Minister of State for Home Affairs, Govt. of India | Member of Parliament - Karimnagar | BJP National General Secretary |
Oct 19, 2021 • 7 tweets • 1 min read
సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే "దళిత బంధు" పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయకుండా ఆపారు.
(1/7)
దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్దిదారుల అకౌంట్లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవు. కానీ, కేసీఆర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా దళిత బంధు డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో వేస్తూనే....అదే సమయంలో డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారు.
(2/7)
Dec 7, 2020 • 9 tweets • 1 min read
కేసీఆర్ విచిత్రమైన వ్యవహారశైలి చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పలేని కేసీఆర్ అకారణంగా వ్యతిరేకించడం సిగ్గుచేటు.
రైతులను పండించిన పంటకు స్వయంగా ధరను నిర్ణయించుకోవడంలో తప్పేముంది..?
పంటను దేశంలో ఏ ప్రాంతంలో అయినా గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తారా..?
రైతులకు అన్యాయం జరిగితే మూడు రోజుల్లో సమస్య పరిష్కరించడాన్ని వ్యతిరేకిస్తారా..?
Dec 6, 2020 • 9 tweets • 1 min read
ఈనెల 8వ తేదీన కొన్ని రైతుసంఘాలు, ముఖ్యంగా పంజాబ్ కు చెందిన రైతు సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు.
గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరగబెట్టింది ఏంటో స్పష్టం చేయాలి. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రైతుల పంటరుణాలు మాఫీ పేరుతో హామీలు గుప్పించి గద్దెనెక్కాక పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా రైతులను మోసం చేసింది.
Dec 5, 2020 • 4 tweets • 1 min read
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవే రోడ్ల పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజనల్ అధికారి శ్రీ కృష్ణ ప్రసాద్ గారితో హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని NH 563 ఎల్కతుర్తి నుండి కరీంనగర్ వరకు నాలుగు లైన్ల రహదారి రోడ్డు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజల సౌకర్యార్థం అతి తొందరలో నూతన రహదారిని అందుబాటులోకి తెచ్చే విధంగా హైవే రోడ్ల పనులను వేగవంతం చేయాలని కోరాను.
Dec 5, 2020 • 5 tweets • 1 min read
48 మంది గ్రేటర్ ఎన్నికల విజేతల్లో 38 మంది గ్రాడ్యుయేట్స్ ఉండగా, అందులో యువతే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే 25 సీట్లు అదనంగా గెలిచేవాళ్లం. ప్రచార సమయం ఇంకా ఉంటే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించేవాళ్లం.
2023 లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం.
రాష్ట్రంలో కుటుంబ పాలన, గడీల పాలనను ఎదుర్కొనే ఏకైక పార్టీ బిజెపియే అని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతోనే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాం.
Dec 5, 2020 • 7 tweets • 2 min read
భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి సీట్లతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేసీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో, అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేశాడు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అంటకాగి డీజీపీ, ఎస్ఈసీ సాయంతో ఎన్నికల్లో అక్రమంగా గెలవాలనుకున్నారు. దుబ్బాక ఫలితంతో ఉలిక్కిపడ్డ కేసీఆర్, ప్రజా వ్యతిరేకత మరింత పెరగకముందే ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లి అక్రమ దారిలో గెలవాలనుకున్నారు.
Dec 4, 2020 • 5 tweets • 1 min read
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్..,బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేసింది. ప్రజల్లో భయానక వాతావరణం, మత విధ్వేషాలు సృష్టిస్తారంటూ దుష్ప్రచారం చేసింది. ఎంఐఎం పార్టీతో అంటకాగిన టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గ్రహించారు.టీఆర్ఎస్ మద్యం ప్రవాహం,డబ్బుల పంపిణీతో అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నించింది.
తప్పుడు సర్క్యలుర్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేశారు.బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి దౌర్జన్యంగా వ్యవహరించారు.దుబ్బాకలో కేసీఆర్ అల్లుడికి,గ్రేటర్ లో కుమారుడికి ప్రజలు తగిన బుద్ధిచెప్పారు.టీఆర్ఎస్ గడీల పాలనను బద్దలుకొట్టేందుకు ప్రజలు బిజెపికి అండగా నిలిచారు.
