S A I Profile picture
ఓం సహనా వవతు| సహనౌ భునక్తు| సహవీర్యం కరవావహై| తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై| ఓం శాంతి: శాంతి: శాంతి:|| #జైతెలుగుతల్లి 🚷భాజపాలకు నో ఎంట్రీ
padmachava Profile picture 1 subscribed
Nov 13, 2022 25 tweets 3 min read
భాజపాని, నెమల్రాజుని విమర్శిస్తుంటే నన్ను పచ్చబ్యాచ్ అని పిలవటం మొదలేసాయ్ బత్తాయిలు. నిజానికి, 2002 నుండి నేనూ బత్తాయినే. అందులోను, నెమల్రాజుకి విపరీతమైన అభిమానిని. ఏదైనా, తనదాకా వస్తేకాని తెలియదంటారు పెద్దలు. 1 నెమల్రాజు అసూయాగ్రస్త విశ్వరూప విన్యాసం 2015-2016 నాటికి అర్ధమయ్యింది. అప్పటితో బత్తాయితనం నుండి బయటపడ్డా. దాదాపు రాజకీయ జీవితపు చరమాంకంలో ఉన్న చంద్రబాబు, కొత్త ఆంధ్ర రాష్ట్ర చరిత్రపుటల్లో నిలిచిపోటానికే ప్రయత్నిస్తాడు కానీ, ప్రజలను ఎందుకు మోసం చేస్తాడు అనే ప్రశ్న తొలిచింది. 2
Jul 8, 2022 7 tweets 1 min read
విజయేంద్రప్రసాదుగారు పూర్తి పరిజ్ఞానంతో ఈ అభిప్రాయం చెప్పినట్లు అనిపించటం లేదు. బ్రిటీష్ ఇండియాలో 1946లో జరిగిన ఇండియన్ ప్రొవిన్షియల్ ఎన్నికలలో 11 ప్రొవిన్సులకు గాను 8లో కాంగ్రెస్ గెలిచి మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1/7 ఈ ప్రభుత్వం 2-సెప్టెంబరు-46 నుండి 14-ఆగష్టు-47 వరకు నడిచింది. ఈ ప్రభుత్వాధినేత (ప్రధాని కాదు) నెహ్రు. పటేల్ గృహమంత్రి. ఈ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం అధికార మార్పిడి, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం. 2/7
Apr 8, 2022 4 tweets 1 min read
జాతీయవాదం మీద ఈ భాజపాల మరో బాగోతం చూద్దాం. మొన్నామధ్య జె.ఎన్.యు.గొడవల మధ్య ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో మువ్వన్నెల పతాకం నిర్బంధంగా ఎగరేయాలని తీర్మానించారు ఈ భాజపా బకాసురులు. బహుశా ఈ తరానికి తెలియని ఓ విషయం ఇక్కడ చెప్పుకుందాం.1/4
#భాజపాల_వికృత_నగ్నస్వరూపం మూడు రంగుల పతాకాన్ని ఆరెస్సెస్ ఏనాడు ఒప్పుకోలేదు. కారణం, వాళ్ళు ఒక్క కాషాయం రంగు మాత్రమే ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ ఉద్దేశ్యంలో కాషాయం ఒక్కటే భారతీయతను చాటిచెప్పే రంగు. ఆ కారణంగా వాళ్ళ కార్యాలయాల మీద ఏనాడూ త్రివర్ణ పతాకం ఎగరేయలేదు. 2/4
#భాజపాల_వికృత_నగ్నస్వరూపం
Apr 8, 2022 5 tweets 2 min read
దేశవిభజనకు కారణంగా కాంగ్రెస్‌ని, గాంధీనీ, జిన్నాను బాధ్యులు చేసి దుమ్మెత్తిపోసే ఈ భాజపా గురివిందలు ముస్లీంలీగ్‌తో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపారంటే మీరు నమ్మగలరా? ప్రత్యేక పాకిస్తాన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసారంటే నమ్ముతారా?1/5
#భాజపాల_వికృత_నగ్నస్వరూపం వీళ్ళ అప్పటి రూపమైన హిందుమహాసభ వికృత నగ్న స్వరూపాన్ని మన తాతలు చూసారు. ఆ విషయాలు తెలియని ఇప్పటి తరం కోసం ఈ ట్వీటుమాల. తమ్ముళ్ళు అధికారం కోసం ఎంతకైనా తెగించే వీళ్ళని మన తాతలు, తండ్రులు దూరం పెట్టటానికి సరైన కారణాలే ఉన్నాయని గ్రహించండి. 2/5
