Ravi Vallabhaneni (మహానాడు 2025) Profile picture
Retired Banker and currently working in private sector #TDPTwitter #TeluguPurushudu
Oct 28, 2022 7 tweets 1 min read
కోహినూర్ వజ్రాలు వలస వెళ్లిపోతున్నాయి!

అందరూ రిషి సునాక్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు

ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన 1% స్టాక్స్ కట్నం దాదాపు రూ. 4,000 కోట్లతో (బ్రిటన్ రాణి ఆస్తి కంటే ఎక్కువ) మంచి ఆశయాలతో తన 40ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి పాలిష్ అయ్యాడు, బ్రిటన్ ప్రధాని అయ్యాడు
1/7
Well Educated background ఉన్న రిషి బ్యాంకింగ్ రంగం లో మంచి ఉద్యోగం చేశాడు

సరే...

అలా కట్నంలా కాకుండా సొంత డబ్బుతో, తాతల & తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులతో
మన రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ఉన్నారో తెల్సా?

సరే ఒక క్లూ
రిషి లాగానే బాగా చదువుకున్న వాడు, బ్యాంకింగ్ రంగంలో మంచి 2/7
Aug 16, 2022 18 tweets 3 min read
పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి.

(జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ)

బ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనే) దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి
1/18 ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్‌ లో జెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్‌ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని.

వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్‌ ఆర్మీలో పని చేశారు. సర్వీస్లో ఉండగానే చనిపోయారు
2/18
Feb 5, 2022 6 tweets 1 min read
NRI TDP Cell ద్వారా టీచర్లకు USA లో ఉద్యోగ అవకాశాలు

డియర్ లీడర్స్,

USA లో టీచర్ల ఉద్యోగ అవకాశాలు TDP NRI Cell ద్వారా కల్పించటం జరిగింది. మీ పరిధిలోఉన్న టీచర్లకు ఈ విషయం తెలియచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా సూచించండి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు...
1/6
అమెరికాలో టీచర్లకి ఉద్యోగ అవకాశాలు

USA లో టీచింగ్ పోసిషన్ ప్రదేశాలు...

ఎక్టర్ కంట్రీ ఇండిపెండెన్స్ స్కూల్ డిస్ట్రిక్ట్, టెక్సాస్, USA.

హౌస్టన్ ఇండిపెండెన్స్ స్కూల్ డిస్ట్రిక్ట్, టెక్సాస్, USA.

ఆస్టిన్ ఇండిపెండెన్స్ స్కూల్ డిస్ట్రిక్ట్, టెక్సాస్, USA.

2/6
May 24, 2021 18 tweets 3 min read
గౌర‌వ మ‌ర‌ణాన్ని ఇవ్వండి మోదీ సార్‌!

GR Maharshi

మోదీ ప్ర‌ధాని అవుతాడంటే చాలా మంది భ‌య‌ప‌డ్డారు. గుజ‌రాత్ ర‌క్త‌పు మ‌ర‌క‌ల చొక్కాతో ప‌ద‌విలోకి వ‌స్తున్నాడ‌ని. నేను భ‌య‌ప‌డ‌లేదు. సిక్కుల్ని ఊచ‌కోత కోసిన కాంగ్రెస్ పార్టీ ద‌శాబ్దాలుగా ఏలిన‌ప్పుడు లేని భ‌యం ఇప్పుడెందుకని?
1/n
మైనార్టీల మీద దాడులు మ‌న‌కేం కొత్త‌కాదు క‌దా!

మోదీ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న ఉప‌న్యాసాలు, హావ‌భావాల్లో ఫాసిస్ట్ వాస‌న కొట్టినా అది నా ముక్కు స‌మ‌స్య అనుకుని విక్స్ రాసుకుని ప‌డుకున్నాను. దేశానికి కొత్త ర‌క్ష‌కుడు వ‌చ్చాడ‌ని అనుకూల మీడియా భ‌జ‌న విని మామూలు జ‌నం కూడా పూన‌కంతో ఊగారు
May 24, 2021 5 tweets 1 min read
ఒకరోజు : చప్పట్లు కొట్టమన్నారు

ఒకరోజు : ఈలలు వేయమన్నారు

ఒకరోజు : ఆవు ఉచ్చ తాగమన్నారు

ఒకరోజు : ఒంటినిండ ఆవు పేడ పూసుకోమన్నారు.

