#మనమాతృభాషతెలుగు. గణక వృత్తి.
భాష, సంగీతం, సినిమా, సాహిత్యాలు ప్రవృత్తి.
రాజకీయాలు కూడా జీవితంలో విడదీయరాని భాగమే.
నోటిదురుసు, దూషణలకు బ్లాక్ చేయడమే బహుమతి.
Feb 1, 2023 • 23 tweets • 4 min read
Thread on #Budget2023
ఇంకేముందీ, ఇది ఎన్నికల బడ్జెట్టు, మన నెత్తిన పాలేం ఖర్మ పంచామృతం పోస్తారని చాలా ఆశగా చూశారు చాలామంది.
చివరకు ఏమీ లేదు. ఈ తీగలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను.
1. జీతగాళ్ళకు ఎటువంటి కొత్త వెసులుబాటూ లేదు. 7 లక్షల వరకూ పన్ను మినహాయింపు కొత్త ఫైలింగ్ పద్ధతి ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ కొత్త పద్ధతి 20 లక్షల సంవత్సరాదాయం దాటిన వారికి మాత్రమే కొద్దో గొప్పో ఉపయోగం కానీ, మధ్యతరగతివారికి ఏమీ ఉపయోగం లేదు. అంతేగాక,