రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzxBuE Insta : https://t.co/g07orhy9UU YT: https://t.co/44nxdobW9n Strictly Personal Opinions

Jul 4, 2020, 6 tweets

విగ్రహం చెప్పే చరిత్ర : పుష్పగిరి - లకులీశుడు

లకులీశ / నకులీశ - లకుటము అంటే దుడ్డుకఱ్ఱ (దండము). లకులీశుడు అంటే లకుట ధారియైన ఈశ్వరుడు అని అర్థం. శైవమతంలో కాపాలిక, కాలముఖ, పాశుపత శైవం వంటి అనేక శాఖలు ఉన్నాయి. పాశుపత శైవం ఈశాఖలన్నిటిలోకి పురాతనమైనది.

కాలముఖ శైవం పాశుపత శైవం నుండి ఉద్భవించిందే.లకులీశుడు పాశుపత శైవమతం వ్యవస్థాపకుడని ఒక వాదన. లకులీశుడి కంటే ముందు నుండే పాశుపత శైవం ఉనికిలో ఉందని, పాశుపత మతాన్ని లకులీశుడు బాగా వ్యాప్తిలోకి తెచ్చాడని మరో వాదన. కాలముఖ శైవాన్ని ఆచరించేవారు కూడా లకులీశుడిని ఆరాధించేవారు.

లకులీశుడి విగ్రహాలు దేశమంతటా పాశుపత / కాలముఖ శైవం బాగా ప్రాచుర్యం ఉన్న ప్రదేశాలలో చూడవచ్చు. లకులీశుడు శివుని అవతారం అని మరో భావన ఉంది.

కడప జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం పుష్పగిరి. శైవులకు పుష్పగిరి నివృత్తి సంగమం ఇక్కడ ప్రాణాలు విడిస్తే పునర్జన్మ ఉండదని శైవులు

ఇక్కడి పంచనదీ సంగమంలో ఆత్మార్పణ చేసుకునేవారట. అందుకే పుష్పగిరిలో అడుగడుగునా వీరగల్లులు చూడవచ్చు. రాష్ట్రకూటులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, వైదంబులు, కాయస్థులు, విజయనగరాధీశులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధిపరచి మాన్యాలు సమర్పించారు.

అంతటి ఘనచరిత్ర కలిగిన పుష్పగిరిలో అనేక వీరగల్లులతో పాటు లకులీశుడి విగ్రహం కూడా చూడవచ్చు. అంటే ఒకప్పుడు ఇక్కడ పాశుపత శైవం / కాలముఖ శైవం బాగా ప్రాచుర్యంలో ఉండేదని స్పష్టమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో పాశుపత / కాలముఖ శైవుల ప్రధాన కేంద్రం శ్రీపర్వతం (శ్రీశైలం).

తెలుగు రాష్ట్రాలలో లకులీశుడు విగ్రహం ఉండడం అరుదు. ఈసారి పుష్పగిరి సందర్శించినప్పుడు వైద్యనాథస్వామి ఆలయ ప్రాంగ ణంలో ఉన్న లకులీశుడి విగ్రహం దర్శించుకోండి.

#పుష్పగిరి #సీమచరిత్ర #Pushpagiri #Kadapa

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling