బేతాళుడు Profile picture
ప్రశ్నిస్తాడు.. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే..మీ బుర్ర వెయ్యి వక్కలౌతుంది. #తెలుగుట్విట్టర్ #మనమాతృభాషతెలుగు #తెలుగులోకావాలి
May 11, 2021 8 tweets 6 min read
ప్రశ్న: (The white rice and chess board problem)

మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్

- పావులూరి మల్లన్న (క్రీ.శ. 11 వ శతాబ్దం) అంటే, చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగంలో ఉండే 64 గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా !
2 ^ 0 + 2 ^ 1 + 2 ^ 2 + ......... 2 ^ 63
ఇది మొత్తం కూడితే చాలా పెద్ద సంఖ్య వస్తుంది.