#భాజపాల_వికృత_నగ్నస్వరూపం
Apr 8, 2022 5 tweets 1 min read
మాట్లాడితే, సిద్ధాంతాల గురించి సోది చెప్పటం, తమ జాతీయవాదంలో భాగంగా దేశ విభజనకు కారణమయ్యారని గాంధీని-నెహ్రుని-కాంగ్రెస్‌పార్టీని ఆడిపోసుకోవటం భాజపాల నిత్యకృత్యాలు. వీళ్ళ హిపోక్రసీ పటాపంచలు చేసి పంచెలూడగొడదాం.1/5 ఈ స్క్రీన్‌షాట్ భాజపాల వెబ్‌సైటు నుండి తీసుకున్నది. ఇది వాళ్ళ సిద్ధాంతాలపేజీ. ఎక్కడైనా సావర్కర్ కానీ, గాడ్సే కాని కనిపిస్తున్నారా? కనీసం శ్యామాప్రసాద్ ముఖర్జీ, హెగ్డేవార్ కానీ కనిపిస్తున్నారా? మాటవరసకైనా హిందువుల గురించి ప్రస్తావన ఉందా? రామరాజ్యం గురించి ఒక్క వాక్యం ఉందా?2/5
Mar 14, 2022 10 tweets 2 min read
ఈరోజు ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా రాగానే, కాశ్మీరీ పండిట్ల కోసం కన్నీళ్ళు కారుస్తూ, జబ్బలు చరుచుకుంటూ బట్టలు చించుకుంటున్న భాజపాలు కాశ్మీరులో హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు ఏం చేసారన్నది (లేదా ఏం చేయలేదన్నది) చర్చించి తీరాల్సిన విషయం.1 కాశ్మీరులో హిందువుల ఊచకోత 1947లో జరిగింది కాదు. 1989-90లలో జరిగింది. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. భాజపాలు ఎవరినైతే కుహానా లౌకికవాదులుగా గేలిచేస్తారో వాళ్ళ కొమ్ము కాస్తున్న రోజులు. జమ్ము-కాశ్మీరులో గవర్నరుగా ఉన్నది ఆరెస్సెస్ వ్యక్తి.2
Sep 21, 2020 19 tweets 2 min read
1976వ సంవత్సరంలో 42వ సవరణ ద్వారా, మన రాజ్యంగపు ఉపోద్ఘాతంలో (ప్రస్తావన, ప్రవేశిక) ’సోషలిస్ట్’, ’సెక్యులర్’ అనే పదాలు ఇందిరాగాంధీ చొరవ వల్ల చేర్చబడ్డాయి. అసలు ఈ ’సెక్యులర్’ అన్న పదాన్ని ఏ అర్థంలో అక్కడ ప్రస్తావించారు? మనం అర్ధం చేసుకున్నదానికి ఈ అర్ధానికి తేడా ఏమైనా ఉన్నదా?1 మన రాజ్యాంగ నిర్మాతలు మొట్టమొదటి ప్రవేశికలో మన దేశాన్ని, సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగానే అభివర్ణించారు కానీ, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా వ్రాయలేదు. అంటే, అప్పటికి వాళ్ళకు ఆ పదాలు తెలియకనా? ఆ విషయాన్ని ఆ వాదులాటని ప్రస్తుతానికి పక్కనపెడదాం.2
Sep 16, 2020 14 tweets 2 min read
రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. పాడిపంటలకు, ధన-ధాన్య-వస్తు-వాహనాలకు కొరత లేకుండా ప్రజలు శాంతిసౌభాగ్యాలతో కులాసాగా ఉన్నారు. పరిశ్రమలు పరిఢవిల్లుతున్నాయి. ఖజానాలో డబ్బులు ఏరులై పారుతున్నాయి. 2024 నాటికి పూర్తయ్యే కలగా 2014లో నేను ఊహించిన నవ్యాంధ్ర ఇది.1 ఆ కల ఓ కల్లయ్యింది 2019కి. ఉన్న ఆదాయ వనరులను ఒక్కటొక్కటిగా నరుక్కుంటున్న ప్రభుత్వం. ఇకపై అప్పులు పుట్టని పరిస్థితి. పుండుపై పుట్రగా, ఇప్పుడు కరోనా మహమ్మారి. ద్వేషంతో మొదలయ్యే ఆలోచనల పర్యవసానం దారుణంగానే ఉంటుంది. ఆంధ్రులం నేర్చుకోవాల్సిన పాఠం ఇది.2