తిరుమల తిరుపతి దేవస్థానముల-తొట్ట తొలి శాసనం
తిరుమల క్షేత్రం ఎంత పురాతనమైనది? అక్కడి ఆలయాలపై శిలాశాసనాలు ఏమి చెప్తున్నాయి? తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో అత్యంత పురాతన శాసనం ఏది?
దాదాపు 2000వేల సంవత్సరాల ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో తిరుమల ప్రస్తావన ఉంది.
-ప్రతీకాత్మక చిత్రం
ఈ కావ్యాలలో తిరుమలను వేంగడం గా పేర్కొనడం జరిగింది. పురాణాలు తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పేర్కొన్నాయి.
ఇక శాసనాల విషయానికి వస్తే తిరుమల- తిరుపతి ఆలయాల్లో లభ్యమవుతున్న శాసనాల్లో మొట్టమొదటి శాసనం పల్లవుల కాలంలో వేయించినది .
#TTD #Tirumala #Inscriptions #Chittoor
51సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించిన పల్లవ రాజు దంతివర్మ అధికారులు తిరుచానూరులో వేయించిన రెండు శాసనాలు అత్యంత పురాతన శాసనాలుగా తిరుమల శాసనాల పరిష్కర్త శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేర్కొన్నారు. దంతివర్మ క్రీ.శ. 795 నుండి 846 ( 830?) సంవత్సరం వరకు పాలించారు.
దంతివర్మ కాలం నాటి శాసనాలు తిరుచానూరులో రెండు లభ్యం అవుతుండగా, ఒక శాసనంలో విజయదంతి విక్రమర్ (దంతి వర్మ)51వ రాజ్య సంవత్సరం(అనగా రాజైన 51వ సంవత్సరం)లో శాసనం వేయించినట్టు, శోలనాడు లోని శోలనూరుకు చెందిన ఉలగప్పెరుమానార్ నిత్య దీపారాధన ఏర్పాటుకు కొంత బంగారం ఇచ్చినట్టు ఈ శాసనం చెబుతుంది
దీపం నిర్వహణకు ఉలగప్పెరుమానార్ ఇచ్చిన ద్రవ్యంతో కొంత భూమికొన్నారన్నది ఆ శాసన సారాంశం.
తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని ఈ శాసనం “తిరువేంకటత్తు ఎంపెరుమాండిగళ్” అని పేర్కొంటుంది. తిరువేంకట కొట్టం లోని కుడవూర్ నాడులో తిరుచానూరు పట్టణం ఉందని చెబుతుంది.
అంటే అప్పటికే తిరుమల క్షేత్రం/ తిరుమల కొండలు అత్యంత ప్రసిద్ధి చెందినవని పల్లవుల రాజ్యంలో తిరుమల కొండల పేర ( తిరువేంకట కొట్టం)ఒక పాలనా భూభాగం (ఉదయగిరి సీమ, రేనాటి సీమ లాగా) ఉందని తెలుస్తోంది. ఈ శాసన కాలాన్ని సుబ్రహమణ్య శాస్త్రిగారు క్రీ. శ 830 గా పేర్కొన్నారు
(దంతి వర్మ 51వ రాజ్య సంవత్సరం ఆధారంగా). అయితే దంతి వర్మ 51వ రాజ్య సంవత్సరం క్రీ. శ 846 అని ఇలా భిన్న వాదనలు ఉన్నాయి.
కాలమానం లేని రెండవ శాసనం విజయదంతి విక్రమదేవర పాలిస్తుండగా శీయగన్ / శీయగంగన్ అనే అతను దీపం ఏర్పాటుకు బంగారం సమర్పించాడు.
Source:
Tirumala, Tirupati Devasthanams Inscriptions - Vol 1 (By Shri Sadhu Subrhamanya Shastri )
Report on the Inscriptions of the Devasthanam - By Shri Sadhu Subrhamanya Shastri
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