Nov 21, 2020 • 10 tweets • 2 min read
కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు.
కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..?
చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద.
Nov 21, 2020 • 4 tweets • 2 min read
ముస్లిం మైనారిటీలకు బి.సి రిజర్వేషన్ల పేరిట హిందువులైన బలహీన వర్గాల విద్యార్థులు యువతకు, విద్యా, ఉద్యోగ, ఉపాధి మార్గాల్లో అన్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరును ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చి బిసిలు కేసీఆర్ సర్కారు ను సమాధి కట్టాలని, బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చి,...
...ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరాను. గత జిహెచ్ఎంసి ఎన్నికలి బిసిల కోటాలో చాలా మంది ముస్లిం మైనారిటీలు, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల తరుపున కార్పొరేటర్లు గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని హైదరాబాద్ నగర ప్రజలు గుర్తించుకోవాలని తెలుపుతున్నాను.
Nov 20, 2020 • 8 tweets • 1 min read
టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను దైవసాక్షిగా ప్రజలకు వివరించేందుకే భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చా. వరదసాయం నిలిపివేతకు బిజెపియే కారణమంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
వరదసాయాన్ని ఆపాలంటూ మేం సీఈసీకి లేఖ రాసినట్లు, అందుకే ఆ నిధులు పంపిణీ నిలిపివేసినట్లు ఫోర్జరీ సంతకంతో కూడిన ఫేక్ లెటర్ ను సృష్టించి అసత్య ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం.
Nov 19, 2020 • 11 tweets • 3 min read
చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని అమ్ముతున్నాడంటూ కేసీఆర్ అనుచితంగా మాట్లాడటం దుర్మార్గం. ప్రధాని శ్రీ @narendramodi గారిపై @TelanganaCMO కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ కచరా బుద్ధులు మానుకోవాలి.
(1/11)
ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటారు. ఆ తరువాత టెంట్ ఎత్తేస్తారు. హీనమైన, నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కచరాది. తెలంగాణలో కచరాను ఊడ్చేవేస్తాం...అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
(2/11)
Aug 31, 2020 • 8 tweets • 1 min read
ఎన్నో పోరాటాల ఫలితంగా 1952 ఆగస్టు 31న ప్రభుత్వం సంచార జాతుల్ని విముక్త జాతులుగా ప్రకటించింది. అందుకే ఆ రోజును సంచార జాతుల ప్రజలకు చాలా ప్రత్యేక రోజుగా, నిజమైన స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తారు.ఈ సందర్భంగా సంచార జాతుల సోదరులకు శుభాకాంక్షలు.
గ్రామీణ సమాజంలో సంచార జాతులది కళాత్మకమైన జీవనశైలి. పల్లెపల్లెలు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జాతుల్లో చాలా మంది శాశ్వత చిరునామా లేకుండా జీవిస్తుంటారు. పూర్వం సంచార జాతులైన బుడబుక్కల, గంగిరెద్దులు, బాలసంతల వాళ్లు కళల్ని, ధర్మాన్ని, తత్వాల్ని ప్రదర్శించేవారు, ప్రచారం చేసే వారు.
Jul 7, 2020 • 7 tweets • 1 min read
కెసిఆర్ ఓ తుగ్లక్..ఓ నీరో చక్రవర్తి.
సెక్రెటరీయేట్ కే రానోడికి సెక్రెటరీయేట్ ఏందుకు? ఇదే 500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేది.చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.
(1/7)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయే విధంగా కట్టిన కట్టడాన్ని,కెసిఆర్ పిచ్చి చాదస్తంతో,భూతాలు,ప్రేతాలు పట్టిన మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ,రాత్రికి రాత్రే సెక్రెటరీయేట్ ను కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణాలో నిజాం పాలన,నిరంకుశ,నియంతృత్వ పాలన కొనసాగుతోంది.
(2/7)