ఒకరోజు : ముక్కులో నిమ్మరసం పిండుకొమన్నారు..

ఒకరోజు : వేడినీళ్లతోనే సంసారం చేసుకోండి అన్నారు..

ఒకరోజు : అల్లం, బెల్లం, తులసి కలిపి తినమన్నారు..
1/5
ఒకరోజు: మూలికలతో కషాయం కలుపుకొని గట్టిగా తాగమన్నారు..

ఒక రోజు: తొమ్మిది గంటలకు
తొమ్మిది దీపాలు వెలిగిస్తే, ఫొటాన్ శక్తులోచ్చి కొరోనాను నాశనం చేస్తాయని చెప్పారు..

ఒకరోజు: రెమిడిసివిర్ వాడొచ్చు అన్నారు

ఒకరోజు: రెమిడిసివిర్ పనిచేయదు వాడొద్దు అన్నారు..
2/5
Apr 3, 2021 8 tweets 1 min read
3000 రూ.లకు బెజవాడను కొనేసిన బ్రిటీష్ పాలకులు.

మన బెజవాడ క్రీ.శ. 1731 నుండి క్రీ.శ.1846 వరకూ కలువకొలను జమీందార్ల ఏలుబడిలో ఉండేదట. 1700 శతాబ్దం ప్రారంభ సంవత్సరం లో కలువకొలను తిరుపతిరావు బెజవాడలో జమీందారీనీ వ్యవస్థాపించాడు. 1731 లో ఆయన తరువాత ఆయన కుమారుడు నరసింహరావు ఆ తర్వాత
1/8
అనేకమంది వారసుల చేతుల్లో ఈ జమీ నడిచిందట. 1770 లో సర్కారు జిల్లాలను ధారాదత్తంగా పొందిన బ్రిటీష్ వారు, ఈ జమిందార్లనుండి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. శిస్తు సరిగ్గా కట్టని జమీందార్లను నిర్ధ్యాక్షిణ్యంగా నిర్భందించి, చిత్రహింసలకు గురిచేసేవారట బ్రిటీష్ వారు. అలా కలువకొలను
2/8
Apr 1, 2021 11 tweets 2 min read
కులం కులం అని వాపోయే వారికి ఒక విజ్ఞప్తి

1947 నుండీ 1983 వరకు రెడ్లే అధికారం చలయించారు. ప్రతి ముఖ్యమంత్రి రెడ్డే. 60 మంది మంత్రులలో 45 మంది రెడ్లు.

ఆరోజు ఎవ్వరికి కుల సమస్య గుర్తుకే రాలేదు. వచ్చినా తెలీదన్నట్లు నటించారు.

ఎన్టీఆర్ గెలవగానే కమ్మ కులం అని ఆకస్మాత్తుగా
1/n
అందరికి గుర్తుకు వచ్చింది. అదేంటి రెడ్డి ఉండాలి కానీ మరో కులమా అని అందరూ వాపోయారు.

మళ్ళీ ఎన్టీఆర్ ఓడిపోగానే నలుగురు రెడ్లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు.

చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కొట్ల విజయభాస్కర్ రెడ్డి, వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖమంత్రి పదవి కోసం అష్టచ్చమ్మ ఆటలు
2/n
Mar 12, 2021 30 tweets 5 min read
#చంద్రబాబుద్వేషులారామీవద్దదీనికిజవాబుందా?

చంద్రబాబు అనేసరికి చాలామందికి ఇంత ఆత్మవంచన ఎందుకో తెలీదు. అతను స్వార్థపరుడు సరే! ఎవరు కాదు? స్వార్థం లేనంతమాత్రాన దోపిడీదారులందరినీ నెత్తిన పెట్టుకోవాలా? వైఎస్ అనే అతను నేను అనకుండా "మన" అంటుంటాడు కాబట్టి ఆయన మహానుభావుడు!
1/n
ఇదేం లాజిక్కో అర్థం కాదు! ఆ "మన" లో ఆ దోపిడీలో కూడా "మన" అనే భావన ఏమైనా ఫీలవుతుంటారా!

మరి ఎందుకంత ద్వేషం? విద్వేషపూరిత రాజకీయాలు ఎవరు చేయలేదు, గ్రూపులు ఎవరు కట్టలేదు? ప్రధానమంత్రులు మీద రాళ్లు వేయించింది మత కల్లోలాలతో మనుషులను చంపించింది ఎవరు?
2/n
Feb 12, 2021 5 tweets 1 min read
నిన్ను పదేళ్ళ నుంచి చూస్తున్నా, 2009 ఎన్నికల్లో నీ కథ అయిపోయిందన్నారు చాలా మంది

2014 ఎన్నికల్లో గెలిచావ్ 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చే అంత దారణంగా బాబు పరిపాలించలేదని ఒక వైసీపీ వీరాభిమాని అన్నాడు

ప్రత్యర్ది మొండి వ్యక్తి అనుకున్నది అప్పుడే జరగాలనుకుంటాడు
నువ్వు మానసికంగా
1/n
బలవంతుడివి, నీ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని అవమానాలు చూస్తున్నావ్

నిన్నటి నుంచి నీ గురించే ఆలోచన

నువ్వు ఇంత బలవంతుడివని నేను అనుకోలేదు, నీకు బలం లేదన్న వాడు నిన్ను ఎందుకు తిడుతున్నాడో అర్దమైంది

1055 పంచాయితీలు నేను గెలిచా అని గర్వంగా నిలబడి చెప్పావ్ చూడూ, నువ్వు అంత ధైర్యంగా 2
Jan 6, 2021 7 tweets 1 min read
చూసారా కొన్ని గుళ్ళకి హాని చేస్తే చాలు....

- మనకి ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు..
- GST పరిహారం ఇవ్వక్కర్లేదు..
- పోలవరం నిర్వాసితులకి నిధులు ఇవ్వక్కర్లేదు..
- గండికోట ముంపు బాధితులకి పరిహారం ఇవ్వక్కర్లేదు..
- కడప యురేనియం బాదితుల సమస్యలు తీర్చక్కర్లేదు..
1/n
- రైతు చట్టాలపైన చర్చ అక్కర్లేదు
- పడిపోతున్న ప్రజల ఆదాయాలూ, పెరుగుతున్న బడాబాబుల ఆస్తులపై చర్చ అక్కర్లేదు
- పెరుగుతున్న నిత్యావసరాల పైన చర్చ అక్కర్లేదు
- పెట్రోల్, డీజిల్, గాస్ లపైన రేట్లెంత పెంచినా చర్చ అక్కర్లేదు
- విభజన హామీలు తీర్చాల్సిన పనిలేదు
- ఇండస్ట్రీలు అక్కర్లేదు
2/n
Jan 6, 2021 8 tweets 2 min read
దల్జీత్.......
కోవిడ్ మీద ఫైట్ కోసం.......
పి.ఎమ్ కేర్ కు రూ.20 లక్షలు డొనేషన్ ఇస్తే మంచోడు & బెస్ట్ టాక్స్ పేయర్ అని సర్టిఫికేట్ ఇచ్చారు.

అదే దల్జీత్......
నేడు రైతు ధర్నా కు డొనేషన్ ఇచ్చాడని అతని మీద ఐ.టీ రైడ్స్.

రైతులకు పంట దాచుకునే స్వేచ్చ అని పైకి చెప్పి.....
1/n
ఆ కాంట్రాక్ట్ 30 ఏళ్ల పాటు అదానీకి రాసిచ్చాడు.

ఇదే అదానీ ముంబయ్ ఎయిర్ పోర్ట్ ను జీ.వీ.కే నుండి తీసుకోవాలని ఫైట్ చేస్తే.....
జీ.వీ.కే ఒప్పుకోకపోతే.......
వారి మీద ఈ.డీ రైడ్స్.....
ఆ తర్వాత అదానీ చేతికి ముంబయ్ ఎయిర్ పోర్ట్.

మూడు నెలల క్రితం..
ఆంద్ర క్రిష్ణపట్నం ఓడరేవు
2/n
Jan 5, 2021 7 tweets 1 min read
విజయనగరం మహారాజుల వంశక్రమం గొప్పదనం

వందలు వేల ఎకరాల భూములు దేవుడి సేవకు ఇచ్చిన వంశంలో పుట్టిన పూసపాటి అశోక గజపతి రాజు గారిని దూషించడం, దానికి వంది మాగదులు భజన చేయడం చూస్తుంటే వీళ్ళ కళ్ళు ఎంతగా మూసుకుపోయాయి అర్థమౌతుంది.

పూసపాటి వంశక్రమం..

1/n
పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
పూసపాటి రాచి రాజు
పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
పూసపాటి ఆనంద గజపతి రాజు (విజయనగరం మహారాజు) (1879-1897)
2/n
Dec 26, 2020 5 tweets 1 min read
చంద్రబాబు చాదస్తం

ఇది జరిగి మూడు సంవత్సరాలు అయ్యి వుంటుంది .. మా మిత్రుడు కి ఒక infra company లో ఏదో పని వుంటే అతనితో పాటు నేను కూడా వెళ్ళాను. పనికి సంబంధించిన విషయం మాట్లాడిన తరువాత topic Chandrababu మీదకు మళ్ళింది. ఆ infra company ఆయన చంద్రబాబు గారికి బాగా చాదస్తం ఎక్కువ 1/n అండి అన్నాడు. అది పెద్ద విశేషం కాకపోయినా, ఎందుకు అంటున్నారు అని అడిగా

అప్పటికి పది రోజుల ముందు చంద్రబాబు TIDCO ఇళ్లు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం చెప్పుకొచ్చాడు. TIDCO ఇళ్లలో hall లో TV పెట్టటానికి showcase పెట్టారు

ఈ showcase లో ఏ size TV పడుతుంది అని
2/n
Dec 26, 2020 5 tweets 1 min read
అమరావతి..ఏం పాపం చేసింది?

ఒక అద్భుతానికి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ!

నిర్మించబోయే ఆ భవంతులను తలుచుకుని ప్రతి భారతీయుడు సంతోషంగా గర్వంగా పులకించవచ్చు

మోదీ గారు తమ అమృత హస్తాలతో ఇప్పటికే ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతి నగరానికి శంఖుస్దాపన చేసారు
1/n
అయోధ్య రామాలయానికి భూమిపూజ చేసారు

కొత్త గా నిర్మించబోయే వాటి నమూనాలు ఎంత గొప్పగా ఉన్నాయో దేశ విదేశాల నిపుణులు రూపకల్పన చేసారు

దేశఫ్రజలు నాయకులు పోటీ పడి అభినందనలు తెలియచేసారు

పాపం అమరావతి ఏమి పాపం చేసిందో!

గ్రాఫిక్స్ అన్న దుష్ప్రచారంతో విలవిల లాడుతున్నది

పగటికలగా మారింది
2/n
Dec 26, 2020 7 tweets 1 min read
రాజధాని సమస్యకి పరిష్కారం ఈ కింది రెండింట్లో ఒకటే ..

1 CRDA ని అమలులో ఉంచి రాజధానిని అభివృద్దిచేయడం. వారసత్వ భూములు కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అగ్రిమెంట్ గానీ, కొనుగోలుగానీ అయిన భూముల మీద విచారణ చెయ్యడం
లేదా
1/n
2 రాజధాని మార్చేట్టయితే రైతుల పొలాలు ఎలా ఉండేవో అలాగే తయారు చేసి, వాళ్ళ భూమి మొత్తాన్నీ వాళ్లకి అప్పగించడం
(ఆ అప్పగింత అయ్యేదాకా CRDA ఒప్పందం ప్రకారం కౌలు చెల్లిస్తూ ఉండడం. పూర్వ స్వరూపం కుదరకపోతే, ఆ రైతు ఒప్పుకుంటే డెవలప్ చేసి మొత్తం భూమిని తిరిగివ్వడం)
2/n
Dec 26, 2020 4 tweets 1 min read
👉 అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు...
👉 భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు...
👉 భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు....
1/n
👉 కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు..
👉 వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా ఆకాశం అచ్చెరువొందేలా ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా
2/n
Dec 25, 2020 4 tweets 1 min read
ఇళ్ళ పట్టాలలో లొసుగులు
ఇళ్లకు D పట్టాల పంపిణీ: షరతులు:
👉ఈ పట్టాలపై స్థానిక తాసిల్దర్ సంతకం ఉంటుంది
👉న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం అయితే రిజిస్ట్రేషన్ చేస్తామని లబ్దిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖ బుక్లెట్ లో జతపరిచి ఉంటుంది.
🔹స్థలాన్ని అన్యాక్రాంతం చేయడం చెల్లుబాటు కాదు
1/n
🔹ప్రజాహిత ప్రయోజనాలకు స్థలాలు అవసరమని భావిస్తే
❌పట్టాలు రద్దవుతాయి
స్థలాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు
Important point

👉గృహ నిర్మాణం కోసం అవసరమైన అప్పు/రుణం కోసం బ్యాంకుల్లో ఇంటి స్థలాన్ని కుదువ పెట్టుకోవచ్చు

