రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Jun 7, 2020, 21 tweets

నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య
తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
తొలి కడప లోక్సభ సభ్యుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జలరంగ నిపుణులు కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య

వీరి మధ్యన ఉన్న సారూప్యం ఏమిటి ?

వివిధ కాలాలు, రంగాలకు చెందిన వీరి పేరు చిరస్థాయిగా నిలిచేలా సీమలోని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు వీరి పేరు పెట్టడం జరిగింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకువాడుకలో ఒక పేరు (సాధారణంగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం/నది పేరు మొ. ) ఉంటె అధికారికంగా మరో పేరు ఉంటుంది.

ఆ ప్రాంతానికి నీరు తేవడానికి కృషి చేసిన రాజకీయ నాయకుడి పేరు అయుండొచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయుండొచ్చు లేదా ఆ ప్రాంతానికి సంబంధం లేని గొప్ప వ్యక్తి అయినా అయుండొచ్చు. ఇప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ఎవరెవరి పేర్లున్నాయో చూద్దాం

కోట్ల విజయభాస్కర్ రెడ్డి -

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బ్యారేజ్-సుంకేసుల బ్యారేజ్ తుంగభద్రా నది, కర్నూలు జిల్లా-ఆధునిక సీమలో మొట్టమొదటి నీటి ప్రాజెక్టులలో ఒకటి. ప్రసిద్ధి చెందిన కేసీ కెనాల్ సుంకేసుల నుండే మొదలవుతుంది. జిల్లాకుచెందిన మాజీ CM విజయభాస్కర్ రెడ్డిగారి పేరు పెట్టారు

నీలం సంజీవరెడ్డి -

నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు (శ్రీశైలం ప్రాజెక్టు) - కృష్ణా నది మీద, ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం వద్ద, కర్నూలు జిల్లా (ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు) - రాయలసీమకు చెందిన కృష్ణా నీటి ఆధారిత ప్రాజెక్టులైన గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి

ప్రాజెక్టులన్నిటికీ ప్రధాన వనరు - తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఈ పేరు పెట్టారు

నందమూరి తారక రామారావు -

NTR తెలుగు గంగ ప్రాజెక్టు - కృష్ణా జలాలను చెన్నై నగర తాగునీటి అవసరాలకు తరలించడానికి, రాయలసీమ - నెల్లూరు జిల్లాల సాగునీటి/

తాగునీటి అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు - 1984లో నాటి ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు NTR, MGR లు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ గార్ల సమక్షంలో శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు

అనంత వెంకటరెడ్డి -

అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి - కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి నాలుగు రాయలసీమ జిల్లాల సాగు / త్రాగునీటి అవసరాలకోసం వినియోగించడానికి సంకల్పించిన ప్రాజెక్టు. అంనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు,

రాజకీయ నాయకుడు, శాసన సభ / శాసన మండలి సభ్యునిగా, అనంతపురం ఎంపీగా వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తి. అనంతపురం జిల్లాకు నదీ జలాల మల్లింపుకు కృషిచేసిన అనంత వెంకటరెడ్డి గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు.

జెసి.నాగిరెడ్డి -

జెసి.నాగిరెడ్డి తాగునీటి పథకం - అనంతపురం జిల్లా

యెద్దుల ఈశ్వర రెడ్డి - యెద్దుల ఈశ్వర రెడ్డి రిజర్వాయర్ (గండికోట రిజర్వాయర్ ) - గండికోట వద్ద - పెన్నా - చిత్రావతి నదులు కలిసే చోటు, కడప జిల్లా - గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగం. తొలి కడప లోక్సభ సభ్యుడు, అయిన ఎద్దుల ఈశ్వర రెడ్డి గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు.

దామోదరంసంజీవయ్య - సంజీవయ్య సాగర్ (గాజులదిన్నె ప్రాజెక్టు) హంద్రీనది, గాజులదిన్నె గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా) - దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ దామోదరం సంజీవయ్య గారి పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టారు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి - శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్ (బ్రహ్మం సాగర్) - తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగం - బ్రహ్మంగారి మఠం వద్ద, కడప జిల్లా. కాలజ్ఞానాన్నిబోధించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు ప్రాజెక్టుకు పెట్టారు.

