పుట్టుపాపలు
నల్లమల అడవులు అనగానే శ్రీశైల మల్లన్న, అహోబిల లక్ష్మీనరసింహ స్వామి గుర్తుకొస్తారు. అంతేగాక వెంటనే చెంచు దొరలు కూడా గుర్తుకొస్తారు. నల్లమల అడవుల్లో ఉండే 'చెంచు'తెగ వారి గురించి అందరికీ తెలిసిందే. వీరిని ప్రభుత్వం Particularly Vulnerable Tribal Groups లో కూడా చేర్చింది
అయితే నల్లమల అడవుల్లో చెంచు తెగ వారే కాక, 'పుట్టపాప' అనే తెగ మనుషులు కూడా ఉండేవారు. వీరి వివరాలు మెకంజీ కైఫీయత్తుల్లో పొందుపరచబడి ఉన్నాయి (19వ శతాబ్దం మొదట్లో సేకరించబడిన వివరాలు). ఈ కైఫీయత్తుల ప్రకారం పుట్టుపాపలు సుమారు 4.5 అడుగుల ఎత్తుగల మనుషులు.
చెంచులు వస్త్రాలు ధరించేవారు కానీ పుట్టుపాపలు వస్త్రాలు ధరించేవారు కాదట. చెంచు తెగ వారి వద్ద ఉండే విల్లంబులు, బాణాలు వంటి ఆయిధలు కూడా పుట్టుపాపలతో ఉండేవి కాదట. అడవిలో జంతువులను వేటాడి పచ్చి మాంసమే తినేవారట. వాటితో పాటు కందమూలలు, అడవి పండ్లు వంటివి తిని బతికేవారట
మనుషులను చూస్తే మాత్రం వెంటనే అడవుల్లోకి పరిపోయేవారట.
అయితే ఈ 'పుట్టుపాప' తెగ గురించి కేవలం కైఫీయత్తుల్లో మాత్రమే సమాచారం దొరుకుతోంది. ఆ తర్వాత వచ్చిన కర్నూలు జిల్లా గజిటీర్ల లోనూ, మాన్యువల్లలోనూ వారికి సంబందించిన వివరాలేమీ లేవు. ప్రభుత్వం గుర్తించిన
తెగల జాబితాలోనూ వారి ప్రస్తావన లేదు. ఒకప్పుడు నల్లమల అడవులలో సంచరించిన ఈ తెగవారు ఏమయ్యారు అన్నది శేషప్రశ్న గానే మిగిలిపోయింది.
#Kurnool #Nallamala #సీమచరిత్ర
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