ఉచితంగా కట్టిస్తామన్నారు కదా మరి కుదువ పెట్టే వెసులుబాటు
2/n
Dec 9, 2020 5 tweets 1 min read
విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆహ్వానం

మితృలారా,

ఆస్తిపన్ను విధింపు విధానాన్ని మార్చుతూ చేసిన చట్టసవరణలను నిరశిస్తూ

టాక్స్ పేయర్స్ అసోసియేషన్ మరియు విజయవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

రౌండ్‌ టేబుల్‌ సమావేశం

తేదీ: 11.12.2020 శుక్రవారం ఉదయం 10గం.కు
1/n
వేదిక: యం.బి.విజ్ఞాన కేంద్రం 4 వ అంతస్తు, రాఘవయ్యపార్కు వద్ద, విజయవాడ

ఇప్పటివరకు రెంటల్‌ విలువ( అద్దెవిలువ) ఆధారంగా లెక్కిస్తున్న ఆస్తిపన్నును, ఆస్తివిలువ (కాపిటల్‌ విలువ) ఆధారంగా లెక్కించేవిధానానికి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ చట్టాలకు సవరణలు చేసింది
2/n
Dec 8, 2020 4 tweets 1 min read
వ్యవసాయ బిల్లుల వల్ల రైతుకు ఎలా నష్టం. చాలా సింపుల్ గా వివరణ

వ్యవసాయ బిల్లు - రైతు జేబుకి చిల్లు

బిల్లులో కనీస మద్దత్తు ధర ప్రకటించలేదు

స్టెప్ 1:
మొదట్లో ఎక్కడైనా అమ్ముకోండి అంటారు

స్టెప్ 2:
మార్కెట్ యార్డ్ కంటే ఎక్కువ ధర బయట కార్పొరేట్ దళారీలు ఇస్తారు

1/n
స్టెప్ 3:
బాగుంది కదా అని రైతులు అక్కడే అమ్మడం మొదలు పెడతారు

స్టెప్ 4:
అందరూ బయట వాళ్లకు అమ్ముకుంటున్నారు కదా ఇక మార్కెట్ యార్డ్ ఎందుకు? నిర్వహణ దండగ అని మూయించేస్తారు

స్టెప్ 5:
ఎప్పుడైతే మార్కెట్ యార్డ్ మూత పడుతుందో అప్పుడు అసలు కథ మొదలవుతుంది
2/n
Dec 7, 2020 7 tweets 1 min read
బంగారు గని లాంటి ఈ దేశ ఆహార ధాన్యాల మార్కెట్ పై అంబానీ ,అదానీ తదితర కార్పోరేట్ల కన్ను పడింది.
అయితే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అవేమిటయ్యా అంటే...

కార్పోరేట్ ఇబ్బంది 1
వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండడం ,రైతులనుండీ ధాన్యం కొనుగోలు చేయాలంటే ఒక్కో రాష్ట్రం లో ఒక్కో
1/n
రకమైన నియమ నిబంధనలు అమల్లో ఉండడం. ఇన్నిరకాల నియమాలూ పన్నువిధానాలూ ఉండడం కార్పోరేట్లకు చీకాకుగా మారింది.

మోదీ సర్కార్ పరిష్కారం1
తన ప్రియతమ కార్పోరేట్లు పడుతున్న ఇబ్బందికి
గుండె కరిగిన మోదీ సర్కార్ చూపిన పరిష్కారం ఏమిటంటే
రాష్ట్రాల అధికారాలు లాగేసుకుని
ఒక దేశం, దేశమంతా ఒకే
2/n
Dec 1, 2020 16 tweets 3 min read
రైతులు ఎందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నారు?

కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణచేసింది

1️⃣ ఇదివరకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు విధించేది. అంటే ఫలానా సరుకు ఫలానా క్వింటాళ్లు లేదా టన్నులు మాత్రమే
1/n
నిల్వచేసుకోవాలి. అంతకుమించి నిలువ చేసుకోకూడదు. ఇప్పుడు అటువంటి పరిమితులు పూర్తిగా ఎత్తేశారు.

ఆహా...ఎంత మంచి చట్టం, రైతుకే కదా మంచి జరుగుతోంది అనుకునేరు.... అక్కడికే వస్తున్నా చూడండి...

ఈ బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు
2/n