అన్నమయ్య - అన్నమయ్య ప్రాజెక్టు (చెయ్యేరు నది, బాదనగడ్డ గ్రామం వద్ద, రాజంపేట మండలం, కడప జిల్లా) - తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య రాజంపేట వద్దగల తాళ్ళపాక వాసి. ఆయనపేరే ఈ ప్రాజెక్టుకు పెట్టారు.

గురు రాఘవేంద్ర స్వామి-

గురు రాఘవేంద్ర ప్రాజెక్టు/గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇర్రిగేషన్ స్కీం -తుంగభద్రా నది మీదుగా, కర్నూలు జిల్లా- ప్రసిద్ధ మధ్వ మత యతీంద్రులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. వీరి బృందావనం, శ్రీమఠం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్నాయి. వీరి పేరునే ప్రాజెక్టుకు పెట్టారు

పుట్టపర్తి సాయిబాబా - సత్య సాయి గంగ కెనాల్ ( కండలేరు - పూండి కెనాల్ - (నెల్లూరు- చిత్తూరు జిల్లా), తెలుగు గంగ ప్రాజెక్టులో ఒక భాగం) - తిరుపతి పట్టణానికి ప్రధాననీటి వనరు - శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో కాలువ ఆధునీకరణ జరిగింది.

కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య -

K శ్రీరామకృష్ణయ్య పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ -పెన్నానది, కొర్రకోడు గ్రామం, కూడేరు మండలం, అనంతపురం జిల్లా - ప్రఖ్యాత జలరంగ నిపుణులు శ్రీ కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య గారి పేరు ప్రాజెక్టుకు పెట్టరు.

యోగి వేమన -

యోగి వేమన రిజర్వాయర్ - మద్దిలేరు నది (అడవి బ్రాహ్మణపల్లి తాండా, ముదిగుబ్బ, అనంతపురం) - ఇక్కడికి సమీపంలోని కటారుపల్లిలో యోగి వేమన సమాధి ఉంది. ఆయన స్మృత్యర్థం ఈ ప్రాజెక్టుకు యోగి వేమన పేరు పెట్టారు

తాతిరెడ్డి నరసింహారెడ్డి -

తాతిరెడ్డి తాతిరెడ్డి నరసింహారెడ్డి రిజర్వాయర్ - మైలవరం డ్యామ్ - పెన్నా నది మీద, మైలవరం గ్రామం, కడప జిల్లా - తాతిరెడ్డి నరసింహారెడ్డి గారు జమ్మలమడుగు శాసనసభ్యునిగా చేశారు.

పూల సుబ్బయ్య -

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - కృష్ణాజలాలను శ్రీశైలం నుండి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నీటిఅవసరాలకోసం మళ్లించే ప్రాజెక్టు - కమ్యూనిస్ట్ యోధుడు, మార్కాపురం శాసనసభ్యుడిగా చేసిన పూల సుబ్బయ్య గారి పేరు ఈప్రాజెక్టుకు పెట్టారు.

మరికొన్ని ప్రాజెక్టులు :

ఆదినారాయణ రెడ్డి పింఛ ప్రాజెక్టు - పింఛ నది మీద, పింఛ గ్రామం, సుండుపల్లె మండలం, కడప జిల్లా

నీలకంఠాపురం శ్రీరామి రెడ్డి - నీలకంఠాపురం శ్రీరామి రెడ్డి తాగునీటిప్రాజెక్టు (Neelakantapuram Sreerami Reddy PABR drinking water project) - అనంతపురం జిల్లా

కర్టెసీ : ఆంధ్ర పత్రిక , సాక్షి దినపత్రిక
అదనపు సమాచారం - సుధాకర్ గారు

#రాయలసీమ #Rayalaseema_Irrigation #Kurnool #Kadapa #Chittoor #Anantapur #Gandikota #Srisailam #GaleruNagari #TeluguGanga #Mylavaram #Gajuladinne #PABR

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling