వడగండ్ల వాన
18. కప్పదాటువాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(