Harish R. Menon Profile picture
Mar 22 2 tweets 1 min read Read on X
మనం అతిగా గారాబం చేస్తే పిల్లలు చదువుకోరు పాడైపోతారని బుర్ర బుద్ధి ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అతి సర్వత్రా వర్జయేత్.. అదే విషయాన్ని గరికపాటిగారు ఆయన ధోరణిలోనే కాస్తంత కటువుగా, కఠినంగా చెప్పారని నాకనిపించింది.

చాగంటిగారు, గరికపాటిగారు లాంటి విజ్ఞులు, పండితులు సామాన్యులను ఆలరించేలా మాట్లాడరు. ఓ అంశం గురించి మాట్లాడేటప్పుడు వారి ధోరణిలోనే సూటిగా వ్యక్తపరుస్తారు కాబట్టి కొందరికి వారి మాటలు రుచించకపోవచ్చు.

ఇక్కడ మొత్తం వ్యవహారంలో నేను గమనించింది ఏంటంటే గరికపాటిగారి వ్యాఖ్యలను తప్పుబడుతూ స్పందించిన వారిలో చాలా మంది ఆయన కులాన్ని తిడుతూ పోస్టులు పెట్టారు! ఇక్కడ అసలు కుల ప్రస్తావన దేనికి!?

కొందరు చిన్నతనంలో తమ పేదరికాన్ని, వీధి దీపాల వెలుగులో చదువుకున్న రోజులను గుర్తు చేసుకుని పాత సినిమాలో రే*కి గురైన వరలక్ష్మీలా కన్నీళ్ళు పెట్టుకున్నారు! (అరెరే.. పాపం!)

గరికపాటిగారికి శాపనార్థాలు పెడుతున్న వాళ్ళలో చాలా మంది "ఈయన ఎప్పుడు దొరుకుతాడా.. ఎప్పుడు దాడి చేద్దామా?" అని ఎదురు చూస్తున్న వాళ్ళే!

ఆవేశం కాస్తంత తగ్గించుకుని ఆలోచిస్తే ఆయన మాటల్లో తప్పు లేదు. కాకపోతే మనకు రుచించేట్టు చెప్పలేదు. అంతే!

బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడి మీరంతా మీ అల్ప బుద్ధిని బయట పెట్టుకున్నారు. గరికపాటి లాంటి దృష్ట మీకు, నాకూ ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదని మర్చిపోవద్దు.

మన చుట్టూ ఎందరో గురువులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వీలైతే వారి అనుభవాల నుంచి మంచిని గ్రహించాలి తప్ప రంధ్రాన్వేషణ చేయకూడదు.

#Passez_un_excellent_dimanche
@threadreaderapp Please unroll

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Harish R. Menon

Harish R. Menon Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @27stories_

Jun 27, 2023
ఐరన్ చేసిన బట్టలు బీరువాలో పెడుతూ శరత్ వైపు చూసింది సింధు. అతను సీరియస్‌గా లాప్‌టాప్ మీద వర్క్ చేస్తున్నాడు. "రేపు వాడికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపిద్ధామని అనుకుంటున్నాను" అని సింధు అనగానే తలెత్తి ఆమె వైపు చూసాడు. "మెల్లగా వాడే తింటాడు" అని బీరువా క్లోజ్ చేసింది సింధు. లాప్‌టాప్
పక్కన పెడుతూ "వాడు తినగలడా? ఇంకా నాలుగేళ్లు కూడా నిండలేదు" అని సందేహంగా అడిగాడు శరత్. "హా, కానీ అలవాటు చేయాలి కదా!" అని బొట్టు బిళ్ళ అద్దానికి అంటించింది, క్లిప్ తీసి హెయిర్ లూజ్ చేసింది. శరత్ లైట్ ఆఫ్ చేశాడు.

లంచ్ బాక్స్ స్కూల్ బ్యాగులో పెడుతూ "స్పూన్‌తో కొంచెం కొంచెంగా
కలుపుకుని తినాలి" అని సింధు చెప్తోంటే నిలువుగా తలాడించాడు కిట్టు. స్కూల్ బస్ ఎక్కించాక రోజూ టాటా చెప్పే బాబు ఈ రోజు తల దించుకుని సైలెంట్‌గా కూర్చున్నాడు. సింధు మనసులో తెలియని ఆందోళన మొదలైంది. "బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా" అన్న శరత్ మాటతో ఉలిక్కిపడింది. "ఏమైంది?" అని అడిగాడు భుజం మీద
Read 16 tweets
Jun 1, 2023
పిల్లాడిగా ఉన్నప్పుడు "ఆడపిల్లలా ఏడుస్తావేంట్రా ఎధవా"
అని పిన్నో, అత్తమ్మో అన్నప్పుడు
"ఓహో, మనం ఏడవకూడదన్నమాట"
అని ఫిక్స్ అయిపోతాడు సగటు మగాడు. ఏడుపు మీద సర్వ హక్కులు స్త్రీవే
ఏడుపు అనేది ఆడదానికి ఆయుధం.

మగాడు మాత్రం ఎంత కష్టం వచ్చినా
గుండెలో దాచుకుని కుమిలిపోయి
ఏదో రోజది
బద్దలై"పోవాలి"
బంకులో మోసం, ప్రేమలో దగా,
చట్నీలో ఈగ, ఆఫీసులో బాస్ సెగ,
షర్ట్ మీద సాంబార్ మరక, రాత్రి రూమ్మేట్ గురక, erectile dysfunction, premature ejaculation, అప్పుల పాలు చేసే ఫంక్షన్
కూతురి పెళ్లి టెన్షన్, అమ్మకూచి,
పెళ్ళాం చాటు మొగుడని
అదనపు ట్యాగులు, అక్కర్లేని బిరుదులు!
అరే ఏంట్రా ఇది!!?

Hercules ఈ విశ్వాన్ని మోసినట్టు
మగాడు కూడా కష్టాలను
తన భుజాల పై మోయాల్సిందే
ఎందుకంటే వాడికి
కన్నీరు నిషిద్దం, కేవలం హృదయ విస్ఫోటనం. మగాడు తన సహజ సున్నితత్వాన్ని
కోల్పోయి చాలా కాలమైంది
ఏడవటం మర్చిపోయి పాషాణ హృదయుడిగా మారిపోయాడు
దుర్మార్గుడిగా మిగిలిపోయాడు!
Read 5 tweets
May 30, 2023
@ యమలోకం - 2069 AD

"హాయ్"

"నమస్కారం"

"మీరు తెలుగు వారనుకున్నా!"

"తెలుగే, నేనే తెలుగు భాషని"

"తెలుగా!? మరి "Wassup" "Hey Dude" అనాలి కదా!"

"ఇంతకీ మీది?"

"ఎంద చేట! మలయాళం.. నాది కేరళ"

"బియ్యం దొంగిలిస్తే కొట్టి చంపేశారా నిన్ను?"

"నో, బీఫ్ కరీ తిన్నానని కొట్టి చంసింది మా
కొత్త ప్రభుత్వం"

"ఇదేం ఖర్మ"

"నీ సంగతి చెప్పు. నిన్నెందుకు చంపేశారు?"

"నాది ఓ రకంగా హత్య"

"రకాలు, టీకాలు కాదు.. మేటర్ చెప్పు"

"ఎవరికైనా శత్రువులు బయట వుంటారు, బయట నుంచి వస్తారు. నాకు మాత్రం నా సొంత వాళ్ళే శత్రువులుగా మారారు"

"తరతరాలుగా మన దేశంలో ఇది మామూలే కదా!"

"అవును"
"నూడిల్స్ సాగినట్టు సాగదీయకు. సినిమాలో లాగ్ ఒప్పుకుంటాం గానీ రియల్ లైఫ్‌లో లాగ్ నచ్చదు మాకు"

"ఒకప్పుడు తమిళంతో పాటు నా ప్రభ కూడా గొప్పగా ఉండేది. త్యాగరాజు కీర్తనలు, సుబ్రహ్మణ్య భారతీయార్ మెచ్చుకోలు, ఇంగ్లీష్ దొరల ప్రశంసలు.."

"అవును. శంకరాభరణం సినిమా మా కేరళలో వంద రోజులు ఆడింది"
Read 12 tweets
May 26, 2023
@ Office Cafeteria

"హాయ్ రవి"

"హాయ్ చైత్ర.."

"ఏదో మాట్లాడాలన్నావ్"

"హా, చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను"

"ఏంటి?"

"ఐ లవ్ యు"

"అంటే?"

"నిన్ను ప్రేమిస్తున్నాను"

"ఎందుకు?"

"ఎందుకేంటి!?"

