రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Mar 22, 2020, 8 tweets

అన్నమయ్య - అల్లసాని పెద్దన

తెలుగు సాహిత్య చరిత్రలో అనేక విశేషాలుఉన్నాయి. మొన్న పోతనామాత్యుడికి, ఆతుకూరి మొల్లకు మధ్యగల సారూప్యతలు చూశాం. ఇవాళ తెలుగు సాహిత్యంలో ధ్రువతారల వంటి తాళ్ళపాక అన్నమాచార్యులు, అల్లసాని పెద్దనామాత్యుల మధ్య సారూప్యతలు చూద్దాం

అన్నమాచార్యులు తెలుగు పదకవితా పితామహుడు
అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు

అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడు
అల్లసాని పెద్దన తొలి తెలుగు ప్రబంధ కర్త

అన్నమయ్య, పెద్దన ఇద్దరూ నందవరీక బ్రాహ్మణులు, ఇద్దరూ స్మార్తులు, ఇద్దరూ ఋగ్వేదులు. కానీ ఇద్దరూ వైష్ణవ మతం ఆచరించారు

అన్నమయ్య ఆ శ్రీహరి మీద 32000 వేల కీర్తనలు రచిస్తే
అల్లసాని పెద్దన హరికథాసారం రచించాడు

అన్నమయ్య తన కీర్తనలతో తెలుగులో సంకీర్తనా సాహిత్యానికి, భజన సంప్రాదయానికి, పదకవితా శైలికి ఆద్యుడుకాగా

పెద్దన తన స్వారోచిష మనుసంభవము / మను చరిత్రతో తెలుగులో ప్రబంధ సాహిత్యానికి ఆద్యుడైనాడు

అన్నమయ్య, అల్లసాని పెద్దన ఇద్దరూ అహోబిల మఠ పీఠాధిపతి శఠగోప జీయరు భక్తులే. శఠగోపయ్య స్వామే ఇద్దరికీ వైష్ణవ దీక్ష ఇచ్చినారని భావన

కరుణానిధి రంగపతికిఁ గాంచీ-
వరునకు వేంకటగిరి పతికి
నిరతి నహోబల నృకేసరికిఁ ద-
తృరుఁడగు శఠగోపంముని యితఁడు అని అన్నమయ్య తన కీర్తనలో

(చూడుఁ డిందరికి అను ఆధ్యాత్మిక సంకీర్తన, రేకు:19-5 సంపుటము:1-117) శఠగోపస్వామి ప్రస్తావన తీసుకు రాగా

క. కొలుతు న్మద్గురు విద్యా
నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా
దళితాశ్రితజనదురిత
చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర] అనిపెద్దనామాత్యులు శఠగోప జీయరు స్వామిని ప్రస్తుతించారు

అన్నమయ్య, అల్లసాని పెద్దన ఇద్దరిదీ కడప జిల్లానే. అన్నమయ్యది రాజంపేట వద్దగల తాళ్ళపాక గ్రామము కాగా, అల్లసాని పెద్దనది కడపలోని చౌడూరు గ్రామమమని, కమలాపురం వద్దగల కోకటం గ్రామమని అభిప్రాయం.

అన్నమయ్య, పెద్దన ఇద్దరూ విజయనగర రాజులచే పోషింపబడ్డారు. అన్నమయ్యను సాళువ నరసింహ రాయలు ఆదరించగా,

అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ప్రథముడు.

అయితే అన్నమయ్య, పెద్దన బంధువులు అవుతారని, అన్నమయ్య ప్రోద్బలంతోనే పెద్దన శఠగోపయ్య శిష్యుడైనాడని ఒక భావన. ఇదమిద్దంగా తెలియక పోయినా ఇద్దరూ ఒకే ప్రాంతానికీ, సంప్రదాయానికి చెందిన వారు అవ్వడం వల్ల నిజం అయిండొచ్చు

తెలుగు సాహితీ చరిత్రలో అటు పదకవితాశైలి ఆద్యుడికి ఇటుప్రబంధకవితాశైలి ఆద్యుడికి ఇన్ని సారూప్యాలు ఉండడం విశేషమే.

#సీమపదం #సీమాసాహిత్యం

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling