Srikanth Miryala Profile picture
నాన్న/రచయిత #KGHKathalu/ Psychiatrist
bonda.eth Profile picture 𝓜𝓪𝓵𝓵𝓲𝓴 మల్లిక్🌹 Profile picture Common man Profile picture 6 subscribed
Mar 1, 2023 20 tweets 3 min read
హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడు, ఒకరోజు కార్డియాలజీ విభాగంలో నైట్ డ్యూటీ. ఆ రాత్రి అప్పటికే అడ్మిట్ అయినవాళ్లలో ఇద్దరు చనిపోగా, ఒకర్ని చాలాసేపు రిససిటేట్ చేసి బ్రతికించారు మా కార్డియాలజీ పీజీ, మెడిసిన్ పీజీలిద్దరూనూ, నేనేదో ఉడతా భక్తి సాయం. అప్పటికి ఉదయం 6గం కావస్తోంది, అప్పుడే ఆ రిససిటేట్ అయిన రోగిని స్టెబిలైజ్ చేస్తున్నారు, ఇంతలో వార్డుకి ఒక కొత్త పేషెంట్ను ఇద్దరు ఆడవాళ్లు ఒక స్ట్రెచర్ పై తోసుకుంటూ వచ్చారు. వాళ్ళు చాలా గాభరాలో ఉన్నారు, కార్డియాలజీ పీజీ నాతో ఇలా అన్నారు, "నువ్వెళ్ళి చూడు, స్పృహలో లేకపోతే వెంటనే CPR చెయ్యు, నేను వచ్చేస్తాను"
Feb 14, 2023 8 tweets 1 min read
గురక గురించి.
సాధారణంగా మనం పీల్చే గాలి ముక్కునుంచి, గ్రసని అక్కడ్నుంచి శ్వాసనాళం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ గ్రసని అనేది కొన్ని కండరాల సముదాయం. ఇవి మనం మేల్కొని ఉన్నప్పుడు సంకోచించి గ్రసనిని తెరిచి ఉంచి గాలి వెళ్లేలా చేస్తుంది. అయితే రాత్రిళ్ళు ఈ కండరాలు పట్టు తప్పడం వలన గాలి వెళ్లే మార్గం సన్నంగా మారి ఈలలో గాలి సన్నని మార్గం గుండా వెళ్ళేటప్పుడు శబ్దం వచ్చేలాగా ఈ గురక వస్తుంది.వయసు పైబడటం, ఊబకాయం, కొంతమందిలో పుట్టుకతో గాలిమార్గం సన్నంగా ఉండడం, రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధులు మొదలైనవి గురక వచ్చే అవకాశాల్ని ఎక్కువ చేస్తుంది.
Feb 4, 2023 10 tweets 2 min read
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈరోజు. కొన్ని విషయాలు తెలుసుకుందాం.
క్యాన్సర్ రాని అవయువం లేదు మన శరీరంలో. కొన్ని పూర్తిగా జన్యులోపం వలన వస్తాయి అటువంటివాటిని ఆపటానికి మనమేం చెయ్యలేం. కొన్నింటిని రాకుండా ఆపగలం. వాటికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం.
పచ్చళ్ళు,నిల్వఉన్న పదార్ధాలు,పొగతో వండిన పదార్ధాలు తినకపోవడం.
కొన్ని రకాల పెట్రో కెమికల్స్, రంగులు, క్యాన్సర్ కారక రసాయనాలకు దూరంగా ఉండటం.
మందు,సిగరెట్ తాగకపోవటం
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఆడవాళ్లు వాక్సిన్ వేసుకువడం
Jan 19, 2023 9 tweets 2 min read
CPR లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఎప్పుడు ఎలా చేయాలి?
గమనిక-ఇది ఒక మార్గదర్శకం మాత్రమే, ఏదైనా అత్యవసర/మత్తు వైద్యుల సంఘం నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా తర్ఫీదు పొంది ధ్రువపత్రం పొందవచ్చు.
CPR మీన మేషాలు లెక్కించకుండా ఎంతత్వరగా చేస్తే అంత మంచిది.ఎలాగో చూద్దాం ఎవరైనా వ్యక్తి ఏదైనా కారణం వలన (విద్యుదాఘాతం,నీటిలో మునిగిపోవడం, గుండెపోటు) హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినపుడు అలాగే వారి నాడి తెలియనప్పుడు (అంటే గుండె కొట్టుకోవట్లేదని) వారికి CPR వెంటనే ప్రారంభించాలి. ఆలస్యం చేసే ప్రతినిమిషం వ్యక్తి బ్రతికే అవకాశం 15%సన్నగిల్లుతుంది
Jan 6, 2023 16 tweets 3 min read
అరకులోయ,క్షవరం చెయ్యని గడ్డం, రింగులు తిరిగి చెంపలు దాటిన జుట్టు, దాదాపు అడుగు అరిగిపోయిన వుడ్ ల్యాండ్ జోళ్ళు, సగం ఫ్రేము కళ్లద్దాలు, వీటికి తోడు తెల్ల చొక్కా, నీలిరంగు జీన్సు ప్యాంటు, భుజానికి నడుం వరకు వేలాడుతున్న పాత తోలు సంచీ, చివరిగా పైజేబులో ఒక పెన్ టార్చ్ తో గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఒక మునిలా సాగిపోతున్నాడతడు. అతనికో ముఫైయ్యారేళ్ల వయసుంటుంది. చెట్ల కొమ్మల్లోంచి తప్పించుకొచ్చిన సూర్య కిరణాలు అతని నుదిటి నుంచి జాలువారే చెమట చుక్కల్ని ముత్యాలుగా మారుస్తున్నాయి. అదొక దారి కాదు, కానీ అతను నడిచేది ఏదైనా అతనికి దారే, ఆ అడవిలో అతనేదో వెదుకుతున్నాడు.
Jan 5, 2023 7 tweets 1 min read
విటమిన్ బి12 గురించి.
ఇది మాంసం,గుడ్లు,పాల ఉత్పత్తుల్లో విరివిగా లభిస్తుంది. శాకాహారంలో ఉండదు. విటమిన్ బి 12 లోపం దాదాపు 4%ప్రజల్లో ఉంటుంది. దీని లోపం వలన అలసట,తిమ్మిర్లు,రక్తహీనత, దిగులు, వెన్నుపాములో నరాల క్షీణత వచ్చి తూలిపోవటం, మతిమరుపు,అంగస్థంభన తగ్గటం మొదలైనవి కనిపిస్తాయి. ఇది నరాల పటుత్వానికి, రక్తం వృద్ధికి అవసరం. సాధారణంగా మనం తినే ఆహారంలో ఇది లేకపోవటం వలన ఒంట్లో దీనిలోపం వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే మనమందరం మాంసం తినకపోయినా కనీసం పెరుగు తింటాం. అయితే ఆహారంలో ఈ విటమిన్ బి12 కొన్ని మాంసకృత్తులకు అతుక్కుని ఉంటుంది. ఈ ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళాక
Jan 4, 2023 4 tweets 1 min read
ఆడవారికి మగవారికి మధ్య లైంగికాకర్షణ మనం ఎక్కువగా చూసేది, ఇది సహజం.అలాగే మగవారికి మగవారికి మధ్య లైంగికాకర్షణ ఉంటుంది, ఇదీ సహజం. అలాగే ఆడవారికి ఆడవారికి మధ్య కూడా లైంగికాకర్షణ ఉంటుంది, ఇది కూడా సహజం. ఏదీ మానసిక వ్యాధి కాదు, కాబట్టి దేనికీ చికిత్స లేదు. కొంతమందికి ఆడవారు, మగవారు ఇద్దరిపట్లా లైంగికాకర్షణ ఉంటుంది, ఇది కూడా పైవాటిలాగే సహజం. అలాగే ఆడవాళ్ళని ఇష్టపడే ఆడవాళ్ళలో కొన్నిసార్లు మగవాళ్ళంటే ఆకర్షణ ఉండొచ్చు కానీ మగవాళ్ళని ఇష్టపడే మగవాళ్లు ఆడవాళ్ళని ఇష్టపడటం అరుదు లేదా కుదరనిది.
Dec 15, 2022 11 tweets 2 min read
సరే ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చెయ్యాలనుకునే ముందు కొన్నివిషయాలు తప్పక తెలుసుకోవాలి. దీంతో బరువు కొంత తగ్గినా దీని అసలు ఉదేశ్యం వేరే, అదేంటో చూద్దాం. మనం ఏదైనా తిన్న ప్రతిసారీ రక్తంలో గ్లూకోజు స్థాయి పెరుగుతుంది. ఈ పెరిగే స్థాయి మనం తినే పదార్ధాన్ని బట్టి ఉంటుంది. దీన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు.కొన్ని పదార్ధాలు గ్లూకోస్ స్థాయిని తక్కువగా,మెల్లిగా పెంచితే కొన్ని త్వరగా,ఎక్కువగా పెంచుతాయి. ఏదైనాగానీ ఈ గ్లూకోస్ స్థాయి పెరగగానే క్లోమగ్రంధి ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఈ గ్లూకోస్ ని కండరాల్లోకి,
Dec 11, 2022 12 tweets 2 min read
మీకు నిద్ర పెట్టట్లేదా ? అయితే నేను చెప్పిన కింది చిట్కాలు పాటించండి. చాలామటుకు నిద్ర మెరుగవుతుంది అప్పటికీ సమస్య ఉంటే వైద్యుడ్ని కలవండి. నిద్రలేమికి శారీరక మరియు మానసిక కారణాలుంటాయి, వాటిని బట్టి చికిత్స ఉంటుంది. 1. నిద్ర కోసం ఒక క్రమపద్ధతిని అవలంబించండి. పనిదినాలు మరియు వారాంతాల్లో ఒకే సమయానికి నిద్ర పోయేలా మరియు లేచేలా క్రమశిక్షణ పాటించండి. ఇది నిద్ర వలయం సరిగ్గా ఉండేలా చూస్తుంది.
2. నిద్ర వచ్చే సమయంలో మంచం మీదకి వెళ్ళండి, రాని నిద్ర కోసం మంచం మీద దొర్లవద్దు.
Dec 9, 2022 5 tweets 1 min read
I was doing my internship and was posted in cardiology. Chief rounds were going on. There was a patient in heart failure and super speciality resident had started all the diuretics and pressers required for three days and there was no significant improvement. Case was presented. Chief examined patient’s palms and eyes. He looked at the treatment chart once again and asked the resident about which medication was missing. The resident had no clue. Chief asked to go through the investigations still the resident had no clue.
Nov 15, 2022 5 tweets 1 min read
చాలా క్లిష్టమైన ప్రశ్న కానీ ప్రయత్నిస్తాను. కొన్ని విషయాలు - శారీరక, మానసిక పరిపక్వత.
పురుషులకి కౌమారం రాగానే తండ్రి కావొచ్చు దాంట్లో శారీరకంగా ఇబ్బంది లేదు. పైగా చిన్న వయసులో తండ్రి అయ్యే వారి శుక్రకణాల్లో జన్యులోపాలు తక్కువ. స్ర్త్రీల విషయానికొస్తే పద్దెనిమిదేళ్ల వరకూ ఇంకా ఎముకలు పెరుగుతూనే ఉంటాయి అంటే కటి ఎముక ఇంకా పూర్తిగా అమరదు అందువలన సుఖప్రసవం అయ్యే అవకాశాలు తక్కువ, అంతే కాకూండా అదింకా ఎదిగే వయసు కావటం వలన దేహానికి చాలా పోషకాలు అవసరం అటువంటి పరిస్థితుల్లో చాలామంది స్త్రీలలో రక్తలేమి, విటమిన్లు తక్కువ స్థాయిలో ఉండటం మొదలైనవి బిడ్డ ఎదుగులకి
Oct 6, 2022 9 tweets 2 min read
సాధారణంగా పిల్లలో వచ్చే జలుబు,జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్లు. ఇవి మందేస్తే వారంలో,వెయ్యకపోతే ఏడురోజుల్లో తగ్గుతాయని మా పుస్తకాల్లో రాశారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఎందుకంటే అవి బాక్టీరియా మీద మాత్రమే పనిచేసేవి కాబట్టి. అలాగే అవి వాడటం వలన బాక్టీరియా ఔషధ నిరోధకత పెరిగి తర్వాత నిజంగా బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చినా తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనదేశంలో వీటి ఇబ్బడిముబ్బడి వాడకం వలన ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడే పరిస్థితి దాపురించింది. ఆమధ్య నాకు కన్ను ఇన్ఫెక్షన్ వస్తే మా జీపీ ఇక్కడ క్లోరాంఫెనికాల్ చుక్కలు రాసిచ్చారు,ఆ మందు మనదేశంలో
Oct 4, 2022 7 tweets 2 min read
@BaapReBaap5 here are my answers.
1. Medical council will not allow establishing a medical college without proper facilities which include hostel buildings, classrooms, non teaching and teaching staff, play ground etc which are not needed to run a good hospital. Yes, in terms of private colleges, except some it is well known fact that they get temporary doctors and fill the wards with fake patients to get approval. Govt medical colleges are far better than them.
Sep 15, 2022 12 tweets 2 min read
ప్రేమ/పెద్దలు కుదిర్చిన వివాహమైనా అన్యోన్య దాంపత్యాల కథలు వెలుగు చూడకపోవడం, కేవలం విఫల బంధాల కారణాలు, వాటి పరిణామాలు మాత్రమే యువతరం వినటం వలన వారిలో వివాహం అంటే విపరీతమైన భయమో లేదా ఏహ్యభావమో కలుగుతోంది. అసలు యువతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వివాహపు జంట కొన్ని స్థాయిలను దాటి ప్రయాణం చేస్తుంది, అవి 1. పిల్లలు లేని యువ జంట, 2.చిన్నపిల్లలున్న కుటుంబం, 3.పెళ్ళికి/ఉద్యోగానికి సిద్ధమైన పిల్లలున్న నడివయసు జంట 4. మనవలు పిల్లలుగా ఉన్న జంట 5. పెళ్ళైపోయిన మనవలు ఉన్న వృద్ధ జంట. ఈ ప్రయాణంలో ఒక్కో స్థాయి వద్ద జంట మధ్య ఒక్కో రకమైన ప్రేమ,ఆకర్షణ ఉంటాయి.
Sep 13, 2022 8 tweets 2 min read
బెంగళూరు లో ఒక సూపర్ స్పెషలిస్టు వైద్యుడు మూడు కిలోమీటర్లు పరిగెత్తి వెళ్లి శస్త్ర చికిత్స చేశాడు. దీనిగురించి నాక్కొన్ని ఆలోచనలున్నాయ్, అవి కొందరికి నచ్చకపోవచ్చు కానీ చెప్పాలనుకుంటున్నాను.
1. అక్కడ ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అన్నది మనం విస్మరించి కేవలం వైద్యుని నిబద్ధతని మాత్రమే పొగడటం
2.ఆ శస్త్ర చికిత్స పేరు లేపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే కడుపుపై చిన్న కోతతో గాలినింపి గొట్టాలతో పిత్తాశయాన్ని తొలగించే శస్త్ర చికిత్స. దీనికి నైపుణ్యం అవసరం అయితే ఇది అత్యవసరమైన చికిత్స కాదు, ఫలానారోజు ఫలానా సమయానికి అనుకుని చేసేది, అంటే వైద్యుడు ట్రాఫిక్
Sep 7, 2022 8 tweets 2 min read
డెంగ్యూ వస్తే ఏం చెయ్యాలి?
ముందు ఆ ఏం కాదులే అని వదిలెయ్యాలి, జ్వరం ఎక్కువయ్యి ఒళ్ళు నొప్పులు తోడైతే అప్పుడు అమృతాంజనం రాసుకోవాలి, ఒకేవేళ బాగా నీరసం ఆవహించిందనుకో అప్పుడు బొప్పాయి ఆకుల రసం మూడు పూటలా తాగాలి, అయినా తగ్గకపోతే పక్కింటాయన సలహా మేరకు రక్త పరీక్ష చేయించుకోవాలి. లక్షన్నర ఉండాల్సిన ప్లేట్లెట్స్ ఒక యాభై వేలకి పడిపోయాయనుకోండి,అప్పుడు పచ్చి పనసకాయలో తొనలు పడేసి బయటున్న దళసరి పచ్చని తొక్క ముక్కలు ఒక ఎనిమిది తినాలి.దీంతో పాటు పప్పు తినకూడదు,పాలు తాగకూడదు. ఇలా ఒక రెండు రోజులు తినాలి, అప్పటికి బాగా నీరసించి, ప్లేట్లెట్స్ ఒక పదివేలకు వచ్చేస్తాయి
Jul 30, 2022 15 tweets 2 min read
బరువు, మధుమేహం వగైరా వగైరా
మనమెంత బరువుండాలి అనేది ఒక సందేహం. దానికోసం చాలా అధ్యయనాలు జరిగాయి కానీ ఏ ఇతమిద్ధమైన బరువు కూడా చావుని ఆపలేదు కాబట్టి బరువు విషయంలో ఒక అంగీకారానికి వచ్చేసింది వైద్య బృందం. బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటుంటుంది, ఏంటంటే మన బరువుని కేజీల్లో హారంగా రాసి మన ఎత్తుని మీటర్లల్లో వర్గంగా హారంగా రాసి భాగించాలి. ఉదా, బరువు 72కేజీలు అనుకుందాం, అలాగే ఎత్తు 170సెంటీమీటర్లు అయితే ఈ బీయెమ్మై 72/(1.7x1.7) = 24.9 అంటే రమారమి 25. అయితే అధ్యయనాల ప్రకారం తేలింది ఏమిటంటే మన బీ యెమ్మై (బాడీ మాస్ ఇండెక్స్) 18.5 నుంచి 25 మధ్యలో ఉండాలి.
Jul 16, 2022 14 tweets 5 min read
మన దేశంలో డాక్టర్ కావటం ఎలా , ఒక కూతల గజమాల
ముందు ఇంటరు బైపీసీ లో పాసవ్వాలి.ఈ కరోనాలు,ఇంస్టాలు,టిక్ టాక్ లు అన్నీ దాటి రావాలి.ఆ తరువాత నీట్ అనే పరీక్ష రాసి అర్హత సాధించాలి. దానికి మళ్ళీ మన ఇంటరు స్టేట్ సిలబస్ వేరే నీట్ సిలబస్ వేరే.ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు కావాలికదా అందుకని వాళ్ళకి అతీంద్రియ శక్తులుండాలి అన్నమాట.ఇక క్వాలిఫై అయ్యి ఒకఅరవై లక్షలడబ్బుంటే దానికి మళ్ళీ ఐదేళ్లకి అయ్యే ఖర్చులు మరో నలభై లక్షలు కలిపి మొత్తం రెండు కోట్లుంటే ఎంబీబీఎస్ సీటు కొనేసి చేరి చదివేయొచ్చు.అదేంటి ఒక కోటే కదా రెండంటారేంటి ? ఐదేళ్లవరకు ద్రవ్యోల్బణం దుప్పటేసుకోదుగా.
Jul 16, 2022 4 tweets 1 min read
కొన్న చెప్పులు ఎక్కడో మర్చిపోయి,అవి లేకుండా తుప్పల్లో బంతులేరి ఆ ముల్లు కాల్లో గుచ్చుకుని, కాలెత్తేసరికి అది విరిగి లోపలుండిపోయి,కోట్ల భగవాను ఒళ్ళో కాలుపెడితే వాడొక పెద్ద సర్జన్ లా చొక్కాతో మట్టి తుడిచి,అక్కడంతా వాడి ఉమ్ము రాసి,మొలతాడుకి దోపిన పిన్నీసు తీసి గుచ్చి గుచ్చి ముల్లుని ముక్కలు ముక్కలు గా బయటికి తీసి మొగలి రేకులు సీరియల్లా రేపటికని కొంత ఉంచేవాడు, కుంటుతూ ఇంటికెళ్తే నాన్నమ్మ పసిగట్టి, పసుపు కలిపిన వేడన్నం ముద్ద చేసి చల్లార్చి తాతయ్య పాత గావంచా చింపి,ఆ ముద్ద ముల్లు గుచ్చిన దగ్గరపెట్టి కట్టు కడితే అది పుండు అవ్వకుండా పొద్దున్న మిగిలిన
Jul 6, 2022 5 tweets 1 min read
తిన్న తర్వాత ఒక లీటరు రక్తం పేగులకి జీర్ణాశయానికి గుండె పంపు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అవటానికి, అలాగే శోషించుకోవడానికి,దానివలన మెదడుకి రక్త ప్రసరణ తగ్గుతుంది,
మధ్యాహ్నం వేళలో మనల్ని మెలకువగా ఉంచే సర్కేడియన్ రిథం లో చిన్న డిప్ వచ్చి మెదడుని మెలకువగా ఉంచే రెటిక్యులార్ యాక్టీవేటింగ్ సిస్టం కూడా కాసేపు పనిచేయదు.అలాగే తిన్నవెంటనే రక్తంలో గ్లూకోస్ శాతం ఒక్కసారిగా పడి మళ్ళీ లేస్తుంది,అంతే కాకుండా కండరాలకు కూడా గుండెరక్తం పంపు చెయ్యదు ఆ సమయంలో ( మన దేహంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది, గుండె ఎప్పుడు యే అవయువం ఎక్కువ పనిచేస్తే దానికి రక్తాన్ని సర్దుతుంది)
Jun 28, 2022 10 tweets 2 min read
My 8yr old son bought a big carrier ship toy after watching Topgun,and it was time to play with me in bathtub.We got into bathtub with the ship.I asked him about little flaps that pop out on the runway on the ship. He said “they are fire resistant boards, which will help to give thrust to fighter plane after their engines start. Something like Newton’s third law.”
Me - oh okay, that great, do you know what is Newton’s second law then?
Him- well, how would I know tell me about it.
I took a floating duck toy and pushed it slowly first and then fast later.