"అవును.. ఎందుకు ప్రేమిస్తున్నావ్ అని అడుగుతున్నా"

"నచ్చావ్ కాబట్టి"

"ఏం
నచ్చాను"

"నీ వ్యక్తిత్వం, నీ కళ్లు, నీ స్మైల్"

"నా బాడీ నచ్చలేదా?"

"..."

"చెప్పు, పర్లేదు"

"ఇష్టమే"

"మరి అది చెప్పడం మానేసి poetic expressions దేనికి?"

"బాగోదేమో అని"

"మీరనుకునేంత క్లాసేం కాదు మేం. మీరే అనవసరంగా కవికాళిదాసు అవతారాలు ఎత్తుతుంటారు"

"నీకు నేనంటే ఇష్టమేనా?"
"ఇష్టమే కానీ నీతో సెక్స్ చేయను"

"నేను సెక్స్ కోసం ప్రపోజ్ చేయలేదు"

"మరి! ట్విటర్‌లో లూడో ఆడటానికి ప్రపోజ్ చేసావా?"

"అంటే.. కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశాక.."

"చేశాక!? ఒక మంచి రోజు చూసుకుని వచ్చి ముఖం దీనంగా పెట్టి మా పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారని అబద్ధం
Read 12 tweets
May 26, 2023
My Room to Me:
"నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా చివరికి నా దగ్గరకే వస్తావని నాకు తెలుసు"

"మరి!? పక్కింటికి వెళ్ళనా? అయినా డైలాగ్ కాపీ కొట్టి బానే ఫిట్ చేసావ్ సీన్‌కి తగ్గట్టు"

"సరేలే గానీ ఏంటి సీరియస్‌గా టైప్ చేస్తున్నావ్?"

"ఏదోలే"

"మనిద్దరి మధ్య convo క్రియేట్ చేసి ట్విటర్‌లో Image
పెడతావా?"

"వద్దా?"

"పెట్టు గానీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్‌తో జనాలను inferiorకి గురి చేయకు. నీకున్న fears, complexes కూడా చెప్తే వాళ్లు రిలాక్స్ అవుతారు"

"ట్రై చేస్తా"

"నీ వల్ల కాదులే"

"ఏం?"

"పొద్దున్న లేస్తే "అటెన్షన్" గురించి ఆలోచించే టిపికల్ ట్విటర్ జనాల కన్నా నువ్వేం
భిన్నం కాదు కదా!"

"భిన్నమని నేను చెప్పలేదు కదా!"

"నువు చెప్పవు కదా! చూపించుకోవటానికి ట్రై చేస్తావ్"

"అవునా?"

"కన్విన్స్ చేసి బజ్జో పెట్టడానికి నేను నీ అంతరాత్మను కాను కదా.."

"సరే, అందరూ అంతే కదా!"

"నీ సంగతి చెప్పు"

"దేని గురించి?"

"నీ అటెన్షన్ సీకింగ్ నేచర్ గురించి"
Read 7 tweets
May 24, 2023
దాదాపు 2 వారాల క్రితం పంచవటి కాలనీ "మన కేఫ్"లో ఆనంద్ అనే aspiring director‌ పరిచయమయ్యారు. కాసేపు ఫిల్మ్ డిస్కషన్స్ అయ్యాక pitch deck నాకు WA ‌చేశారు.. impressive work అనిపించి నిన్న అతన్ని శశిగారి (d/o m s narayana garu) దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసాను. Everything went well. ఐతే
తరువాత casually మాట్లాడుకుంటుంటే అతను TFI‌కి రావటానికి గల కారణం చెప్పారు, అది వినగానే నిజంగా షాకయ్యాను. I was like "వార్నీ!! ఇలా కూడా ఉంటారా"!!

Two years బ్యాక్ అనుకుంటా అతను S/W ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు తన మదర్ birthday‌కి గిఫ్ట్ ఏం కావాలో చెప్పమ్మా అని అడిగారు. ఆవిడ
"రేయ్, ఒక్కసారి చిరంజీవిని కలిపించరా" అని అడిగారు. అంతే! జాబ్ మానేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసారు. ప్రతీ సంవత్సరం @KChiruTweets పుట్టినరోజు వాళ్ళింట్లో పండగలా జరుపుకుంటారని చెప్పారు. నాకైతే goosebumps feels!! 🙏🙏

Btw అతను ట్విట్టర్‌లో ఉన్నారు, హ్యాండిల్ అడగటం మర్చిపోయాను. మరో
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(